వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Coronavirus: ఆధార్ కార్డు ఉంటేనే హెయిర్ కటింగ్: సీఎం షాక్, దానికో లెక్కుంది, తేడా వస్తే !

|
Google Oneindia TeluguNews

చెన్నై: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని అరికట్టడానికి ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కరోనా కేసులు మాత్రం రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికి మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలు నిర్ణయించాయి. కరోనా వైరస్ చాపకింద నీరులా చైన్ లింక్ లా వ్యాపిస్తుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. హెయిర్ కటింగ్ చేసుకోవాలన్నా, షేవింగ్ చేసుకోవాలన్నా కచ్చితంగా ఆధార్ కార్డు తీసుకురావాలని సీఎం షాక్ ఇచ్చారు. హెయిర్ కటింగ్ కు ఆధార్ కార్డుకు, కరోనా వైరస్ కు ఏమిటి లింక్ అంటే ? అందుకు మాకో లెక్ందని సీఎం స్పష్టం చేశారు.

Lockdown: బ్యూటీ పార్లర్ ఆంటీ, బేకార్ ప్రియుడు, ఆ విషయంలో తేడా, ఇంట్లో భర్త లేని టైంలో ?Lockdown: బ్యూటీ పార్లర్ ఆంటీ, బేకార్ ప్రియుడు, ఆ విషయంలో తేడా, ఇంట్లో భర్త లేని టైంలో ?

 సెలూన్స్ తో చెమటలు

సెలూన్స్ తో చెమటలు

కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు కావడంతో అన్ని వ్యాపారలావాదేవీలు మూతపడ్డాయి. ఇదే సమయంలో లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం సెలూన్ షాప్ లకు ఊరట ఇచ్చింది. ఇదే సమయంలో దేశంలోని పలు ప్రాంతాల్లో సెలూన్ల ద్వారా కరోనా వైరస్ వ్యాపించిందని వెలుగు చూడటంతో ప్రజలకు చెమటలుపట్టాయి..

 తమిళ తంబీల కోసం !

తమిళ తంబీల కోసం !

తమిళనాడులో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మంగళవారం వరకు తమిళనాడులో 24, 586 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. ఇక తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై సిటీలో 16, 585 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. మంగళవారం ఒక్కరోజే తమిళనాడులో 1, 091 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో తమిళన తింబీలు హడలిపోయారు. ఇప్పటి వరకు తమిళనాడులో 197 మంది కరోనా వ్యాధితో మరణించారు. మంగళవారం ఒక్కరోజులో 13 మంది మరణించడంతో తమిళనాడు ప్రభుత్వం హడలిపోయింది.

 ఆధార్ కార్డు ఉంటేనే కటింగ్

ఆధార్ కార్డు ఉంటేనే కటింగ్

చెన్నై సిటీలో రోజురోజుకు కరోనా వైరస్ వ్యాధి కేసులు పెరిగిపోతున్నాయి. చెన్నై సిటీతో పాటు కరోనా వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తున్న ప్రాంతాల్లో సెలూన్ లో ఎవరైనా కటింగ్, షేవింగ్ చేసుకోవాలంటే కచ్చితంగా ఆ వ్యక్తి ఆధార్ కార్డు జిరాక్స్ కాఫీ వెంట తీసుకెళ్లాలి. ఆధార్ కార్డు, మొబైల్ ఫోన్ నెంబర్ తీసుకున్న తరువాత ఎవరికైనా కటింగ్, షేవింగ్ చెయ్యాలని సెలూన్ షాప్ యజమానులకు ప్రభుత్వం కట్టుదిట్టమైన ఆదేశాలు జారీ చేసింది.

 ఆధార్ కార్డు ఎందుకంటే ?

ఆధార్ కార్డు ఎందుకంటే ?

సెలూన్ షాప్ కు వెళ్లిన వారిలో ఎవరికైనా కరోనా పాజిటివ్ వచ్చిందని వెలుగు చూస్తే ఆ షాపుకు ఎవరెవరు వెళ్లి వచ్చారు గుర్తించడానికి ఆధార్ కార్డు అవసరం అవుతుందని అధికారులు అంటున్నారు. సెలూన్ షాప్ లో ఎవరికైనా కరోనా పాజిటివ్ అని తెలిసిన వెంటనే ఆ షాప్ కు వెళ్లిన వారిని ఆధార్ కార్డు ఆదారంగా వెంటనే గుర్తించి చికిత్స అందించడానికి అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు.

Recommended Video

Coronavirus Cases in India Rise To 2 Lakh, 8,000 New Cases In 24 Hours
 తేడా వస్తే తోలు తీస్తాం

తేడా వస్తే తోలు తీస్తాం

సెలూన్ షాప్ యజమానులు ఎవరైనా ఆధార్ కార్డు తీసుకోకుండా ఎవరికైనా కటింగ్, షేవింగ్ చేశారని తెలిస్తే వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆధార్ కార్డు లేకుండా ఎవరైనా కటింగ్, షేవింగ్ చేసినట్లు తెలిస్తే తోలు తీస్తామని సెలూన్ షాప్ యజమానులకు అధికారులు హెచ్చరించారు.

English summary
Coronavirus: Aadhaar Card Made Mandatory In Tamil Nadu For Getting Haircut, Visiting Spa and shops in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X