వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పంజాబ్‌లో ఆప్‌కు నాయకత్వ కొరత

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్, గోవా రాష్ట్రాల్లో పోటీచేస్తున్న ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) ప్రత్యర్థులకు గట్టిపోటీనిస్తోంది.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

చండీగఢ్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్, గోవా రాష్ట్రాల్లో పోటీచేస్తున్న ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) ప్రత్యర్థులకు గట్టిపోటీనిస్తోంది. రెండున్నరేళ్ల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్ నుంచి నాలుగు స్థానాలు గెలుచుకున్న ఆప్ పట్ల ప్రజల్లో సానుకూల సంకేతాలు లభిస్తున్నాయి.

రాష్ట్రంలోని 1.92 కోట్ల మంది ఓటర్లు మార్పు కోరుకుంటున్నారని, కానీ అధికార అకాలీదళ్ - బిజెపి కూటమి వ్యతిరేకంగా కాంగ్రెస్, ఆప్ పట్ల పంజాబీలు సమానంగా మద్దతునిస్తున్నారు. కానీ సీఎం అభ్యర్థి లేని కొరత ఆ పార్టీని వెంటాడుతున్నది.

వచ్చేనెల నాలుగో తేదీన పోలింగ్ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో 117 స్థానాలకు 69 అసెంబ్లీ సెగ్మెంట్లు గల మాల్వా రీజియన్.. తదుపరి పంజాబ్ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే పక్షాన్ని నిర్ణయించనున్నది. గత లోక్ సభ ఎన్నికల్లో మాల్వా నుంచే నలుగురు ఎంపీలు ఆప్ గెలుచుకున్నది.

దూకుడుగా ప్రచారం నిర్వహిస్తున్న ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) ప్రధాన శక్తిగా అవతరించనున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కానీ ఆమ్ఆద్మీ పార్టీ మాల్వా రీజియన్‌లో లబ్ది పొందుతుందని, కానీ రాష్ట్రస్థాయి ఫలితాలను ప్రభావితం చేసే అవకాశమున్నదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

నాయకత్వ కొరతే ప్రధాన సవాల్.. గుర్తింపు రాజకీయంపై రగడ

నాయకత్వ కొరతే ప్రధాన సవాల్.. గుర్తింపు రాజకీయంపై రగడ

రాష్ట్ర ప్రజానీకం నుంచి ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) నాయకత్వం రాష్ట్ర నాయకుడి కోసం అన్వేషణ సాగించడమే ఆ పార్టీకి రాష్ట్రంలో సవాల్‌గా మారింది. శిరోమణి అకాలీదళ్ అధినేత - సిఎం ప్రకాశ్ సింగ్ బాదల్, పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ నాయకత్వాన్ని ఎదుర్కొనే స్థాయిలో స్థానిక ఆప్ నాయకులు లేరు. నాయకత్వ లేమి కారణంగా ఢిల్లీ సీఎం - ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ప్రచారానికి సారథ్యం వహిస్తున్నారు.

పోటాపోటీ

పోటాపోటీ

సిఎం అభ్యర్థిని ప్రకటించకుండానే కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ పార్టీలతో పోటాపోటీగా ప్రచారం చేస్తోంది. స్థానికులు కేజ్రీవాలే తమకు సరైన నాయకుడని భావిస్తున్నారు. కానీ పంజాబ్ వంటి రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి నుంచి గుర్తింపు రాజకీయాలకు ప్రాధాన్యం ఉంది. హర్యానా వాసి అయిన కేజ్రీవాల్ బయటి వ్యక్తి అంటూ ‘పంజాబీ గుర్తింపు' పేరిట అధికార అకాలీదళ్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు భావోద్వేగాలను రెచ్చగొట్టడం ద్వారా ప్రజల మద్దతు సాధించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. నిరంతరం అరవింద్ కేజ్రీవాల్‌ను పంజాబ్ వ్యతిరేకి అని ఆ రెండు పార్టీలు నిరంతరం ప్రచారం చేస్తున్నాయి.

సంస్కృతి సంప్రదాయాలు భిన్నం

సంస్కృతి సంప్రదాయాలు భిన్నం

ఫరీద్‌కోట్, లుధియానా, పటియాలా మాల్వాలోనివి. జలంధర్, కపుర్తలా, హోషియార్‌పూర్‌లు దొయాబా ప్రాంతంలో ఉన్నాయి. ఈ మూడు ప్రాంతాల చరిత్ర, సంస్కృతీసంప్రదాయాలు వేరు. రాబీ, బ్యాస్‌ నదుల మధ్య ప్రాంతాన్ని మఝా అనీ, సట్లెస్ నదికి దక్షిణ భాగాన్ని మాల్వా అనీ, సుత్లెజ్, బ్యాస్‌ నదుల మధ్య ప్రాంతాన్ని దొయాబీ అనీ పిలుస్తారు. అమృత్‌సర్, గురుదాస్‌పూర్, పఠాన్‌కోట్‌ పట్టణాలు మఝాలో ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో మఝూలో 25, దొయాబాలో 23, మాల్వాలో 69 స్థానాలు ఉన్నాయి. చండీగఢ్, జలంధర్, అమృత్‌సర్, లుధియానా, పటియాలా పర్యంతం ఏకాభిప్రాయమే. నదీ పరీవాహక ప్రాంతాల ఆధారంగా పంజాబ్‌ను మూడు విభాగాలుగా పరిగణిస్తున్నారు. అన్ని ప్రాంతాల్లోనూ అకాలీ, కాంగ్రెస్ పార్టీల ప్రాబల్యం ఉంది. పట్టణాల్లో బీజేపీ ఎక్కువ పట్టు కలిగి ఉంది.

లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన శక్తిగా ‘ఆప్'

లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాన శక్తిగా ‘ఆప్'

కానీ 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రస్థాయి నాయకుడు లేకుండానే ప్రచారం విజయవంతమైందని రాజకీయ విశ్లేషకుల మాట. కేజ్రీవాల్ ప్రచారం పార్టీ ఫలితాలను పటిష్టపరిచేందుకు సహకరిస్తుందని, కానీ పంజాబ్ సుబ మూమ్‌మెంట్ తర్వాత రాష్ట్ర స్థాయి నేత లేకుండా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందా? అన్న అనుమానం ఉన్నదని, అయితే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన కొన్ని స్థానాలను గెలుచుకుంటుందని విశ్లేషకులు అంటున్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు లోక్‌సభ స్థానాలను గెలుచుకోవడంతోనే పంజాబ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక శక్తిగా నిలిచిందన్న సంగతి వాస్తవం. కానీ కేజ్రీవాల్ వ్యవహారశైలిని ప్రశ్నించిన ఎంపీలు ధర్మవీర్ గాంధీ, హరిందర్ సింగ్ ఖల్సాలను పార్టీ సస్పెండ్ చేసింది. మరో ఎంపి భగవంత్ సింగ్ మాన్ మాత్రమే చురుగ్గా ఉన్నాడు. జలాలాబాద్ స్థానం నుంచి డిప్యూటీ సీఎం సుఖ్ బీర్‌సింగ్ బాదల్‌తో తలపడుతున్న భగవంత్‌సింగ్ మాన్ సిఎం అభ్యర్థిగా భావిస్తున్నారు.

సిఎం బాదల్‌పై తీవ్ర వ్యతిరేకత

సిఎం బాదల్‌పై తీవ్ర వ్యతిరేకత

ముఖ్యమంత్రి ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ను గద్దె దింపాలనే విషయంలో మాత్రం ఏకాభిప్రాయం నెలకొంది. అమృత్‌సర్‌ ప్రాంత వాసులు కాంగ్రెస్ పార్టీ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను కోరుకుంటారు. పదేళ్లుగా బాదల్ కుటుంబ సభ్యులు రాష్ట్రమంతా వివిధ రంగాల వ్యాపారాలపై పట్టు సాధించడంతోపాటు మాఫియా గ్యాంగ్‌లకు అండగా నిలిచారన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బాదల్ ప్రభుత్వాన్నిసాగనంపే విషయంలో పంజాబీలు ఒక్కమాటపై ఉన్నారని తెలుస్తోంది. మాల్వా ప్రాంతంలోని లంబీ సెగ్మెంట్ నుంచి సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ పోటీ చేస్తున్నారు. ఆయనపై ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ తన సొంత స్థానం పాటియాల నుంచి బరిలో నిలిచారు.

పాలకపక్షంపై ఆగ్రహం

పాలకపక్షంపై ఆగ్రహం

పాలక పక్షంపై వ్యతిరేకత ఉందని, కాంగ్రెస్‌పై సద్భావమూ లేదని తెలుస్తున్నది. ఈసారి ఎవరికి ఓటు వేస్తావంటే ఆప్‌కే అని నిస్సంకోచంగా ఓటర్లు చెప్తున్నారు. ‘సబ్‌ చోర్‌ హై. హమ్‌ బదలావ్‌ లాయింగే' అన్నాడు ఫగ్వాడాలో మెకానిక్‌ షెడ్‌ యజమాని హర్మిందర్‌సింగ్‌. పెద్దనోట్ల రద్దుపై ఆగ్రహం వెలిబుచ్చాడు. ‘మా దగ్గర పని చేసేవారికి రోజువారీ వేతనం ఇవ్వలేకపోయాం. మా ఆదాయం సగానికి పైగా పడిపోయింది. మోదీ ఏదో చేస్తాడనుకున్నాం కానీ ఏమీ జరగడం లేదు. నిరుద్యోగం పెరిగిపోతోంది. అవినీతి అట్లాగే ఉంది. మోదీ ప్రమాదకర నిర్ణయాలు తీసుకుంటున్నారు ' అన్నారు.

దళితుల ఓట్లే కీలకం

దళితుల ఓట్లే కీలకం


పంజాబ్‌ రాష్ట్ర జనాభాలో 32 శాతంగా ఉన్న దళితులు ప్రతి ఎన్నికల్లోనూ కీలక పాత్ర పోషిస్తారు. 2014లో మాల్వాలో ఎక్కువ మంది దళితులు ఆప్‌కు వేశారు. ఈ సారీ దళిత ఓట్లు మూడు పార్టీల మధ్య చీలిపోయే వీలుంది. కాంగ్రెస్‌కు ఎక్కువ శాతం దక్కొచ్చని ఏఐసీసీ కార్యదర్శి కుంతియా చెప్పారు. ఎస్సీలకు రిజర్వైన 34 స్థానాల్లో సగం స్థానాలకు పైగా దళితుల సంఖ్య అధికం. యూపీ తర్వాత పంజాబ్‌లో పాగా వేయాలని బిఎస్పీ నేత మాయావతి చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. 2015 నుంచి పార్టీ బలోపేతానికి ప్రచారంచేసినా ప్రయోజనం లేకుండా పోయింది. కానీ దళితులు ప్రతి ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి, అకాలీదళ్ పార్టీకి వేర్వేరుగా ఓటేయడం రివాజు. మాల్వా రీజియన్ ప్రాంతంలో విజయం సాధించిన పార్టీ అధికారంలోకి వస్తుందని గత గణాంకాలు చెప్తున్నాయి.

English summary
In Punjab, the party has made headway, but by not projecting a chief ministerial candidate, it may fritter away the advantage.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X