వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆప్ మ్యానిఫెస్టో : పంజాబీలకు 'ఉచిత వరాలు'

పంజాబ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోసం ఆప్ తన ఎన్నికల మ్యానిపెస్టోను శుక్రవారం నాడు విడుదల చేసింది.దక్షిణాది రాష్ట్రాల్లో మాదిరిగానే ఉచిత హమీలను ఆప్ కురిపించింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

పంజాబ్ :ఉచిత హమీలతో పంజాబ్ ఓటర్లకు ఆప్ వరాల జల్లు కురిపించింది.తమకు ఓటేస్తే ఆస్తిపన్ను రద్దుచేస్తామని ప్రకటించింది. వృద్దులకు ప్రతి నెల రూ.2500 పెన్షన్ ఇస్తామని ఆ పార్టీ ప్రకటించింది.దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీలు కురిపించినట్టుగానే ఉచితహమీలను ఆప్ పంజాబ్ ఓటర్లకు కురిపించింది.

పంజాబ్ రాష్ట్రంపై ఆప్ ప్రత్యేకంగా కేంద్రీకరించింది. ఈ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకొనేందుకుగాను ఆ పార్టీ వ్యూహరచన చేస్తోంది.

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రోజు నుండి ఆప్ ముఖ్యనాయకులంతా పంజాబ్ రాష్ట్రంలో మకాం వేసి ప్రచారం చేస్తున్నారు.

గత పార్లమెంట్ ఎన్నికల్లో ఆప్ కు నాలుగు పార్లమెంట్ స్థానాలు దక్కాయి.దీంతో ఈ రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై ఆప్ ప్రత్యేకంగా కేంద్రీకరించింది.

 మ్యానిఫెస్టో విడుదలచేసిన ఆప్

మ్యానిఫెస్టో విడుదలచేసిన ఆప్

పంజాబ్ రాష్ట్రంలో అన్ని స్థానాలకు ఒంటరిగా ఆప్ పోటీచేస్తోంది. అయితే అదికార అకాళీదళ్ బిజెపి, కాంగ్రెస్ పార్టీలు తమ మ్యానిఫెస్టోలను విడుదలచేసిన తర్వాత ఆప్ తన మ్యానిఫెస్టోను విడుదల చేసింది. తమకు పంజాబ్ లో అధికారాన్ని అప్పగిస్తే ఆస్తి పన్ను రద్దుచేస్తామని ఆప్ ప్రకటించింది. అంతేకాదు వృద్దులకు ప్రతి నెలా రూ.2500 చెల్లిస్తామని ప్రకటించింది.

 యువతకు ఉద్యోగాల కల్పన

యువతకు ఉద్యోగాల కల్పన

తమకు అధికారాన్ని కట్టబెడితే 25 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని ఆప్ ప్రకటించింది.ఫారిన్ ఎంప్లాయిమెంట్ యూత్ బోర్డు ద్వారా విదేశాల్లో ఉద్యోగాలు ఆశించేవారికి ప్రత్యేక శిక్షణ కల్పిస్తామని ఆ పార్టీ ప్రకటించింది.టెక్నాలజీని అందిపుచ్చుకొని ఫైనాన్స్ అందిపుచ్చుకొంటూ ఇండస్ట్రీ మెంటర్స్ మార్కెట్ సెక్టార్ లో అవకాశాలు కల్పించేలా పది నగరాల్లో పది నగరాల్లో పంజాబ్ లాంచ్ ప్యాడ్స్ ఏర్పాటుచేస్తామని ప్రకటించింది.

ఉచిత వైద్యం

ఉచిత వైద్యం


ప్రభుత్వేతర ఆసుపత్రుల్లో కూడ రూపాయి చెల్లించకుండా ఐదు లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయాన్ని కల్పిస్తామని ఆ పార్టీ ప్రకటించింది.డ్రగ్ బాధితులకు పునరావాసం కల్పిస్తామని ప్రకటించింది.ప్రతి గ్రామంలో చిన్న పట్టణాల్లో కూడ ఉచిత రోగ నిర్థారణ పరీక్షలు, ఉచితంగానే మందులు ఇవ్వనున్నట్టు ఆప్ ప్రకటించింది.

ఎర్రబుగ్గకార్లకు ఆప్ దూరం

ఎర్రబుగ్గకార్లకు ఆప్ దూరం

ఆప్ పంజాబ్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే మంత్రులు ఎర్ర బుగ్గ కార్లను వినియోగించబోమని ప్రకటించింది.పంజాబ్ ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చుతామని ఆ పార్టీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించింది.2018 నాటికి రైతులను అప్పుల నుండి విముక్తి చేస్తామని చెప్పింది.గృహవిద్యుత్ వినియోగదారులకు 400 యూనిట్లవరకు ఉచితంగా విద్యుత్,ఆమ్ ఆద్మీ క్యాంటీన్లలో ఐదురూపాయాలకే బోజనం ఇస్తామని ఆ పార్టీ ప్రకటించింది.

English summary
aap released its manifesto for punjub elections
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X