బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Coronavirus: కరోనా పాజిటివ్, ‘ఆరు’నూరైనా పెళ్లి జరగాలి, శోభనం మమా, అంతలోనే అంత్యక్రియలు !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ మంగళూరు: ప్రపంచం మొత్తం కరోనా వైరస్ (COViD 19) మహమ్మారి దెబ్బకు విలవిలలాడుతోంది. భారతదేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 6 లక్షలకు చేరింది. కరోనా వైరస్ వ్యాధితో జాగ్రత్తగా ఉండాలని సూచించిన ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు చేశారు. అయితే పెళ్లి కొడుకుకి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నాయని తెలిసినా అతనికి కుటుంబ సభ్యులు ఆ విషయం దాచిపెట్టి గుట్టుచప్పుడు కాకుండా ఆరునూరైనా పెళ్లి జరిగిపోవాలని పంతంపట్టి పెళ్లి జరిపించేశారు. శోభనం జరిగిన ఐదు రోజులకే పెళ్లి కొడుకు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నాయని తెలిసినా పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు పెళ్లి కుమార్తెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, బంధువుల ప్రాణాలతో చెలగాటం ఆడారని వెలుగు చూడటంతో వారి మీద క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలని ఉత్తర కన్నడ జిల్లా కలెక్టర్ హరీష్ కుమార్ ఆదేశాలు జారీ చెయ్యడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

Lockdown murder: భర్తకు దిక్కులేని ఆస్తి, భార్యకు ఫేస్ బుక్ ప్రియులు, సినిమా స్కెచ్, హైవేలో ఫినిష్Lockdown murder: భర్తకు దిక్కులేని ఆస్తి, భార్యకు ఫేస్ బుక్ ప్రియులు, సినిమా స్కెచ్, హైవేలో ఫినిష్

 బెంగళూరులో హ్యాపీ లైఫ్

బెంగళూరులో హ్యాపీ లైఫ్

కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా బత్కల్ ప్రాంతానికి చెందిన 25 ఏళ్ల యువకుడు బెంగళూరు చేరుకుని విద్యాభ్యాసం చేశాడు. బెంగళూరులో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆ యువకుడు అక్కడే ఉద్యోగం చేస్తూ హ్యాపీగా జీవితం సాగిస్తున్నాడు. బత్కల్ కు చెందిన యువకుడి కుటుంబ సభ్యులు ప్రస్తుతం మంగళూరులో కాపురం ఉంటున్నారు. యువకుడికి పెళ్లి చెయ్యాలని అతని కుటుంబ సభ్యులు చాలా ప్రయత్నాలు చేశారు. అయితే కరోనా వైరస్ తాండవం చేస్తున్న సమయంలో లాక్ డౌన్ విధించిన తరువాత ఆ యువకుడికి బత్కల్ ప్రాంతంలోనే వారికి నచ్చిన పెళ్లి కుమార్తె చిక్కింది.

 పెళ్లి కొడుక్కి ఏం కాలేదు ?

పెళ్లి కొడుక్కి ఏం కాలేదు ?

బెంగళూరులో ఉంటున్న బత్కల్ యువకుడికి వివాహం నిశ్చయం కావడంతో వారం రోజుల క్రితం అతను మంగళూరు వెళ్లాడు. తరువాత మంగళూరు నుంచి కుటుంబ సభ్యులతో కలిసి సొంత ఊరు అయిన బత్కల్ చేరుకున్నాడు. బత్కల్ వెళ్లినప్పటి నుంచి పెళ్లి కొడుకు దగ్గు, జలుబు, జ్వరంతో భాదపడుతున్నాడు. తనకు అనారోగ్యంగా ఉందని పెళ్లి కొడుకు అతని కుటుంబ సభ్యులకు చెప్పాడని తెలిసింది. అయితే నీకు ఏమీ కాదులే అని పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు నిర్లక్షంగా వ్యవహరించారని తెలిసింది.

‘ఆరు'నూరైనా పెళ్లి జరగాలి..... అంతే !

‘ఆరు'నూరైనా పెళ్లి జరగాలి..... అంతే !

