వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమిత్ షాపై 48 గంటల నిషేధం విధించండి, ఈసీని కోరిన ఆప్, ఎందుకంటే..?

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హీటెక్కింది. ఆప్-బీజేపీ మధ్య మాటలయుద్ధం జరుగుతోంది. ఇటీవల కేంద్ర హోంమంత్రి ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశారు. అది తప్పు అని ఆప్ ఆరోపించింది. తప్పుడు వీడియో ప్రదర్శించిన అమిత్ షాపై చర్యలు తీసుకోవాలనిఎన్నికల సంఘాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ కోరింది. ఈ మేరకు ఆప్ నేతలు సంజయ్ సింగ్, పంకజ్ గుప్తా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

48 గంటలు బ్యాన్..?

48 గంటలు బ్యాన్..?

అమిత్ షాపై 48 గంటల ప్రచారం నిషేధం విధించాలని ఆప్ నేతలు కోరారు. ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు సరిగాలేవని అమిత్ షా తప్పుడు వీడియో పోస్ట్ చేశారని పేర్కొన్నారు. ఇటీవల ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన గౌతం గంభీర్, పర్వేశ్ వర్మ, హన్స్ రాజ్ తప్పుడు వీడియోను అమిత్ షాకు అందజేశారని పేర్కొన్నారు. పాఠశాల వీడియోకు కొన్ని మార్పులు చేసి.. సదుపాయాలు లేవనేటట్టు చేశారని పేర్కొన్నారు. ఆ వీడియోలు అందజేసిన ముగ్గురు ఎంపీలపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఎంపీలపై కేసు

ఎంపీలపై కేసు

ఎన్నికల సంఘం ప్రతినిధులను కలిసి ఢిల్లీలో అమిత్ షా ప్రచారంపై నిషేధం విధించాలని కోరారు. ఆ వీడియోను అందజేసిన ఎంపీలపై కేసు కూడా నమోదు చేస్తామన్నారు. ఢిల్లీ స్కూల్స్‌లో సౌకర్యాలు లేవనే ట్వీట్లను కూడా తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే తాము చట్టపరంగా ముందుకెళ్తామని హెచ్చరించారు.

కేజ్రీవాల్ ఫైర్

కేజ్రీవాల్ ఫైర్


అమిత్ షా షేర్ చేసిన వీడియోలు మార్పింగ్ చేసినవి అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఆప్ ప్రభుత్వం అధికారం చేపట్టాక ఢిల్లీలో విద్యావ్యవస్థ తీరు మారిపోయిందని చెప్పారు. కానీ అమిత్ షా మాత్రం 16 లక్షల మంది విద్యార్థులను 32 లక్షల మంది తల్లిదండ్రులను అవమానించేలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.

నో విజన్

నో విజన్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మిషన్, విజన్‌ లేని బీజేపీ తప్పుడు వీడియోలను ప్రదర్శించి లబ్ది పొందాలని చూస్తోందని ఆయన ఆరోపించారు. అంతేకాదు విద్యా వ్యవస్థనే కించపరిచేలా అమిత్ షా వ్యవహరించారని పేర్కొన్నారు. అమిత్ షా ఢిల్లీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కోరారు. విద్యార్థులు, తల్లిదండ్రులే కాక టీచర్లకు కూడా క్షమాపణ చెప్పాలని సంజయ్ సింగ్ తెలిపారు.

English summary
aap has asked the Election Commission to impose a 48-hour campaigning ban on Union Home Minister Amit Shah for allegedly tweeting a "fake" video on Delhi government schools.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X