వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపితోనే పోటీ: అరవింద్ కేజ్రీవాల్, 400 సీట్లపై కన్ను

By Srinivas
|
Google Oneindia TeluguNews

AAP to contest over 400 Lok Sabha seats
న్యూఢిల్లీ: 2014 ఎన్నికలలో పోటీ ఆమ్ ఆద్మీ పార్టీ - భారతీయ జనతా పార్టీల మధ్యనే ఉంటుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెసు ప్రభావం ఏమాత్రం ఉండదని అభిప్రాయపడ్డారు. కర్నాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పలాంటి అవినీతి నేతను దరి చేర్చుకున్న బిజెపిని ప్రజలు తిరస్కరించాలని ఆయన కోరారు. అవినీతిపై నిరంతర పోరాటం చేస్తున్న ఎఎపికి దేశ ప్రజలు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు.

400 సీట్లలో పోటీ

2014 సార్వత్రిక ఎన్నికలలో దాదాపు నాలుగు వందల లోకసభ స్థానాలలో పోటీ చేయాలని ఎఎపి భావిస్తోంది. తొలుత ఆ పార్టీ రెండు వందల స్థానాల పైన దృష్టి సారించింది. అయితే, పార్టీకి ప్రజల నుండి, ప్రముఖుల నుండి అనూహ్య మద్దతు లభిస్తోంది. దీంతో నాలుగు వందల స్థానాలలో పోటీ చేయాలని భావిస్తోంది. తాము 400 స్థానాలలో పోటీ చేసే విషయమై ఆలోచిస్తున్నామనని ఎఎపి నేత ప్రశాంత్ భూషణ్ మంగళవారం అన్నారు.

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఎఎపి) కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత కపిల్ సిబాల్‌లు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. మంగళవారం మిలాద్ ఉన్ నబీ సందర్భంగా కేజ్రీవాల్, సిబాల్‌లు ఢిల్లీ ప్రార్థనాలయంలో కలుసుకొని అప్యాయంగా పలకరించుకొని, హత్తుకున్నారు.

English summary

 Buoyed by the response, the Aam Aadmi Party (AAP) has drastically scaled up its ambition for the 2014 Lok Sabha polls and now plans to contest over 400 seats across the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X