మహిళల రక్షణ: ఇక ఢిల్లీ బస్సుల్లో మార్షల్స్!
న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్రంలోని బస్సుల్లో మహిళల రక్షణకు ఆ రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఢిల్లీలోని రవాణా వ్యవస్థ కారణంగా పలు సందర్భాల్లో అత్యాచారాలు జరుగుతున్న వైనం వెలుగుచూస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మహిళల రక్షణకు ఢిల్లీ ప్రభుత్వం నడిపే బస్సుల్లో మార్షల్స్‌ను ఏర్పాటు చేస్తోంది.
గతంలో 2 వేల మంది గార్డులను నియమించినా, వారితో భద్రత సరిపోవడం లేదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం 200 మంది మార్షల్స్‌ను నియమించనుంది. వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చిన అనంతరం వారిని బస్సుల్లో నియమిస్తారు.
వీరందరికీ వాకీ టాకీలు కూడా ఇస్తారు. వీరి ద్వారా మహిళలకు రక్షణ పెరుగుతుందని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ తాజా చర్యలతో మంచి ఫలితాలుంటాయని అధికారులు చెబుతున్నారు.

బస్సుల్లో మహిళల రక్షణ కోసం సెక్యూరిటీ గార్డులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమిస్తామని అధికారులు తెలిపారు. ప్రభుత్వ చర్యలతో మహిళలపై జరుగుతున్న వేధింపులను కట్టడి చేస్తామని చెప్పారు.
తమ పార్టీ ఎన్నికల హామీలో భాగంగానే ప్రభుత్వ బస్సుల్లో మార్షల్స్‌ను నియమిస్తున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన నాయకులు తెలిపారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications