వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గూగుల్, ఫోన్ ఆపరేటర్లు సహా ఆ హెల్ప్ లైన్ నెంబర్ సేవ్ చేయమని 'ఆధార్' ఎవరికీ చెప్పలేదు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: హెల్ప్ లైన్ నెంబర్‌ను కొత్తగా కలుపుకోవాల్సిందిగా తాము టెలిఫోన్ ఆఫరేటర్లను, ఫోన్ తయారీదారులను లేదా గూగుల్‌ను కానీ ఎప్పుడూ అడగలేదని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) శుక్రవారం నాడు స్పష్టం చేసింది.

శుక్రవారం తమ స్మార్ట్ ఫోన్ కాంటాక్టులో యూఐడీఏఐ నెంబర్ డిఫాల్టుగా సేవ్ అయినట్లు కొందరు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. దీంతో ఈ వార్తలపై యూఐడీఏఐ వివరణ ఇచ్చింది. నెంబర్ సేవ్ చేయమని తాము ఎవరికీ చెప్పలేదని పేర్కొంది.

Aadhaar body says never asked for helpline to be added to phones

యూఐడీఏఐ టోల్ ఫ్రీ నెంబర్ కాంటాక్టులో సేవ్ అయినట్లుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయని, కానీ ఇలా నెంబరును డిఫాల్టుగా సేవ్ చేయమని తాము ఎవరినీ కోరలేదని స్పష్టం చేశారు. ఆ ఫోన్లలో 1800 300 1947 నెంబర్ సేవ అయిందని, అది యూఐడీఏఐ టోల్ ఫ్రీ నెంబర్ కాదని, తమ హెల్ప్ లైన్ నెంబర్ 1947 మాత్రమేనని స్పష్టం చేసింది.

గత రెండేళ్లకు పైగా ఇదే నెంబర్ పని చేస్తోందని, ప్రజల్లో ఆధార్ పైన భయాందోళనలు కలిగించేందుకు కొందరు ఇలాంటి పనులు చేస్తున్నారని, తాము మళ్లీ మళ్లీ చెబుతున్నామని, ఫోన్లలో హెల్ప్ లైన్ నెంబర్‌ను పెట్టమని తాము ఎవరినీ కోరలేదన్నారు.

కాగా, 1800 300 1947 నెంబర్ తమ ఫోన్ బుక్‌లో తమకు తెలియకుండానే సేవ్ అయినట్లు కొందరు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఇందుకు సంబంధించి స్క్రీన్ షాట్‌లు తీసి ట్విట్టర్లో షేర్ చేసారు. వందలాది మంది స్మార్ట్ ఫోన్ యూజర్లు ఉదయం లేవగానే తమ ఫోన్లలో అది సేవ్ అయినట్లుగా గుర్తించారు.

దీనిపై పలువురు నెటిజన్లు కామెంట్లు కూడా చేశారు. 'ఇది నా స్మార్ట్ ఫోన్. నేను ఈ నెంబర్‌ను సేవ్ చేయలేదు. నాకు తెలియకుండానే ఈ ఫోన్ నెంబర్ సేవ్ అయింది. ఇది జోక్ కాదు. వెంటనే మీ ఫోన్ చెక్ చేసుకోండి' అని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు.

English summary
The Unique Identification Authority of India today denied that it had directed telecom operators, phone makers or Google to include a helpline number for its ID card project Aadhaar after the number was spotted by users, inexplicably added to their contact lists, across the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X