పెళ్లి కొడుకు అనారోగ్యంతో భాదపడుతున్నాడని తెలిసినా అతని కుటుంబ సభ్యులు చాలా నిర్లక్షంగా వ్యవహరించారు. ఆరునూరైనా సరే అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిగిపోవాలని పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. పెళ్లి కొడుకు అనారోగ్యంతో ఉన్న విషయాన్ని పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యుల దగ్గర దాచిపెట్టిన అతని కుటుంబ సభ్యులు నాలుగు రోజుల క్రితం బత్కల్ లో పెళ్లి జరిపించారు. తరువాత పెళ్లి కొడుకు, పెళ్లి కుమార్తె వారి కుటుంబ సభ్యులు మంగళూరు చేరుకున్నారు.

 శోభనం జరిగిపోయింది.... తరువాత ?

శోభనం జరిగిపోయింది.... తరువాత ?

పెళ్లి జరిగిన రోజే నవవధూవరుల శోభనం జరిగిపోయింది. శోభనం జరిగిన మరుసటి రోజు పెళ్లి కొడుకు తీవ్రఅనారోగ్యానికి గురై కుప్పకూలిపోయాడు. వెంటనే పెళ్లి కొడుకుని మంగళూరులోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రిలో కూడా ఆ యువకుడికి పెళ్లి జరిగిన విషయం దాచిపెట్టారు. పెళ్లి కొడుకు ఊపిరి పీల్చుకోవడంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. వైద్యులు అతనికి రక్తం సేకరించి ల్యాబ్ కు పంపించారు.

 ఫస్ట్ నైట్ జరిగిన ఐదు రోజులకే పాడికట్టేశారు

ఫస్ట్ నైట్ జరిగిన ఐదు రోజులకే పాడికట్టేశారు

కరోనా వైరస్ లక్షణాలతో తీవ్రఅనారోగ్యానికి గురైన పెళ్లి కొడుకు చికిత్స విఫలమై బుధవారం ఆసుపత్రిలోనే మరణించాడు. వైద్యులకు అనుమానం వచ్చి పోలీసులకు, ఆరోగ్య శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, వైద్య శాఖ అధికారులు ఆసుపత్రి చేరుకుని పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులను విచారణ చెయ్యడంతో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. అదే సమయంలో పెళ్లి కొడుక్కి కరోనా పాజిటివ్ అని వైద్య నివేదిక వచ్చింది.

 ఎంతపని చేశారు !

ఎంతపని చేశారు !

పెళ్లికి వారం రోజుల ముందే పెళ్లి కొడుకు అనారోగ్యానికి గురైనాడని, ఆ విషయం దాచిపెట్టి అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిగిపోవాలని ఆ విషయాన్ని పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యుల దగ్గర దాచిపెట్టారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. పెళ్లి కొడుకు విషయాన్ని దాచిపెట్టి పెళ్లి చెయ్యడం, శోభనం కూడా జరిగిపోవడం, వరుడు మరణించడంతో అందరూ షాక్ కు గురైనారు. పెళ్లి కుమార్తెతో సహ ఆమె కుటుంబ సభ్యులు, పెళ్లి కొడుకు కుటుంబ సభ్యులు, పెళ్లికి హాజరైన బంధువులను క్వారంటైన్ కు తరలించారు.

Recommended Video

Ravikumar మరణం పై స్పందించిన Chest Hospital వర్గాలు! || Oneindia Telugu
 మీరు మనుషులా ? మూర్ఖులా

మీరు మనుషులా ? మూర్ఖులా

పెళ్లి కొడుకు అనారోగ్యం విషయాన్ని దాచిపెట్టి గుట్టుగా పెళ్లి చేసిన అతని కుటుంబ సభ్యులను మీరు మనుషులా ? మూర్ఖులా ? అని పెళ్లి కుమార్తె కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. కరోనా లక్షణాలు ఉన్నాయని తెలిసినా ఆ విషయం ఆరోగ్యా శాఖ అధికారులు చెప్పలేదని, అంటు వ్యాధులు వ్యాపించడానికి కారణం అయ్యారని, అనేక మంది ప్రాణాలతో చెలగాటం ఆడారని ఆరోపిస్తూ పెళ్లి కొడుకు కుటుంబ సభ్యుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ చెయ్యాలని ఉత్తర కన్నడ జిల్లా కలెక్టర్ హరీష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని మంగళూరు సిటీ పోలీసులు తెలిపారు.

English summary
Coronavirus: A young man from Bhatkal, who died after marriage recently has Coronavirus positive informed Uttara Kannada district DC Harishkumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X