• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రైతు దీక్షలో షాకింగ్: 25 ఏళ్ల మహిళ కిడ్నాప్..గ్యాంగ్‌రేప్: ఆసుపత్రిలో కరోనా లక్షణాలతో

|

న్యూఢిల్లీ: దేశ రాజధాని సరిహద్దుల్లో సుదీర్ఘకాలంగా కొనసాగుతోన్న రైతు నిరసన దీక్షల్లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఈ దీక్షల్లో పాల్గొన్న ఓ మహిళ సామూహిక అత్యాచారానికి గురయ్యారు. కామాంధుల చేతుల్లో నరకాన్ని చవి చూసిన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆసుపత్రిలో అడ్మిట్ అయిన అనంతరం ఆమెకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలింది. ఆమెపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన ఘటనతో ప్రమేయం ఉందనే కారణంతో పోలీసులు ఆరుమందిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ సందర్భంగా వారు తమ నేరాన్ని అంగీకరించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

రైలులో రేప్.. బ్లాక్ మెయిల్..

రైలులో రేప్.. బ్లాక్ మెయిల్..

కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఉత్తరాది రాష్ట్రాల రైతులు సుదీర్ఘకాలం పాటు దేశ రాజధాని సరిహద్దుల్లో నిరసన ప్రదర్శనలు, ఆందోళనలను కొనసాగిస్తోన్నవిషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ మహిళ ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. ఢిల్లీ-హర్యానాలను అనుసంధానించే టిక్రీ బోర్డర్ వద్ద ఆమె దీక్షా శిబిరంలో ఉంటున్నారు. ఆదివారం రాత్రి ఆమెపై ఆరుమంది అత్యాచారానికి పాల్పడ్డారు.

 సిట్ దర్యాప్తులో

సిట్ దర్యాప్తులో

ఈ ఘటనపై సత్వర విచారణ చేపట్టడానికి హర్యానా ప్రభుత్వం ప్రత్యేకంగా దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైన వెంటనే సిట్ అధికారులు రంగంలోకి దిగారు. ఆరుమందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను అనిల్ మలిక్, అనూప్ సింగ్, అంకుశ్ సంగ్వాన్, జగదీష్ బ్రార్‌‌గా గుర్తించారు. వారితో పాటు మరో ఇద్దరు మహిళల పేర్లను ఎఫ్ఐఆర్‌లో చేర్చారు. వారిపై ఐపీసీ సెక్షన్‌లోని 365, 342, 376-డీ, 506, 120-బీ కింద కేసు నమోదు చేశారు. టిక్రీ బోర్డర్ వద్ద కొనసాగుతోన్న నిరసన దీక్షలను కిసాన్ సోషల్ ఆర్మీ పర్యవేక్షిస్తోంది.

ఏప్రిల్ 12 నుంచి దీక్షా శిబిరంలో..

ఏప్రిల్ 12 నుంచి దీక్షా శిబిరంలో..

రైతు దీక్షలో భాగంగా కిసాన్ సోషల్ ఆర్మీ ప్రతినిధులు కిందటి నెల 1వ తేదీన పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ వద్ద బహిరంగ సభను నిర్వహించారు. ఆ సభలో బాధితురాలు పాల్గొన్నారు. కిసాన్ సోషల్ ఆర్మీ ప్రతినిధులతో ఆమెకు పరిచయం ఏర్పడింది. బాధితురాలు హుగ్లీకి చెందిన ఓ డిజైనర్ ప్లస్ ఆర్టిస్ట్. వామపక్ష భావజాలం ఉన్న ఆమె కరోనా వైరస్ వంటి సంక్లిష్ట పరిస్థితుల్లోనూ కిందటి నెల 12వ తేదీన రైతు వ్యతిరేక దీక్షకు హాజరయ్యారు. టిక్రీ బోర్డర్ వద్ద నిరసన శిబిరంలో ఉంటున్నారు. హుగ్లీ నుంచి ఢిల్లీకి రైలులో బయలుదేరిన సమయంలో ఆమెను నిందితులు అత్యాచారం చేశారని, అనంతరం బ్లాక్ మెయిల్ చేస్తూ ఈ ఘాతుకాన్ని కొనసాగించారని తండ్రి ఆరోపించారు.

  Telangana : ధాన్యం కొనుగోలు సెక్టార్లని తనిఖీ చేసిన మంత్రి హరీష్ రావు!!
  కరోనా సోకిందని తెలిసీ..

  కరోనా సోకిందని తెలిసీ..


  టిక్రీ బోర్డర్ వద్ద దీక్షా శిబిరంలో కూడా తరచూ తన కుమార్తెపై నిందితులు సామూహిక అత్యాచారానికి పాల్పడే వారని చెప్పారు. కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో కిందటి నెల 30వ తేదీన ఆసుపత్రిలో చికిత్స తీసుకుందని, డిశ్చార్జ్ అయిన తరువాత కూడా అత్యాచారాన్ని కొనసాగించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా- ఆమె మరణించడంతో తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారిని అరెస్ట్ చేశారు.

  English summary
  Jhajjar: A woman from West Bengal was allegedly gang-raped by two men whom she accompanied to the farmers' protest site at Tikri border. The victim died at a Jhajjar hospital after showing COVID-like symptoms.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X