వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైద్య ఖర్చుల కోసం ఆడబిడ్డను హతం చేసిన వదిన...! భర్తకు భారమని కుట్ర

|
Google Oneindia TeluguNews

భర్త కుటుంబ భాద్యతల్లో పాలుపంచుకోవాల్సిన ఓ భార్య పెళ్లై సంవత్సరం తిరకముందే హంతకురాలైంది. తన స్వార్థమో ..లేక కుటుంబపోషణ కోసం భర్త ఇబ్బందులు పడుతున్నాడనో ఆలోచనో ఆమెను ఎనిమిదేళ్ల వయస్సున్న ఆడబిడ్డను హతమార్చింది. అప్పటికే ఆనారోగ్యంతో బాధపడుతున్న చిన్నారిని హత్య చేస్తే ఎలాంటీ అనుమానాలు రావనుకుని హత్యకు ప్లాన్ చేసింది. మూర్చవ్యాధి ఉన్న ఆడబిడ్డను బావిలో తోసి హత్య చేసింది. అనంతంర ఏమీ తెలియనట్టు భర్తముందు వ్యవహరించింది. అయితే జరిగిన సంఘటనపై అనుమానాలతో విచారిస్తే అసలు విషయం బయటపడింది.

తల్లిని కోల్పోయిన పిల్లలు

తల్లిని కోల్పోయిన పిల్లలు

తమిళనాడులో శనివారం జరిగిన ఈ సంఘటన సంచలనం సృష్టించింది. రాష్ట్రంలోని తురుప్పూర్ జిల్లా సమీపంలో కాంగేయం గ్రామానికి చెందిన శ్రీరంగన్ , తిరుమయి దంపతులకు కార్తిక్ మరియు కలైవాణి అనే సంతానం ఉన్నారు. అయితే కొద్ది రోజుల క్రితం తల్లి తిరుమయి చనిపోవడంతో కార్తిక్ కలైవాణిలిద్దరు అమ్మమ్మ వద్ద ఉంటున్నారు. అయితే ప్రస్తుతం కార్తిక్ పెద్దవాడు కావడంతో ఆయనకు షామిలి అనే యువతితో వివాహం చేశారు.

చెల్లెలి బాధ్యతను భుజాన వేసుకున్న అన్న

చెల్లెలి బాధ్యతను భుజాన వేసుకున్న అన్న

ఇక చెల్లెలు కలైవాని భాద్యత అంతా అన్న కార్తిక్ చూసుకుంటున్నాడు. ఈనేపథ్యంలోనే ఎనిమది సంవత్సరాల వయస్సున్న కలైవాని మూడవ తరగతి చదువుతోండగా.. మూర్చవ్యాధితో భాదపడుతుంది. దీంతో అందుకు సంబంధించిన చికిత్సను కార్తిక్ చూస్తున్నాడు. దీంతో కొంత ఆర్ధికంగా ఎక్కువమొత్తంలో చెల్లెలి చికిత్స కోసం ఖర్చుపెడుతున్నాడు. అయితే ఇది నచ్చని భార్య షామిలి అడబిడ్డను వదలించుకోవాలని చూసింది. ఇలాగే ఉంటే భర్త సంపాదన అంతా ఆమెకే పెట్టె అవకాశాలు ఉన్నాయని భావించింది.

భర్తకు భారం అవుతుందని హత్యకు కుట్ర

భర్తకు భారం అవుతుందని హత్యకు కుట్ర

దీన్ని మనసులో పెట్టుకుని అదను కోసం వేచి చూసింది. దీంతో మూర్చవ్యాధితో బాధపడుతున్న కలైవానిని ఓ రోజు దగ్గరిలోని బావి వద్దకు తీసుకెళ్లింది. బావిలోకి తొంగి చూడమని చెప్పి అందులోకి తోసి వేసింది. అయితే చిన్నారీ మృతిపై భర్త అనుమానాలు వ్యక్తం చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు వారి స్టైల్లో విచారణ చేయడంతో షామిలి అసలు విషయం బయటపెట్టింది. అనంతరం ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

English summary
a woman was arrested allegedly killed her sister-in-law by throwing in Well in tamilnadu.because of medical expensives.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X