బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బెంగళూరులో ఎమ్మెల్యేపై హత్యాయత్నం, అదే ఇంటిలో నిందితుడి తల్లి పనిమనిషి!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగరంలోని హెబ్బాళ శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యే (కాంగ్రెస్) ఎమ్మెల్యే భైరతి సురేష్ మీద హత్యాయత్నం జరిగింది. కత్తితో ఎమ్మెల్యే సురేష్ మీద హత్యాయత్నం చేసిన శివకుమార్ అనే వ్యక్తిని గన్ మెన్, ఇతరులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఎందుకు తన మీద హత్యాయత్నం జరిగిందో అర్థం కావడం లేదని, తనకు ఎవ్వరూ శత్రువులు లేరని ఎమ్మెల్యే భైరతి సురేష్ అంటున్నారు.

రాసలీలల దెబ్బతో భర్తను రూ. 5 లక్షలకు అమ్మేసిన భార్య, కొనుక్కున్న ప్రియురాలు !రాసలీలల దెబ్బతో భర్తను రూ. 5 లక్షలకు అమ్మేసిన భార్య, కొనుక్కున్న ప్రియురాలు !

మాట్లాడే నెపంతో !

మాట్లాడే నెపంతో !

కేఆర్ పురంలోని భైరతీ ప్రాంతంలో ఎమ్మెల్యే భైరతి సురేష్ నివాసం ఉంటున్నారు. శుక్రవారం మద్యాహ్నం శివకుమార్ అనే వ్యక్తి ఎమ్మెల్యే భైరతి సురేష్ తో మట్లాడే నెపంతో ఇంటి దగ్గరకు వెళ్లాడు. ఆ సమయంలో శివకుమార్ వెంట తీసుకెళ్లిన కత్తి తీసుకుని ఎమ్మెల్యే భైరతి సురేష్ మీద దాడి చెయ్యడానికి ప్రయత్నించాడు. అయితే భైరతి సురేష్ తృటిలో తప్పించుకున్నారు.

ఎమ్మెల్యే ఇంటిలో తల్లి పని మనిషి

ఎమ్మెల్యే ఇంటిలో తల్లి పని మనిషి

ఈ విషయంపై ఓ ప్రైవేటు టీవీ చానల్ తో మాట్లాడిన భైరతి సురేష్ శివకుమార్ తల్లి తన ఇంటిలోనే పని చేస్తున్నదని అన్నారు. శివకుమార్ చిన్నప్పటి నుంచి తనకు తెలుసని, అతను పేద కుటుంభానికి చెందిన వాడని, అన్ని విషయాల్లో వీరికి అండగా ఉన్నామని ఎమ్మెల్యే భైరతి సురేష్ చెప్పారు.

సొంత ఇల్లు కట్టించాం

సొంత ఇల్లు కట్టించాం

శివకుమార్ తల్లికి తాము సొంత ఇల్లు కట్టించి ఇచ్చామని, అయినా తన మీద హత్యాయత్నం చేశాడని ఎమ్మెల్యే భైరతి సురేష్ విచారం వ్యక్తం చేశారు. రాజకీయంగా, వ్యాపారపరంగా తనకు ఎవ్వరూ శత్రువులు లేరని, తన మీద హత్యాయత్నం జరిగిన విషయం తనను ఎంతో షాక్ కు గురి చేసిందని ఎమ్మెల్యే భైరతి సురేష్ అన్నారు.

హోం మంత్రి ఫోన్

హోం మంత్రి ఫోన్

మొదట శివకుమార్ తన కారును గుద్ది కొంచెం ముందుకు వెళ్లాడని, తరువాత వెనక్కి వచ్చి కత్తితో దాడి చెయ్యడానికి ప్రయత్నించాడని భైరతి సురేష్ చెప్పారు. శివకుమార్ ఎందుకు ఇలా చేశాడో అర్థం కావడం లేదని, పోలీసులు అతన్ని విచారణ చేస్తున్నారని భైరతి సురేష్ అన్నారు. తన మీద హత్యాయత్నం జరిగిందని తెలుసుకున్న తరువాత హోం మంత్రి ఫోన్ చేసి తనతో మాట్లాడారని, భద్రత పెంచుతామని హామీ ఇచ్చారని భైరతి సురేష్ అన్నారు.

 కారు ప్రమాదంతో కక్ష

కారు ప్రమాదంతో కక్ష

కొత్తనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కారును బైక్ ఢీకొనింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే భైరతి సురేష్ కారు నెంబర్ ప్లేట్ దెబ్బ తినిందని బెంగళూరు ఈశాన్య విభాగం డీసీపీ భీమాశంకర్ గూళేద్ మీడియాకు చెప్పారు. కారు ప్రమాదం జరిగిన సమయంలో గొడవ జరిగిందని, ఇదే విషయంలో ఎమ్మెల్యే భైరతి సురేష్ మీద హత్యాయత్నం జరిగిందని డీసీపీ భీమాశంకర్ వివరించారు.

ఉప ఎన్నికల కుట్ర ?

ఉప ఎన్నికల కుట్ర ?

ద్వేష రాజకీయాల్లో భాగంగా భైరతి సురేష్ మీద హత్యాయత్నం జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. భైరతి సురేష్ సోదరుడు, కేఆర్ పురం ఎమ్మెల్యే భైరతి బసరాజ్ మీద అనర్హత వేటు పడింది. త్వరలో కేఆర్ పురంలో జరగనున్న ఉప ఎన్నికల్లో భైరతి సురేష్ కుటుంబ సభ్యులు పోటీ చెయ్యకుండా అడ్డుకోవడానికి వారి కుటుంబ సభ్యుల మీద హత్యాయత్నం జరిగిందని భైరతి సురేష్ అనుచరులు ఆరోపిస్తున్నారు.

English summary
Bengaluru: A youth tried to kill Hebbal MLA Byrathi Suresh on Friday with knife was captured by MLA's gunmen in Byrathi village.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X