వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నన్ను చంపడానికి కేజ్రీ కుట్ర; ఆ వీడియోల్ని బయటపెడుతా : ఆప్ ఎమ్మెల్యే

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నుంచి తనకు ప్రాణహాని ఉందని ప్రకటించి సంచలనం రేపారు ఆప్ ఎమ్మల్యే అహ్మద్ ఖాన్. ఢిల్లీలోని మతియా మహల్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆయన.. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరియు ఆప్ వర్గాల నుంచి తనకు ప్రమాదం పొంచి ఉందని తెలిపారు.

తనకు తన కుటుంబానికి ఎలాంటి హాని జరిగినా.. దానికి సీఎం కేజ్రీవాల్ బాధ్యత వహించాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు ఎమ్మెల్యే ఖాన్. ఇదిలా ఉంటే.. కేజ్రీవాల్ కేబినెట్ లో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేసిన అహ్మద్ ఖాన్ ను గతేడాది మంత్రివర్గం నుంచి తొలగించింది ఆప్. ఓ బిల్డర్ వద్ద నుంచి లంచం డిమాండ్ చేశాడన్న ఆరోపణలతో ఖాన్ ను మంత్రి వర్గం నుంచి తప్పించారు కేజ్రీవాల్.

ఇక ప్రస్తుతం బెదిరింపు కాల్స్ వస్తుండడంతో.. సీఎం కేజ్రీవాలే తనపై బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో పాటు ఢిల్లీ గవర్నర్ నవాబ్ జంగ్ కు ఫిర్యాదు చేశారు ఖాన్. మే 2వ తేదీన హోంమంత్రికి, గవర్నర్ కు ఫిర్యాదు చేసినట్లు చెప్పిన ఖాన్.. తనకు పోలీసు రక్షణ కావాల్సిందిగా కోరినట్లుగా చెప్పారు.

AAP MLA Asim Ahmed Khan says he has received death threats from Kejriwal

15,20 రోజుల క్రితం తనకు బెదిరింపు కాల్స్ వచ్చాయని.. దీనికి సంబంధించి జామా మసీద్ లో ఎఫ్ఐఆర్
నమోదు చేసినట్లుగా తెలిపారు. ఢిల్లీ గవర్నమెంట్ లో 9నెలలు మంత్రిగా పనిచేసిన సమయంలో ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నో విషయాలు తన దృష్టికి వచ్చాయని, వాటికి సంబంధించిన అన్ని ఆడియో, వీడియో ఆధారాలు తన వద్ద ఉన్నాయని త్వరలోనే అన్నింటిని బయటపెడుతానని తెలియజేశారు ఎమ్మెల్యే ఖాన్.

ఇక మోడీ తనను చంపడానికి కుట్ర చేస్తున్నారన్న కేజ్రీవాల్ ఆరోపణలను ప్రస్తావిస్తూ.. దాన్నో డ్రామాగా అభివర్ణించారు కేజ్రీవాల్. మోడీపై కేజ్రీవాల్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్న ఖాన్, ప్రస్తుతానికి ఆమ్ ఆద్మీని వీడేది లేదని పేర్కొనడం గమనార్హం.

English summary
AAP legislator from Matia Mahal, Asim Ahmed Khan, alleged on Thursday that he has received death threats from Delhi chief minister Arvind Kejriwal and his aides.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X