వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నకిలీలకు చెక్ పెట్టేందుకే: డ్రైవింగ్ లైసెన్స్ కు ఆధార్ తప్పనిసరి

డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొనేందుకుగాను నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొనేవారు ఆధార్ కార్డు వివరాలను తప్పనిసరిగా అందజేయాలని కేంద్రం ఆదేశించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొనేందుకుగాను నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది. కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొనేవారు ఆధార్ కార్డు వివరాలను తప్పనిసరిగా అందజేయాలని కేంద్రం ఆదేశించింది.

ఒకే పేరు మీద ఒకటి కంటే ఎక్కువ లైసెన్సులు పొందే వారిని అడ్డుకొనేందుకుగాను ఈ చర్యలను చేపట్టింది. ప్రస్తుతం చట్టాన్ని అతిక్రమించి ఎక్కువ డ్రైవింగ్ లైసెన్సులు పొందుతున్నారు.ఎవరైనా ట్రాఫిక్ పోలీసులు లైసెన్స్ రద్దుచేస్తే మరో దాన్ని ఉపయోగిస్తున్నారు.

aadhaar to be mandatory for driving licence

ఈ ఏడాది అక్టోబర్ నుండి డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఆధార్ ను తప్పనిసరి నిబంధన అమల్లోకి రానుంది. దీంతో వివిధ రాష్ట్రాల్లోని ఆర్టీవో కార్యాలయాల్లో ఒకటి కంటే ఎక్కువ సంఖ్యలో డ్రైవింగ్ లైసెన్సులు పొందే అవకాశం ఉండదు.

ఇప్పటికే నేషన్ ఇన్పోమాటిక్ నెంబర్ ఆర్టీవో కార్యాలయాల నుండి డేటాబేస్ ను సేకరించింది. ఈ డేటాబేస్ తో ధరఖాస్తుదారుడు గతంలో ఏమైనా డ్రైవింగ్ లైసెన్సులు పొందారా లేదా అనే విషయాన్ని ఎక్కడి నుండైనా చెక్ చేయవచ్చు.

దీనికి సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వశాఖ చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం లైసెన్స్ జారీ చేసే విషయంలో తీసుకోవాల్సిన మార్పులు వివరిసతారు. ప్రభుత్వం అంచనా ప్రకారంగా ఇప్పటివరకు 18 కోట్లకు పైగా డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేసినట్టు సమాచారం.

English summary
in a move to check multiple driving liceses under on name, the centre will ask states to make aadhaar identification necessary for a new licence as well as for those seeking renewal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X