వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ పశ్చిమ టికెట్ కోసం రూ.6 కోట్లు : కేజ్రీవాల్‌పై ఆప్ అభ్యర్థి కుమారుడి ఆరోపణలు (వీడియో)

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : మరికొన్ని గంటల్లో ఢిల్లీలోని 7 లోక్ సభ స్థానాలకు పోలిగ్ జరగనుండగా ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పై సంచలన ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీ పశ్చిమ లోక్ సభ స్థానం కోసం కేజ్రీవాల్ రూ.6 కోట్లు తీసుకున్నాడని బల్బీర్ సింగ్ జకార్ కుమారుడు ఆరోపించాడు.

3 నెలల క్రితమే ...

తన తండ్రి మూడునెలల క్రితం రాజీయాల్లో చేరాడని గుర్తుచేశాడు. టికెట్ కోసం రూ.6 కోట్లను కేజ్రీవాల్ కు ఇచ్చారని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఆధారం కూడా తన వద్ద ఉందని ఉదయ్ తెలిపాడు. 3 నెలల క్రితం పార్టీలో చేరిన వ్యక్తికి టికెట్ ఇస్తారా అని ప్రశ్నించాడు. అన్నా హజారే సమయంలో ఉద్యమించిన నేతలను కాదని .. బల్బీర్ కే ఎందుకు టికెట్ కేటాయించారని ప్రశ్నించారు. కోట్లు తీసుకున్నందున టికెట్ ఇచ్చినట్టు ఆరోపించారు.

ఇదీ ఒప్పందం ...

ఇదీ ఒప్పందం ...

ఢిల్లీ పశ్చిమ టికెట్ కోసం కేజ్రీవాల్, గోపాల్ రాయ్ తో తన తండ్రి ఒప్పందం చేసుకొన్నారని ... అందుకే సీటు కన్ఫామ్ చేశాడని విమర్శించారు. అంతేకాదు 1984లో సిక్కు వ్యతిరేక అల్లర్లలో నిందితుడు సజ్జన్ కుమార్ కు బెయిల్ ఇచ్చేందుకు బల్బీర్ ప్రయత్నించారని గుర్తుచేశారు.

అబ్బే అదేం లేదే ..

కుమారుడు ఉదయ్ చేసిన ఆరోపణలను బల్బీర్ సింగ్ తోసిపుచ్చారు. ఉదయ్ తనతో ఉండటం లేదని .. ఈ అంశాలపై అతను తనతో ఎప్పుడూ మాట్లాడలేదని పేర్కొన్నారు. తాను కొన్ని అంశాలపై మాత్రం అతనితో చర్చించేవాడినని .. అతను తన తల్లితో ఉంటున్నాడని .. తన మొదటిభార్యకు 2009లోనే విడాకులు ఇచ్చినట్టు తెలిపారు.

ఈసీకి ఫిర్యాదు

ఈసీకి ఫిర్యాదు

బల్బీర్ పై కుమారుడి ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని బీజేపీ అభ్యర్థి ప్రవీణ్ కోరారు. ఉదయ్ ఆరోపణలను తేలికగా తీసకోవద్దని విన్నవించారు. ఎంపీ స్థానంలో పోటీ చేయడం కోసం రూ.6 కోట్ల ఇవ్వడమనేది సీరియస్ ఇష్యూ .. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

English summary
A day before Delhi votes in Phase 6 of the Lok Sabha elections on Sunday, the son of an Aam Aadmi Party (AAP) candidate made a sensational claim that his father paid Rs 6 crore to Arvind Kejriwal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X