వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విమానం ఎక్కాలంటే.. ఈ మార్గదర్శకాలు తప్పక పాటించాల్సిందే!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మే 25న విమానయాన సేవలు తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) దేశీయ ప్రయాణాలకు కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా లాక్‌డౌన్ కారణంగా సుమారు రెండు నెలలపాటు విమానయాన సేవలు నిలిచిపోయిన విషయం తెలిసిందే.

Recommended Video

Domestic Flights Travel Guidelines From 25 May By Airport Authority of India
ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి..

ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి..

మే 25న విమానయాన సేవలు ప్రారంభమవుతుండటంతో ఏఏఐ గురువారం స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసీజర్‌ను విడుదల చేసింది. విమానంలో ప్రయాణించే సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు, నిబంధనలను ఇందులో పేర్కొంది. ప్రయాణికులు ఖచ్చితంగా ఆరోగ్యసేతు యాప్ డౌన్‌లోడ్ చేసుకుని, థర్మల్ స్క్రీనింగ్ చేసుకోవాలని స్పష్టం చేశారు.

అలా కుదరదు.. సీట్ల మధ్య గ్లాస్ షీట్లు..

అలా కుదరదు.. సీట్ల మధ్య గ్లాస్ షీట్లు..

విమానాల్లోనూ భౌతిక దూరం పాటించేందుకు మధ్య సీట్లను వదిలేస్తారని వచ్చే వార్తల్లో నిజం లేదనిఏఏఐ తెలిపింది. అలా సీట్లను ఖాళీగా వదిలేస్తే విమాన టికెట్ల ధరలు పెరిగే అవకాశం ఉన్నందున దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. విమానయాన సంస్థలు సీట్ల మధ్యలో గ్లాస్ షీట్ల లాంటివి ఏర్పాటు చేయాలని సూచించింది.

కాంటాక్ట్ లెస్ టికెటింగ్..

కాంటాక్ట్ లెస్ టికెటింగ్..

విమానాశ్రయాల్లో కాంటాక్ట్ లెస్ టికెట్లు ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. టికెట్ పై బార్ కోడ్ సాయంతో ప్రయాణికులన అనుమతించే విధంగా చూస్తున్నట్లు చెప్పారు. విమానాశ్రయాల్లో ప్రతి చోట భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నామని, దానికి సంబంధించి అన్ని ఏర్పాటు పూర్తి చేశామని తెలిపారు.

దేశీయ విమానాలు మాత్రమే..

దేశీయ విమానాలు మాత్రమే..

కరోనా వ్యాప్తి నేపథ్యంలో మార్చి 25 నుంచి విమానాల రాకపోకలను కేంద్రం నిలిపివేసింది. కేవలం కార్గో విమానాలు, విదేశాల్లో చిక్కుకున్న మనవారి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానాలను మాత్రమే నడుపుతోంది. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యం మే 25 నుంచి కేవలం దేశీయ విమానాలను మాత్రమే నడపాలని కేంద్రం నిర్ణయించింది.

మరికొన్ని కీలక మార్గదర్శకాలు.. ఇవే ఫైనల్ కాదు..!

మరికొన్ని కీలక మార్గదర్శకాలు.. ఇవే ఫైనల్ కాదు..!

రెండు గంటల ముందే ప్రయాణికులు విమానాశ్రయం చేరుకోవాలి.

విమానం టేకాఫ్ అయ్యే నాలుగు గంటల ముందు మాత్రమే విమానాశ్రయంలోకి అనుమతిస్తారు.
అంతకుముందు వచ్చినా అనుమతించరు.
ప్రతి ఒక్కరు మాస్కులు, గౌజ్‌లు తప్పనిసరిగా ధరించాలి.
ప్రతి ఒక్కరి ఫోన్లో ఆరోగ్యసేతు యాప్ తప్పనసరిగా ఉండాలి. అయితే, 14ఏళ్ల లోపు పిల్లలకు ఈ యాప్ అవసరం లేదు.
థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవాలి.
ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది కోసం రాష్ట్ర ప్రభుత్వాలు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ లేదా ప్రైవేటు టాక్సీలు ఏర్పాటు చేయాలి.
వ్యక్తిగత వాహనాలు, ఎంపిక చేసిన క్యాబ్ సర్వీసులను మాత్రమే విమానాశ్రయంలోకి అనుమతిస్తారు.
ప్రత్యేక సందర్భాల్లో మినహా ట్రాలీలను అనుమతించేది లేదని స్పష్టం చేసింది. అయితే, ఇప్పుడిచ్చిన మార్గదర్శకాలే ఫైనల్ కాదని, మరికొన్నింటిని జారీ చేసే అవకాశం ఉందని కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ పేర్కొంది.

English summary
The Airport Authority of India has issued guidelines for domestic travel. The Civil Aviation Ministry has however said that these are not final. Passengers will have to report two hours in advance and only those have a departure scheduled in the next four hours will be allowed to enter the terminal building, the Air Authority of India has said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X