• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఆధార్ బయోమెట్రిక్ లాక్‌: ఇలా చేస్తే ఆధార్‌ లాకర్‌లో ఉన్నట్లే!

By BBC News తెలుగు
|

సిమ్‌కార్డు నుంచి పాన్‌కార్డు వరకు ఆధారే అన్నింటికీ ఆధారం. అన్ని ప్రభుత్వ పథకాలకు సర్కార్ ఆధార్‌ లింకు పెడుతోంది. దాంతో ఆధార్ నెంబర్ ఇవ్వక తప్పని పరిస్థితి.

కంటిపాప, వేలిముద్రలు, చిరునామా, ఫోన్‌ నెంబర్‌ సహా అన్ని వ్యక్తిగత వివరాలు ఆధార్‌లో ఉంటాయి.

అత్యంత గోప్యంగా ఉండాల్సిన ఈ సమాచారం నేరగాళ్ల చేతికి చిక్కితే నష్టం అపారం.

500 రూపాయలకే ఆధార్ డేటాను అమ్ముకుంటున్నారని వార్తా కథనాలు వచ్చాయి.

ఇది నిజం కాదని ప్రభుత్వం చెబుతున్నా..ప్రజల్లో ఆందోళన మాత్రం కొనసాగుతోంది.

మరి, ఆధార్ డేటా భద్రంగా ఉండాలంటే ఏం చేయాలి?

ఇలా చేస్తే ఆధార్‌ లాకర్‌లో ఉన్నట్లే!

ఆధార్ సమాచారం దుర్వినియోగం కాకుండా చేసేందుకు 'యునిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్ ఇండియా'-యూఐడీఏఐ వెబ్‌సైట్‌లో ఒక ఆప్షన్ ఉంది.

అదే బయోమెట్రిక్ లాక్. అంటే మన ఆధార్‌ డేటా దుర్వినియోగం కాకుండా లాక్‌చేయడం అన్నమాట.

ఈ ఫీచర్‌ ఎప్పటి నుంచో ఉంది. కానీ చాలామందికి పెద్దగా తెలియదు.

ఆధార్ బయోమెట్రిక్ అంటే?

ఆధార్ బయోమెట్రిక్‌లో ఒక వ్యక్తి కనుపాపలు, వేలిముద్రలు ఉంటాయి.

బ్యాంకు లావాదేవీలు, సిమ్‌కార్డుల కొనుగోలు సహా వ్యక్తిగత ధ్రువీకరణ కోసం వీటిని ఉపయోగిస్తారు.

ఆధార్ వ్యక్తిగత సమాచారానికి బయోమెట్రిక్ లాక్ వల్ల అదనపు భద్రత లభిస్తుంది.

ఆధార్ ఫొటో

'బయోమెట్రిక్‌ లాక్‌' ఎలా చేయాలి?

ఆధార్‌ బయోమెట్రిక్ లాక్‌ ఉపయోగించడం చాలా సులభం.

ముందుగా ఆధార్‌ వెబ్‌సైట్‌ లోకి వెళ్లాలి.

ఆ పేజీలో కుడివైపు ఉన్న 'లాక్ / అన్‌లాక్ బయోమెట్రిక్స్' పైన క్లిక్ చేయాలి.

తర్వాత కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ బయోమెట్రిక్ లాక్‌కు సంబంధించి వివరాలు ఉంటాయి.

పేజీలో ఇచ్చిన గడిలో 12 అంకెల ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.

అక్కడ మీ బయోమెట్రిక్‌ లాక్ స్టేటస్ కనిపిస్తుంది.

బయోమెట్రిక్ లాక్ చేసి ఉందా? లేదా? అనేది స్క్రీన్ మీద కనిపిస్తుంది.

బయోమెట్రిక్ లాక్ చేయాలనుకుంటే కుడివైపున ఉన్న సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి కింద ఉన్న ఎనేబుల్‌ బటన్‌పై క్లిక్ చేయాలి.

అంతే మీ ఆధార్ బయోమెట్రిక్ సమాచారం లాక్ అయిపోయినట్లే.

'బయోమెట్రిక్ లాక్‌' చేస్తే ఏం జరుగుతుంది?

ఇలా లాక్‌ చేయడం వల్ల మీ బయోమెట్రిక్‌ డేటా అంటే కంటిపాప, వేలిముద్రలను దుర్వినియోగం చేసే అవకాశం ఉండదు.

