వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇండేన్ గ్యాస్ వాడుతున్నారా? మీ ఆధార్ కార్డు వివరాలు లీక్ అయ్యాయేమో చెక్ చేసుకోండి

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఇండేన్ గ్యాస్ వినియోగదారులకు సంబంధించిన ఆధార్ కార్డు వివరాలు బహిర్గతం అయ్యాయి. ఇండేన్ గ్యాస్ వెబ్ సైట్ లో భద్రపరిచిన వినియోగదారుల కార్డుల వివరాలను తాను లీక్ చేసినట్లు ఫ్రెంచ్ సెక్యూరిటీ రిసెర్చర్ ఇలియట్ అండర్సన్ ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయన తన సొంత బ్లాగ్ మీడియం డాట్ కామ్ ద్వారా వెల్లడించారు. ఈ విషయాన్ని ఇండేన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ యాజమాన్యానికి తెలియజేశానని కూడా అండర్సన్ తెలిపారు. ఆధార్ కార్డు డేటా లీక్ అయిన విషయంపై ఇండేన్ సంస్థ ఇప్పటిదాకా స్పందించలేదు. ఎలాంటి అధికారిక ప్రకటన కూడా చేయలేదు.

గ్యాస్ కనెక్షన్ కు, ఆధార్ కార్డు వివరాలకు లింకేజీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇలా లింకేజీ ఇచ్చిన ఆధార్ కార్డు వివరాలను ఆ సంస్థ తన వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది. వినియోగదారులు ఎవరైనా పాస్ వర్డ్ వినియోగించి, తమ ఆధార్ కార్డు గ్యాస్ కనెక్షన్ తో లింకేజీ అయిందా? లేదా? తెలుసుకోవచ్చు. ఇలా దేశవ్యాప్తంగా కోట్లాదిమంది వినియోగదారుల ఆధార్ కార్డు వివరాలు ఇండేన్ గ్యాస్ వెబ్ సైట్ లో భద్రపరిచారు.

Aadhaar leaks again: Indane Gas website, app leak data of 6.7 million subscribers

ఈ వివరాలను తాను లీక్ చేశానని, సుమారు 67 లక్షల మందికి చెందిన ఆధార్ కార్డు నంబర్, పేరు, అడ్రస్, గ్యాస్ డీలర్ ఐడీ నంబర్ వంటివన్నీ తన వద్ద ఉన్నట్లు అండర్సన్ చెబుతున్నారు. దీనికోసం తాను సొంతంగా ఓ సాప్ట్ వేర్ ను అభివృద్ధి చేసినట్లు చెప్పారు. వెబ్ సైట్ మాత్రమే కాదని, ఇండేన్ గ్యాస్ యాప్ లో కూడా భద్రతా పరమైన లొసుగులు ఉన్నాయని అండర్సన్ వెల్లడించారు. ఈ విషయంపై ఇండేన్ ఆయిల్ కార్పొరేషన్ ఇప్పటిదాకా స్పందించకపోడం గమనార్హం. దీన్ని ఇప్పటిదాకా ధృవీకరించలేదు. అలాగని ఖండించనూ లేదు.

English summary
Aadhaar has been receiving a lot of flak for getting leaked on the web. Several incidents of over the course of the year proved that Aadhaar data of millions of Indians wasn't protected well enough to be kept safe. While the government takes steps to re-ensure the security of the Aadhaar data, another incident shows the lack of security in the Aadhaar system. This time, an estimated 6.7 million people's Aadhaar data is reported to be at risk. According to a report from TechCrunch, Indane Gas has apparently leaked the data of around 6.7 million subscribers through its website and app. The leak was discovered by an anonymous security researcher and was informed to Elliot Anderson (Robert Baptiste). Anderson has been investigating several leaks regarding the Aadhaar system for quite some time and is known to expose some of the biggest Aadhaar-related leaks last year.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X