వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆధార్ అనుసంధానం: మార్చి 31వరకు గడువు పెంచనున్న కేంద్రం

బ్యాంక్‌ ఖాతాదారులు, మొబైల్‌ వినియోగదారులకు తమ ఖాతాలతో ఆధార్‌ అనుసంధానానికి సంబంధించి ఊరట లభించనుంది. రాజ్యాంగ ధర్మాసనం ఎదుట కేంద్రం,

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బ్యాంక్‌ ఖాతాదారులు, మొబైల్‌ వినియోగదారులు తమ ఖాతాలతో ఆధార్‌ అనుసంధానానికి సంబంధించి ఊరట లభించనుంది. రాజ్యాంగ ధర్మాసనం ఎదుట కేంద్రం, ఢిల్లీ సర్కార్‌ల వివాదానికి సంబంధించిన విచారణ ముగిసిన తర్వాత వివిధ సంక్షేమ పథకాలకు ఆధార్‌ అనివార్యతపై విచారణ చేపడతామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

Recommended Video

Aadhaar Linking Mandatory For Insurance Policies | Oneindia Telugu

మరోవైపు పలు పథకాలపై ఆధార్‌ లింకేజ్‌ గడువును వచ్చే ఏడాది మార్చి 31వరకూ పొడిగించేందుకు సిద్ధమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రాకు కేంద్రం నివేదించింది. రాజ్యాంగ ధర్మాసనం మాత్రమే ఈ అంశంపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తుందని జస్టిస్‌ మిశ్రా, జస్టిస్‌ ఏఎం కన్విల్కార్‌, జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌లతో కూడిన సుప్రీం బెంచ్‌ పేర్కొంది.

Aadhaar linking: Centre willing to extend deadline to March 31

ఇప్పటివరకూ ఖాతాదారులు తమ బ్యాంక్‌ ఖాతాలకు డిసెంబర్‌ 31లోగా ఆధార్‌ను లింక్‌ చేయాల్సి ఉండగా, మొబైల్‌ నెంబర్లకు ఫిబ్రవరి 6లోగా ఆధార్‌ లింకేజ్‌ను పూర్తిచేయాల్సి ఉంది. తాజాగా మార్చి 31వరకూ వీటి గడువును సుప్రీంకోర్టు అనుమతితో కేంద్రం పొడిగించే అవకాశం ఉంది. దీంతో మరోసారి వినియోగదారులకు ఊరట లభించనుంది.

English summary
The Centre on Monday told the Supreme Court that it was willing to extend the deadline for Aadhaar linking to March 31 2018. The submission was made before a Bench headed by Chief Justice of India, Dipak Misra who said that a Constitution Bench would decide on whether Aadhaar linking should be stayed or not. The court said that the Constitution Bench would be set up next week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X