వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆప్ ఎమ్మెల్యే అల్కా లాంబాపై దాడి(ఫొటోలు)

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అల్కా లాంబాపై దాడి జరిగింది. ఉత్తర ఢిల్లీలోని కాశ్మీరీ గేట్ వద్ద ఆదివారం తెల్లవారుఝామున 6 గంటలకు ఈ ఘటన జరిగింది. మాదక ద్రవ్యాల పంపిణీ, వినియోగానికి వ్యతిరేకంగా ఆందోళన నిర్వహిస్తున్నందుకు తనపై ఈ ఉదయం దాడి జరిగిందని ఆమె ట్వీట్ చేశారు.

దుప్పటి కప్పుకుని వచ్చిన ఓ అగంతకుడు రాళ్లతో దాడి చేశాడు. ఈ ఘటనలో తన తల పగిలిందని ఆమె చెప్పారు. గాయపడిన అల్కా లాంబాకు ఢిల్లీలోని అరుణా అసఫ్ అలీ ఆసుపత్రిలో చికిత్స అందించారు.

దాడితో తన ఉద్యమాన్ని ఆపలేరని ఆమె ట్విటర్‌లో వెల్లడించారు. దాడి వెనుక కుట్ర దాగి ఉందని ఆప్ ఆరోపించింది.

కాగా, ఎమ్మెల్యే అల్కా లాంబా సాగించిన పోరాటాన్ని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రివాల్ మెచ్చుకున్నారు. 'ప్రౌడ్ ఆఫ్ యూ అల్కా' అని ఆయన ట్వీట్ చేశారు.

English summary
Aam Padmi party leader Alka Lamba was attacked by some unidentified persons in north Delhi's Kashmiri gate area on Sunday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X