ఆధార్-ప్యాన్ లింక్‌కు నేడే ఆఖరు తేదీ: చేయకపోతే ఏమవుతుందంటే..?
పాన్‌తో ఆధార్ అనుసంధానం గడువును పొడిగించే విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం నిర్ణయం తీసుకోనుంది. కాగా, ప్రస్తుత గడువు గురురవారం (ఆగస్టు 31)తో ముగుస్తోంది.
Recommended Video

న్యూఢిల్లీ: పాన్‌తో ఆధార్ అనుసంధానం గడువును పొడిగించే విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గురువారం నిర్ణయం తీసుకోనుంది. కాగా, ప్రస్తుత గడువు గురురవారం (ఆగస్టు 31)తో ముగుస్తోంది. (అనుసంధానం కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

పొడిగించే అవకాశం?
అయితే, ప్యాన్, ఆధార్ అనుసంధానం ఈ ఏడాది చివరి వరకూ పొడిగించే అవకాశముంది. ప్రస్తుతం ‘ఆధార్ అనుసంధానం' అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉన్న సంగతి తెలిసిందే. దీనిపై నవంబరులో విచారణ చేపడతామని సుప్రీం ఇప్పటికే ప్రకటించింది. మరోవైపు వివిధ ప్రభుత్వ పథకాలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి గడువును డిసెంబరు ఆఖరు ప్రభుత్వం పొడిగించింది.

ఐటీ రిటర్న్ దాఖలే చేయనట్లే..
కాగా,ప్యాన్-ఆధార్‌కార్డ్ అనుసంధానం చేయకుంటే.. మీరు ఐటి రిటర్న్స్ దాఖలు చేసినా.. దాఖలు చేయనట్లే లెక్కని కేంద్రం తేల్చిచెప్పింది. దీంతో ఐటీఆర్ దాఖలు చేయడంతోపాటు ఆధార్ కూడా కీలకంగా మారింది. ఈ ప్రక్రియకు ఆగస్టు 31 వరకు అవకాశముంది.

ఐటీ రిటర్నులు దాఖలు చేయనట్లే..
ఐటీఆర్ దాఖలుచేసి ఆధార్ అనుసంధానం చేయకపోతే దాన్ని ఐటీ శాఖ పరిగణనలోకి తీసుకోదు. అంతేగాక, ఐటీఆర్ దాఖలు చేయని వారి జాబితాలో వీరిని చేర్చుతారు.
అలాంటి వారికి ఐటీఆర్ సెక్షన్ 142(1) ప్రకారం నోటీసులు జారీ చేస్తారు. దానికి రూ.5వేలు ఫెనాల్టీ వేస్తారు.

ఆధార్-ప్యాన్ లింక్ చేయకపోతే..
ఆదాయపన్నుతో చేసుకునే క్లైములను చేసుకోలేరు. నష్టాలు, పెట్టుబడి, బిజినెస్ నష్టాలను క్యారీ ఫార్వడ్ చేసుకోలేరు. ఎవైనా రింఫండ్స్ వచ్చేవి ఉంటే వాటిని మంజూరు చేయరు. కొన్ని క్యాటగిరీ వారికి వెసుబాటు ఉంటుంది. ఎన్నారైలు, 80 ఏళ్లకు పైబడిన వారు, అస్సాం, మేఘాలయ, జమ్మూకాశ్మీర్ ప్రజలకు కొంత వెసులుబాటు ఉంటుంది.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications