వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బడ్జెట్ హైలైట్స్ : ఎన్ఆర్ఐలకు గుడ్‌న్యూస్, నిర్మలమ్మ ఏం చెప్పిందంటే ...

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : విదేశాల్లో ఉండే భారతీయులకు గుడ్ న్యూస్. వారు ఆధార్ కార్డు కోసం నిబంధనలను మరింత సరళతరం చేసింది. ఆధార్ కార్డు కోసం వారు మరీ ఆరునెలలు వేచి ఉండాల్సిన అవసరం లేదని స్పస్టంచేసింది.

180 రోజులే .. కానీ ...
సాధారణంగా ఆధార్ కార్డు కావాలంటే .. ఇక్కడి ప్రతినిధులకైతే నెలరోజుల్లోపు ఇస్తారు. అదే విదేశాల్లో ఉండేవారికైతే కాస్త ఆలస్యమవుతోంది. గరిష్టంగా ఆరునెలలు .. అంటే 180 రోజుల సమయం పడుతుంది. దీంతో విదేశాల్లో ఉండే ఎన్ఆర్ఐలు ఆధార్ కార్డు కోసం పాట్లు పడేవారు. వారి ఇబ్బందులను గమనించిన కేంద్రం నిబంధనలను మరింత సరళతరం చేస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు.

Aadhaar for NRIs on arrival in India with no waiting period’, says Sitharaman in budget speech

నిరీక్షించాల్సిన అవసరం లేదు ..
విదేశీ ప్రతినిధులు తమ పాస్‌పోర్టు‌తో ఆధార్ కార్డుకోసం ధరఖాస్తు చేయాలని కోరారు. అయితే వారికి వెంటనే ఆధార్ కార్డు ఇస్తామని పేర్కొన్నారు. వారిని ఎట్టి పరిస్థితుల్లో వెయిట్ చేయించబోమని ప్రకటించారు. దీంతో చాలామంది ఎన్ఆర్ఐలకు మేలు జరగనుంది. విదేశాల్లో ఉండేవారు ఆస్తి క్రయ, విక్రయాలు, బ్యాంకింగ్ కార్యకలాపాలకు ఆధార్ నంబర్ తప్పనిసరి అయిన నేపథ్యంలో ... ఆధార్ కార్డు వెంటనే ఇస్తామని వారికి ఉపశమనం కలిగించారు నిర్మలా.

English summary
Propose to consider issuing Aadhaar to NRIs with Indian passports after their arrival in India without the mandatory wait of 180 days, says FM
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X