ఏఏపీకి మరో షాక్: సొంత పార్టీ ఎమ్మెల్యేపై మహిళా చీఫ్ ఫిర్యాదు
చండీగఢ్: ఆమ్ ఆద్మీ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఆరోపణలు చేసింది రాష్ట్ర మహిళా పార్టీ అధ్యక్షురాలు కావడం గమనార్హం. పంజాబ్ ఏఏపీ మహిళా విభాగం అధ్యక్షురాలు బల్జీందర్ కౌర్ స్వయంగా రాష్ట్ర మహిళా కమిషన్‌కు సొంత పార్టీ ఎమ్మెల్యే పైన ఫిర్యాదు చేశారు. ఆయన పంజాబీ మహిళల పరువు తీసేలా ప్రవర్తిస్తున్నట్టు ఆరోపించారు.
కొందరు ఏఏపీ నేతలు దాష్టీకాలకు దిగుతున్నారని, టికెట్లు అడుగుతున్న మహిళలను కోరిక తీర్చాలని అడుగుతూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ ఎమ్మెల్యే సెహ్రావత్ ఇటీవలే లేఖ రాసిన విషయం తెలిసిందే.

దీనినే ప్రస్తావిస్తూ.. అటువంటి విషయాలేవీ జరగకపోయినా, సెహ్రావత్ ఇలా లేఖలు రాసి తమ గౌరవానికి భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నారని టికెట్ ఆశిస్తున్న మహిళలు వాపోయారు. ఆయన ఆరోపణలు నిరాధారమని బల్జీందర్ కౌర్ అన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!