వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీహార్,ఏపీల్లో నేతలు ఎలా గెలిచారు...? ప్రశాంత్ కిషోర్ వ్యూహాలపై అధ్యయనం చేస్తున్న కేజ్రీవాల్

|
Google Oneindia TeluguNews

బీహార్‌లో నితీష్ కుమార్ ఇన్నిసార్లు ఎలా గెలుస్తున్నారు...ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్‌సీపీ అంతపెద్ద మెజారీటీ ఎలా సాధించారు..దేశమంతా బీజేపీ మానియా ఎలా పోందగల్గింది...ఇప్పుడు ఇవే ప్రశ్నలు డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మదిలో తీవ్రంగా మెదులుతున్నాయి..దీంతో వీరికి గెలుపుకు కారణమైన సంఘటనలు ఏమిటి, వీళ్ల గెలుపుకు ప్రచారం ఏమేరకు దోహదపడింది అనే అంశాలపై అమ్ ఆద్మీ పార్టీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఢిల్లీలో పాగా వేసేందుకు ఆయా రాష్ట్రాల గెలుపు సూత్రాలపై కేజ్రీవాల్ పార్టీ అధ్యయనం చేస్తోంది.

డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రెండోసారి అధికారాన్ని చేజిక్కుంచుకునేందుకు ఇప్పటికే పలు ఉచిత పథకాలను తీసుకువస్తున్నాడు. మరో కొద్ది నెలల్లోనే ఢిల్లీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే ఆయన మరోసారి గెలిచేసందుకు పావులు కదుపుతున్నాడు. అయితే దేశవ్యాప్తంగా మోడీ మ్యానియా కొనసాగుతోంది. ఇటివల జరిగిన ఎన్నికల్లో కూడ ఢిల్లీలో కేజ్రీవాల్ పార్టీ ఒక్కస్థానాన్ని కూడ గెలుచుకోలేకపోయింది. దేశంలో సమర్ధవంతమైన ముఖ్యమంత్రిగా, ఎలాంటీ అవినీతీ ఆరోపణలు లేకుండా పరిపాలన కొనసాగించాడు. అయితే కేంద్రంపై ఎడతెరిపి లేని పోరాటాన్ని కొనసాగిస్తు కేజ్రీవాల్ రోజురోజుకు ప్రజల్లో ఆయన ప్రభావం తగ్గుతోంది. ఆయన స్వంత పార్టీ ఎమ్మెల్యేలే బీజేపీ పంచన చేరారు. దీంతో ఆయన తిరిగి తన పునర్‌వైభవన్ని తెచ్చిపెట్టుకునేందుకు గెలుపు రాష్ట్రాల ఎన్నికల సరళి, అక్కడ ఇచ్చిన హామీలు, ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై అమ్‌ఆద్మీ పార్టీ అధ్యయనం చేస్తున్నట్టు తెలుస్తోంది.

AAP is studying various successful poll campaigns

ముఖ్యంగా అటు నితీశ్‌కుమర్‌తో ఏపీలో వైసీపీలకు రాజకీయ ప్రచారకుడిగా ఉన్న ప్రశాంత్ కిషోర్ సేవలను కూడ వినియోగించుకోవాలని పార్టీ భావిస్తున్నారు. మరోవైపు దేశంతోపాటు మలేషియా,టర్కి, ఇజ్రాయిల్ లాంటీ దేశాల్లో ఆయా పార్టీలు స్వంతం చేసుకున్న విజయాలను కూడ అధ్యయనం చేస్తోంది. ముఖ్యంగా నితీష్ కుమార్ ప్రవేశపెట్టిన 7 పాయింట్ ఫార్ములా,తోపాటు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రజా సంకల్పయాత్రతోపాటు ఇతర అంశాలను వారు అధ్యయనం చేస్తున్నారు. మరి ఆయా రాష్ట్రాల విజయాలపై అధ్యయనం చేస్తున్న కేజ్రీవాల్ వాటిని అమలులో ఏమేరకు సక్సెస్ అవుతారో వేచి చూడాలి.

English summary
AAP is studying various successful poll campaigns, including that of Prime Minister Narendra Modi and the chief ministers of Punjab, Bihar and Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X