వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిగిలింది 2రోజులే: పాన్-ఆధార్ అనుసంధానం తప్పనిసరి, ఇలా చేయండి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాన్(పర్మినెంట్ అకౌంట్ నెంబర్)తో ఆధార్ అనుసంధానాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీంతో జులై 1 నుంచి పాన్-ఆధార్ అనుసంధానం అమలు కానుంది. ఈ మేరకు ఆదాయపు పన్ను చట్టంలో చేసిన సవరణలను కేంద్రం నోటిఫై చేసింది.

సంక్షేమ పథకాల కింద లబ్ధి పొందాలంటే ఆధార్ తప్పనిసరి ఉండాలని కేంద్రం జారీ చేసిన ప్రకటనపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు మంగళవారం తిరస్కరించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆధార్-పాన్ అనుసంధానాన్ని తప్పనిసరి చేస్తూ మరుసటి రోజే నిర్ణయం తీసుకుంది.

Aadhaar must be linked to PAN from 1 July, govt notifies rules

జులై 1, 2017 నుంచి పాన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తి తమ ఆధార్ నెంబర్‌ను సెక్షన్ 139ఏఏలోని సబ్ సెక్షన్(2) ప్రకారం తప్పనిసరిగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్‌కం ట్యాక్స్-డీజీఐటీ(సిస్టమ్స్)కు తెలియజేయాల్సి ఉంటుందని రెవెన్యూ డిపార్ట్‌మెంట్ తెలిపింది. దీని ప్రకారం జులై 1 నుంచి ఐటీ రిటర్న్స్ ఫైలింగ్‌కు ఆధార్-పాన్ అనుసంధానం తప్పనిసరి అని కేంద్ర ప్రత్యక్ష పన్నుల శాఖ(సీబీడీటీ) స్పష్టం చేసింది.

కాగా, దేశంలో మొత్తం 25 కోట్ల మంది పాన్ కార్డు కలిగి ఉండగా, ఇందులో 111కోట్ల మందికి ఆధార్ కార్డులున్నాయి. ఇప్పటికే పన్ను చెల్లిస్తున్న సుమారు 2.07కోట్ల మంది తమ పాన్ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేసుకున్నారు.

కొత్తగా ఆధార్-పాన్ అనుసంధానం చేసుకునేవారు సంప్రదించండి:

English summary
The government has made it mandatory to link existing Aadhaar numbers with the permanent account numbers (PAN) of taxpayers with effect from 1 July.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X