వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రధాని మోడీ అఖిల పక్ష భేటీకి ఆహ్వానం లేని ఆప్, ఆర్జేడీ .. ఫైర్ అవుతున్న పార్టీల నాయకులు

|
Google Oneindia TeluguNews

భారత్-చైనా సరిహద్దు వద్ద చోటు చేసుకున్న ఉద్రిక్తతనేపథ్యంలో చైనాతో సరిహద్దు వివాదంపై చర్చించడానికి ఇవాళ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టిన విషయం తెలిసిందే. ఇక ఈ అఖిలపక్ష సమావేశానికి దేశంలోని అన్ని ప్రధాన పార్టీలను ఆహ్వానించిన కేంద్ర ప్రభుత్వం, ఈ సమావేశానికి ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీని, అలాగే బీహార్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న ఆర్జేడిని ఆహ్వానించలేదని తెలుస్తుంది.

 చైనా విషయంలో ఆచితూచి అడుగేస్తున్న ప్రధాని మోడీ ... నేడు సాయంత్రం అఖిలపక్షం ఆంతర్యం ఇదే !! చైనా విషయంలో ఆచితూచి అడుగేస్తున్న ప్రధాని మోడీ ... నేడు సాయంత్రం అఖిలపక్షం ఆంతర్యం ఇదే !!

ఢిల్లీలో అధికారంలో ఉన్నా ఆప్ కు అందని ఆహ్వానం

ఢిల్లీలో అధికారంలో ఉన్నా ఆప్ కు అందని ఆహ్వానం

ఇక దీనిపై స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ మాట్లాడుతూ అఖిలపక్ష సమావేశానికి అధికారంలో ఉన్న, అలాగే పంజాబ్ లో ప్రతిపక్ష హోదాలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీని పిలవకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. బిజెపి ఆప్ అభిప్రాయాన్ని తీసుకోవడం ఇష్టపడడం లేదని ఆయన అన్నారు .

నువ్వొక్కడివే నినదిస్తే దేశం వృద్ధి చెందుతుందా

నువ్వొక్కడివే నినదిస్తే దేశం వృద్ధి చెందుతుందా

ఇక అంతే కాదు సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అని నువ్వు నువ్వు ఒక్కడివే నినదిస్తావు.. ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవు.. నువ్వు ఒకడివి నినదిస్తే దేశం అభివృద్ధి చెందదు అని సంజయ్ సింగ్ ప్రధాని నరేంద్ర మోడీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు .కేంద్ర ప్రభుత్వం అహంభావ పూరిత వైఖరి ప్రదర్శించటం మంచిది కాదని ఆయన విమర్శించారు. అఖిలపక్షానికి తమ పార్టీని ఆహ్వానించకపోవడం ప్రధాని ఒంటెద్దు పోకడలకు నిదర్శనమని సంజయ్ సింగ్ పేర్కొన్నారు.

లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీకి నో ఇన్విటేషన్

లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీకి నో ఇన్విటేషన్

లడఖ్‌లో భారత్-చైనా ఘర్షణపై చర్చించడానికి ఈ రోజు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ పిలిచిన అఖిలపక్ష సమావేశంలో సోనియా గాంధీ, మమతా బెనర్జీ పాల్గొంటారని భావిస్తున్నారు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మరియు లాలూ ప్రసాద్ యాదవ్ యొక్క ఆర్జెడి కి ఆహ్వానం అందకపోవటం తో వారు ఆగ్రహంతో ఉన్నారు .తన పార్టీని ఎందుకు ఆహ్వానించలేదని ఆర్జేడీకి చెందిన తేజశ్వి యాదవ్ ట్వీట్‌లో ప్రశ్నించారు.

 తమను ఆహ్వానించలేదన్న ఆర్జేడీ ఆధ్యక్షుడు తేజస్వి యాదవ్

తమను ఆహ్వానించలేదన్న ఆర్జేడీ ఆధ్యక్షుడు తేజస్వి యాదవ్


ఇక అలాగే అఖిలపక్ష భేటీకి తమ పార్టీని ఆహ్వానించలేదని ఆర్జేడి అధ్యక్షుడు తేజస్వి యాదవ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. బీహార్లో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నప్పటికీ తమకు ఆహ్వానం అందలేదని ఆయన ట్వీట్ చేశారు. అయితే దీనిపై ప్రభుత్వ వర్గాలు వివరిస్తున్నాయి.ఆప్, ఆర్జేడీ పార్టీలను పిలవకపోవడానికి ఇతర కారణాలేవీ లేవని పార్లమెంటులో కనీసం ఐదుగురు సభ్యులతో కూడిన పార్టీలను మాత్రమే అఖిలపక్ష భేటీకి ఆహ్వానించామని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.

Recommended Video

Telangana People Proud of Colonel Santosh Babu : Public Reaction
 క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వ వర్గాలు

క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వ వర్గాలు

అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి కేవలం నలుగురు ఎంపీలు మాత్రమే ఉన్నారని, ఇక ఆర్జేడీకి కూడా తగినంత మంది ఎంపీలు లేకపోవడంతోనే వారికి ఆహ్వానం అందలేదని పేర్కొన్నారు. ఇక నేడు అఖిల పక్ష భేటీ నేపధ్యంలో చైనా విషయంలో వివిధ రాజకీయ పార్టీల నుండి ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతాయి. ప్రధాని మోడీ ఏం ఆలోచిస్తున్నారు అనేవి ఆసక్తికరంగా మారాయి.

English summary
The central government, which invited all major parties in the country for the all-party meeting, seems to have not invited the Aam Aadmi Party, which is in power in Delhi, as well as the main opposition party in Bihar, the RJD. Aam Aadmi Party as well as RJD leaders express embarrassment over Prime Minister's decision not to invite them
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X