వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వప్న ప్రియ స్వప్న, ఫేస్ బుక్ ఫోటోకు ఫిదా, లవ్, రూ. 15 లక్షలు, ఆమె కాదు అతడు, గోవిందా !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/హుబ్బళి: ఫేస్ బుక్ అందమైన అమ్మాయి ఫోటో చూసి మనసు పారేసుకున్న యువకుడు నిలునా మోసోయాడు. తన అందాల రాణి చెప్పిన అకౌంట్ లకు రూ. 15లక్షల రూపాయుల బదిలీ చేసిన యువకుడు చివరికి మోసం జరిగిందని పోలీసులను ఆశ్రయించాడు. ఫేస్ బుక్ లో, వాట్సాప్ లో నిత్యం తనతో చాటింగ్ చేసి అందమైన కబుర్లు చెప్పిన యువతి మోసం చేస్తుందని ఆ యువకుడు కలలో కూడా ఊహించలేకపోయాడు. అయితే ఫేస్ బుక్ లోని అందమైన యవతి ఫోటో వెనుక చాల పెద్ద కథ ఉందని అతను పసిగట్టలేకపోయాడు.

ఊరకుక్కలా వెంటపడిన అన్న, కోరిక తీర్చాలని లైంగిక వేధింపులు, కొడవలితో నరికి చంపేసింది!ఊరకుక్కలా వెంటపడిన అన్న, కోరిక తీర్చాలని లైంగిక వేధింపులు, కొడవలితో నరికి చంపేసింది!

రెండేళ్ల క్రితం ఫేస్ బుక్ లో !

రెండేళ్ల క్రితం ఫేస్ బుక్ లో !

కర్ణాటకలోని హుబ్బళి నగరం సమీపంలోని రాయనాళ గ్రామానికి చెందిన రుద్రేగౌడ మల్లనగౌడ పాటిల్ అనే యువకుడికి 2017లో ఫేస్ బుక్ లో స్వప్న అనే అందమైన అమ్మాయి ఫోటో కనిపించింది. అంతే ఫేస్ బుక్ లో స్వప్న ఫోటో చూసిన రుద్రేగౌడ పాటిల్ ఎలాగైనా ఆమెతో పరిచయం పెంచుకోవాలని అనుకున్నాడు.

స్వప్న అందానికి ఫిదా

స్వప్న అందానికి ఫిదా

స్వప్న అందానికి ఫిదా అయిపోయిన రుద్రేగౌడ పాటిల్ చివరికి ఆమెను సోషల్ మీడియాలోనే సంప్రధించాడు. మనం ఇద్దరం స్నేహితులుగా ఉందామని రుద్రేగౌడ స్వప్నకు మనవి చేశాడు. తరువాత ఇద్దరూ ఫేస్ బుక్, వాట్సాప్ లో చాటింగ్ చెయ్యడం మొదలు పెట్టారు.

ఫోన్ లో మాట్లాడటం సాధ్యం కాదు

ఫోన్ లో మాట్లాడటం సాధ్యం కాదు

2017 నుంచి 2018 వరకు ఫేస్ బుక్, వాట్సాప్ లో చాటింగ్ చేసిన రుద్రేగౌడ పాటిల్ ఓ సారి నీతో ఫోన్ లో మాట్లాడాలని స్వప్నకు మేసేజ్ పంపించాడు. తనకు మాటలు రావని, నేరుగా కలుసుకున్నప్పుడు సైగలతో మాట్లాడుకుందామని స్వప్న నుంచి సమాధానం వచ్చింది. అయ్యో పాపం ఇంత అందమైన అమ్మాయి మూగదా అని రుద్రేగౌడ పాటిల్ ఆమెకు సానుభూతి వ్యక్తం చేశాడు. తరువాత నీతో తాను ప్రేమలో పడిపోయానని రుద్రేగౌడ పాటిల్ ను స్వప్న నమ్మించింది.

భలే మంచి చాన్స్ అంటూ రూ. 15 లక్షలు

భలే మంచి చాన్స్ అంటూ రూ. 15 లక్షలు

స్వప్న తనను ప్రేమిస్తోందని రుద్రేగౌడ పాటిల్ పూర్తిగా నమ్మేశాడు. ఇంత కాలం చాటింగ్ చేస్తూ వచ్చిన రుద్రేగౌడ పాటిల్ అసలు విషయం తెలుసుకోలేకపోయాడు. స్వప్న మూగదని నమ్మిన రుద్రేగౌడ పాటిల్ ఆమె చెప్పిన అకౌంట్ నెంబర్లకు ఇంత వరకు సుమారు రూ. 15 లక్షలకు పైగా నగదు పంపించాడు. అయితే ఇటీవల స్వప్న ఫేస్ బుక్ అకౌంట్ తో పాటు వాట్సాప్ లో అందుబాటులోకి రాకపోవడంతో రుద్రేగౌడ పాటిల్ అయోమయంలో పడిపోయాడు.

ఆమె కాదు అతడు

ఆమె కాదు అతడు

ఇటీవల వరకు స్వప్న నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో రుద్రేగౌడ పాటిల్ కు అనుమానం వచ్చింది. అంతే మోసం జరిగిందని ఆలస్యంగా గుర్తించిన రుద్రేగౌడ పాటిల్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. విచారణ చేసిన పోలీసులు ఇంత కాలం రుద్రేగౌడ పాటిల్ తో ఫేస్ బుక్, వాట్సాప్ లో చాటింగ్ చేసింది ఆమె కాదు అతడు అని తెలుసుకున్నారు. విషయం తెలుసుకున్న రుద్రేగౌడ పాటిల్ కు మతిపోయింది.

గౌడను మోసం చేసిన గౌడ

గౌడను మోసం చేసిన గౌడ

ఇంత కాలం తనతో చాటింగ్ చేసింది స్వప్న కాదని, హాసన్ జిల్లాలోని దోడ్డగణిగేరి గ్రామానికి చెందిన ప్రతాప్ గౌడ మూర్తి అని తెలుసుకుని షాక్ కు గురైనాడు. రుద్రేగౌడ పాటిల్ ను మోసం చేసిన ప్రతాప్ గౌడ మూర్తిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు అన్నారు. ఫేస్ బుక్ లో పరిచయం అయిన వ్యక్తులను గుడ్డిగానమ్మి డబ్బులు పంపిస్తే ఇలాగే ఉంటుందని, జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు యువతను హెచ్చరిస్తున్నారు.

English summary
A young boy in a hubballi has been frauded 15 lakhs by fake account of girl in facebook in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X