అయితే, అదే సమయంలో సిమ్ కార్డు కోసమో, రేషన్ షాపులోనో వేలిముద్రలను మీరు ఉపయోగించాలనుకున్నా అవి పనిచేయవు.

అంటే మీ వ్యక్తిగత ధ్రువీకరణ ఫెయిల్ అవుతుంది.

ఆదార్ ఫింగర్ ఫ్రింట్స్

'బయోమెట్రిక్ లాక్‌' తిరిగి ఓపెన్ చేయడం ఎలా?

బయోమెట్రిక్ లాక్ ఓపెన్ చేయడానికి కూడా ఇదే పద్ధతి అనుసరించాలి.

ఇలా చేయడం వల్ల డేటా దుర్వినియోగం అయ్యే అవకాశాలు చాలావరకు తగ్గుతాయని చెబుతున్నారు.

అయితే, ఈ ఫీచర్ ఉపయోగించుకోవాలంటే ఆధార్ నెంబర్‌తో మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయి ఉండాలి.

మీ ఆధార్ గత చరిత్రను తెలుసుకోవచ్చా?

ఆధార్ దుర్వినియోగం కాకుండా పై విధంగా జాగ్రత్తలు తీసుకోవచ్చు.

కానీ గతంలో ఎవరైనా మీ ఆధార్‌ను దుర్వినియోగం చేశారేమో అనే అనుమానం ఉందా?

ఒకవేళ ఉంటే ఆ విషయం తెలుసుకోవడం ఎలా? కంగారు పడాల్సిన పని లేదు. దానికో ఉపాయం ఉంది.

గతంలో మీ ఆధార్ ఎక్కడెక్కడ వినియోగించారో కూడా సులువుగా తెలుసుకోవచ్చు.

ఒక్క క్లిక్ దూరంలో ఆధార్ చరిత్ర

ఆధార్ వెబ్‌సైట్‌ లోకి లాగినైన తర్వాత కుడివైపున 'ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ' అనే ట్యాగ్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే కొత్త విండో ఓపెన్ అవుతుంది.

అందులో ఆధార్ నెంబర్, సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేయాలి. ఆ పేజీలో వచ్చే సూచనల ప్రకారం ముందుకెళ్తే ఆధార్ ఎక్కడెక్కడ ఉపయోగించారో తెలుసుకోవచ్చు.

ప్రస్తుత తేదీ నుంచి గరిష్ఠంగా 6నెలల కిందట వరకు మీరు ఆధార్‌ను ఎలా ఎక్కడ వాడారో తెలుసుకోవచ్చు.

ఎంఆధార్‌ యా‌ప్‌లో భద్రతా లోపాలు?

ఎంఆధార్‌ యాప్‌లో తీవ్రమైన భద్రతాలోపాలు ఉన్నాయని ఫ్రెంచ్ సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు ఎల్లియట్ అండర్‌సన్ అభిప్రాయపడ్డారు.

స్థానిక ఆధార్‌ డేటాబేస్‌‌ పాస్‌వర్డ్‌ తెలుసుకోవడం చాలా సులువు అని అన్నారు.

బయోమెట్రిక్ వివరాలను ఆధార్ యాప్‌ స్థానిక డేటాబేస్‌లో సేవ్ చేస్తుంది. దాన్ని ఎవరూ దొంగిలించకుండా, దుర్వినియోగం చేయకుండా పాస్‌వర్డ్ ఉంటుంది.

ఆ పాస్‌వర్డ్‌ను హ్యాకర్స్ ఈజీగా తెలుసుకోవచ్చని అండర్‌సన్ చెబుతున్నారు.

మార్చి నుంచి వర్చువల్ ఆధార్

ఆధార్ భద్రతపై భయం వద్దని కేంద్ర ప్రభుత్వం, ఆధార్ ప్రాధికార సంస్థ స్పష్టంచేస్తోంది.

మార్చి ఒకటో తేదీ నుంచి వర్చువల్ ఆధార్ కార్డును తీసుకురాబోతున్నారు.

ఆధార్ డేటా మరింత సురక్షితంగా, గోప్యంగా ఉంచేందుకు కసరత్తు చేస్తోంది.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.

English summary
Aadhaar Biometric Lock:By Doing this your personal data is safe in the Aadhaar Locker!
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X