వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేజ్రీవాల్‌కు షాక్: చీలిక దిశగా ఆమ్ ఆద్మీ పార్టీ?

|
Google Oneindia TeluguNews

చండీగఢ్: ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు షాక్ తగలనుందా? పంజాబ్‌లోని ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పార్టీ చీలిక తప్పదా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి.

త్వరలో ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏఏపీకి ఇది దెబ్బే. అవినీతి ఆరోపణలపై పంజాబ్ పార్టీ చీఫ్ సుచాసింగ్ చోటేపూర్‌ను కేజ్రీవాల్ పార్టీ నుంచి తొలగించారు. దీంతో సుచాసింగ్ ఢిల్లీ సీఎంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేజ్రీవాల్ సిక్కు వ్యతిరేకి అని ఆరోపించారు.

మరోవైపు సుచాసింగ్‌ను తొలగించడంపై పంజాబ్‌లోని ఏఏపీకి చెందిన 12 మంది జోనల్ ముఖ్యనేతలు కేజ్రీవాల్‌కు అల్టిమేటం జారీ చేశారు. వెంటనే సుచాసింగ్‌ను తిరిగి తీసుకోవాలన్నారు. అంతేకాక ముఖ్యనేతలైన సంజయ్ సింగ్, దుర్గేష్ పాఠక్‌లను ఏఏపీ పంజాబ్ వ్యవహారాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

AAP Split Ahead? Sacked Punjab Chief Chhotepur Strikes Back

దీంతో పార్టీలో ఒక్కసారిగా వేడి రాజుకుంది. అలాగే సుచాసింగ్‌ను తప్పించాలని కోరుతూ పంపిన పిటిషన్‌పై సంతకం చేసిన ఇరవై ఒక్క మంది రాష్ట్ర నేతల పైనా చర్యలు తీసుకోవాలని జోనల్ ప్రముఖులు డిమాండ్ చేశారు. దీంతో రాష్ట్ర ఏఏపీలో వేడు రాజుకుంది.

కాగా, గతంలో మంత్రిగా పని చేసిన సుచాసింగ్ చోటేపూర్ పైన శుక్రవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో అనర్హత వేటు వేశారు. పంజాబ్ ఎన్నికల్లో ఓ నియోజకవర్గం సీటును ఇప్పిస్తానని చెప్పి పార్టీకి చెందిన ఓ నేత నుంచి లంచం తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియో కూడా తమ వద్ద ఉందని పార్టీ అధిష్టానం చెబుతోంది. దీంతో అతనిపై వేటు వేశారు. ఏఏపీలో రాజకీయం వేడెక్కింది.

English summary
Arvind Kejriwal's Aam Aadmi Party is staring at a possible split in Punjab perilously close to assembly elections after it sacked its Punjab chief Sucha Singh Chhotepur over allegations of corruption. Mr Chhotepur, who has accused Mr Kejriwal of being "anti-Sikh," has hit back.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X