వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేను బిజీ, పాక్‌కు వెళ్లడం లేదు: ఇమ్రాన్ ఖాన్ ఆహ్వానంపై అమీర్ ఖాన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై/న్యూఢిల్లీ: ఈ నెల 11వ తేదీన పాకిస్తాన్ మాజీ క్రికెటర్, పీటీఐ అధినేత ఇమ్రాన్ ఖాన్ పాక్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రమాణ స్వీకారానికి భారత్‌కు చెందిన పలువురికి ఆహ్వానాలు అందాయి. ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఆహ్వానిస్తారు. అలాగే క్రికెటర్ సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, నవజ్యోత్ సింగ్ సిద్ధూలను ఆహ్వానించారు.

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌ను కూడా ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై అమీర్ ఖాన్ స్పందించారు. తనకు ఇమ్రాన్ ఖాన్ నుంచి ఎలాంటి ఆహ్వానం అందలేదన్నారు. ఆహ్వానం అందినట్లుగా వచ్చిన వార్తలను ఆయన కొట్టి పారేశారు. ఆహ్వానం మాట ఎలా ఉన్నా అమీర్ ఈ ప్రమాణ స్వీకారానికి వెళ్లే అవకాశాలు కనిపించడం లేదు.

నేను పాకిస్తాన్ వెళ్లడం లేదు

నేను పాకిస్తాన్ వెళ్లడం లేదు

ఓ జాతీయ ఛానల్‌తో అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. నేను పాకిస్తాన్‌కు వెళ్లడం లేదని, అలాగే ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారానికి తనకు ఎలాంటి ఆహ్వానం రాలేదని తెలిపారు. అంతేకాకుండా, తనకు బిజీ షెడ్యూల్ ఉందని బాలీవుడ్ స్టార్ వెల్లడించారు.

నేను చాలా బిజీగా ఉన్నాను

నేను చాలా బిజీగా ఉన్నాను

ఈ నెల 12వ తేదీన (ఇమ్రాన్ ప్రమాణ స్వీకారం 11వ తేదీన) 10,000 గ్రామస్తులతో కలిసి ఓ పెద్ద ఈవెంట్ ఉందని, పానీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ ఈవెంట్‌కు అంతా సమాయత్తమవుతున్నామని అమీర్ ఖాన్ తెలిపారు. ఈ చారిటీ ఫౌండేషన్ ఈవెంట్ నేపథ్యంలో తాను వెళ్లలేని పరిస్థితి అని అభిప్రాయపడ్డారు.

ఇమ్రాన్ ప్రమాణ స్వీకారానికి వెళ్తానని సిద్ధు

ఇమ్రాన్ ప్రమాణ స్వీకారానికి వెళ్తానని సిద్ధు

కాగా, ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రమాణస్వీకారానికి తాను హాజరవుతానని మాజీ క్రికెటర్‌, పంజాబ్‌ మంత్రి నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధు తెలిపారు. ఆగస్ట్ 11న ఇమ్రాన్‌ఖాన్‌ పాక్‌ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్ననేపథ్యంలో ఆయన భారత లెజండరీ క్రికెటర్లకు ఆహ్వానం పలికారు. సిద్ధుతో పాటు కపిల్, గవాస్కర్‌లను ఆహ్వానించారు.

ఇమ్రాన్ ఖాన్ గొప్ప వ్యక్తి

ఇమ్రాన్ ఖాన్ గొప్ప వ్యక్తి

సిద్ధు మాట్లాడుతూ.. తాను ఇమ్రాన్‌ ఖాన్ ఆహ్వానాన్ని అంగీకరిస్తున్నానని, కార్యక్రమానికి తప్పకుండా హాజరుతానని చెప్పారు. ఇమ్రాన్‌ ఖాన్‌ కెప్టెన్సీలోనే పాకిస్థాన్‌కు ప్రపంచ కప్ లభించిందన్నారు. ఆయన నమ్మదగిన వ్యక్తి అన్నారు. తనకు ఆహ్వానం లభించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఇమ్రాన్ ఖాన్ వ్యక్తిత్వమున్న మనిషని, నమ్మకస్తుడని కితాబిచ్చారు. క్రీడాకారులు అడ్డుగోడలను తొలగించి వంతెనలను నిర్మిస్తారని, ప్రజలను ఐక్యం చేస్తారన్నారు.

English summary
Aamir Khan is not going to Pakistan any time soon, much less for the swearing-in of Imran Khan as Prime Minister of one of our less than friendlier neighbouring nations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X