వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోప్యత పరీక్షలో ఆధార్ గట్టెక్కుతుంది: నీలేకని

ఆధార్ పథకం గోప్యత పరీక్షను విజయవంతంగా అధిగమిస్తుందని ఆధార్ రూపకర్త నందన్ నీలేకని అభిప్రాయపడ్డారు.డిజిటల్ యుగంలో పౌరుల గోప్యత పరిరక్షణలో సుప్రీం కోర్టు ప్రత్యేక బెంచ్ విచారణలో ఆధార్ గట్టెక్కే అవకాశం ఉ

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆధార్‌ పథకం గోప్యత పరీక్షను విజయవంతంగా అధిగమిస్తుందని ఆధార్ రూపకర్త నందర్ నీలేకని అభిప్రాయపడ్డారు. నేటి డిజిటల్‌ యుగంలో పౌరుల గోప్యత పరిరక్షణకు భారత్‌ సరైన దిశలోనే సాగుతోందని చెప్పారు.

ఆధార్‌తో 9 బిలియన్ కోట్లు ఆదా: నందన్ నీలేకని ఆధార్‌తో 9 బిలియన్ కోట్లు ఆదా: నందన్ నీలేకని

గోప్యతకు సంబంధించి భారత్‌లో అన్ని అనుకూల పరిస్థితులే ఉన్నాయి. ఆధార్‌ గోప్యతను ఉల్లంఘిస్తోందంటూ చాలా మంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో భారత్‌లో గోప్యత ప్రాథమిక హక్కుల్లో భాగమా? అనే ప్రశ్న తలెత్తిందన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

Aadhaar will successfully pass the test of privacy: Nandan Nilekani

ఆ తరువాత 9 మంది జడ్జీలు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకం. గోప్యత ప్రాథమిక హక్కుల్లో భాగమని కోర్టు తీర్పు చెప్పింది. చట్టం, హేతుబద్ధత, సమానత్వం ప్రాతిపదికన ఆ హక్కుకు పరిమితులు విధించొచ్చని కూడా తెలిపిన విషయాన్ని అని నీలేకని ప్రస్తావించారు.

సామాజికాభివృద్ధి, సృజనకు డిజిటల్‌ సాంకేతికత ముఖ్యమని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ప్రత్యేక బెంచ్‌ జరిపే విచారణలో ఆధార్‌ గట్టెక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

సాంకేతికత లేమి కారణంగా ఎవరికీ ప్రభుత్వ ప్రయోజనాలు దూరం కాకుడదని నీలేకని అన్నారు. అదే సమయంలో టెక్నాలజీ సంక్షేమ కార్యక్రమాల్లో అడ్డంకి కాకూడదని అభిప్రాయపడ్డారు.

English summary
India is on a “very good wicket” on privacy in this age of digital technology, architect of the Aadhaar scheme Nandan Nilekani has said, expressing confidence that the government’s unique-identity number plan would be able to successfully pass the test of privacy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X