వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేజ్రీ పార్టీకి షాక్: రూ.30.67కోట్లకు ఐటీ నోటీసులు

విరాళాల వ్యవహారంలో ఢిల్లీ అధికార ఆమ్‌ఆద్మీ పార్టీకి చుక్కెదురైంది. పార్టీకి అందిన విరాళాల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై రూ.30కోట్లకు ఆదాయపు పన్నుశాఖ నోటీసులు జారీ చేసింది.

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి ఆదాయపు పన్ను శాఖ షాకిచ్చింది. ఆమ్‌ఆద్మీ పార్టీకి అందిన విరాళాల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలపై రూ.30కోట్లకు ఆదాయపు పన్నుశాఖ నోటీసులు జారీ చేసింది. దీనిపై డిసెంబర్‌ 7లోగా ఆప్‌ వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది.

పార్టీ ఐదో వార్షికోత్సవం మరుసటి రోజే ఈ నోటీసులు రావడం గమనార్హం. అవినీతి వ్యతిరేక ఉద్యమంగా మొదలైన ఆమ్‌ ఆద్మీ.. 2012 నవంబర్‌ 26న రాజకీయ పార్టీగా అవతరించిన విషయం తెలిసిందే.

AAP gets Rs 30.67 crore Income Tax notice

అయితే తొలినాళ్లలో పార్టీకి భారీగా విరాళాలు అందాయి. వీటిల్లో చాలా వరకు విదేశీయుల నుంచి వచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే, ఈ విరాళాలకు సంబంధించిన వివరాలను ఆమ్‌ ఆద్మీ పార్టీ అకౌంట్‌ బుక్స్‌లో నమోదు చేయడంలోనూ అవకతవకలు జరిగినట్లు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఐటీ నోటీసులు జారీ చేయడం గమనార్హం.

English summary
Still in a mood of celebration marking five years of foundation, Aam Aadmi Party (AAP) has faced tax heat with the Income Tax (I-T) department serving a Rs 30.67 crore notice to the party. The tax notice has asked AAP why Rs 30.67 crore should not be recovered from the party. It has been asked to furnish a reply by December 7.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X