వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

delhi Exit Poll Result 2020: CNN, సుదర్శన్ టీవీ కూడా ఆప్‌కే మొగ్గు, 45 సీట్లలో విక్టరీ..

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ కా సుల్తాన్ మరోసారి అరవింద్ కేజ్రీవాల్ కాబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ మెజార్టీ సీట్లు సాధించబోతుందని న్యూస్ 18, సుదర్శన్ టీవీ సర్వే సంస్థలు తెలిపాయి. మెజార్టీ సర్వే సంస్థలు అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆప్‌కే పట్టం కట్టాయి. న్యూస్ 18 మాత్రం ఆప్ 44 సీట్లు సాధించబోతుందని తెలిపింది. బీజేపీ 26 సీట్లతో ప్రతిపక్షానికే పరిమితమవుతోందని లెక్కగట్టింది. ఇందులో కాంగ్రెస్, ఇతరుల వివరాలు లేకపోవడం విశేషం..

 మరోసారి విజయం

మరోసారి విజయం

సుదర్శన్ టీవీ కూడా ఆప్‌కే పట్టం కట్టింది. ఆమ్ ఆద్మీ పార్టీ 40-45 సీట్లు గెలుచుకుంటుందని తెలిపింది. బీజేపీ 24 నుంచి 28 సీట్లతో రెండో స్థానానికి పరిమితమవుతోందని వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ రెండు నుంచి మూడు సీట్లు మాత్రమే గెలుచుకుంటుందని కఠోర నిజాన్ని తెలియజేసింది. సుదర్శన్ టీవీ కూడా ఇతరుల వివరాలు తెలియజేయపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరోవైపు ఢిల్లీలో పోలింగ్ తగ్గింది. సబర్బన్‌లో పోలింగ్ పెరగగా.. సిటీలో తగ్గడం ఆందోళన కలిగించింది. మరోవైపు ఓటేసేందుకు వయోజనుల అంతగా ముందుకురాకపోవడం కూడా మిగతా పార్టీల విజయాలపై ప్రభావం చూపించింది.

పోలింగ్ తగ్గింది

పోలింగ్ తగ్గింది

2015లో ఢిల్లీ అసెంబ్లీలో 67 శాతం పోలింగ్ నమోదైన సంగతి తెలిసింది. ఈ సారి మాత్రం 58 వరకు రికార్డైంది. అది కాస్త అటు ఇటుగా 60 శాతంగా ఉండే అవకాశం ఉంది. పోలింగ్ తగ్గడం, కేంద్రంలో బీజేపీపై ఉన్న వ్యతిరేకతను ఆప్ క్యాష్ చేసుకుందని సర్వే సంస్థ తెలిపింది.

యావరేజీగా..

యావరేజీగా..

వివిధ సర్వే సంస్థల యావరేజ్ చూసుకున్న ఆప్ 47 నుంచి 54 సీట్లు గెలుచుకొని విజయబావుటా ఎగరవేస్తోందని తెలిపాయి. బీజేపీ 15 నుంచి 20 సీట్లు గెలుచుకొని ప్రతిపక్షానికే పరిమితమవుతోందని సగటు లెక్కగట్టింది. ఇదివరకు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ 1-2 సీట్లే గెలుచుకుంటుందని సర్వే సంస్థలు అంచనా గట్టడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఆప్‌కే పట్టం

ఆప్‌కే పట్టం

ఎన్నికల ప్రచారంలో కూడా ఆప్-బీజేపీ మధ్యే సాగింది. సీఎం అభ్యర్థిని ప్రకటించడం లేదని సీఎం కేజ్రీవాల్ బీజేపీని విమర్శించిన సంగతి తెలిసిందే. కమలమే తమ అభ్యర్థిని డిసైడ్ చేస్తుందని బీజేపీ నేతలు చెప్పినా.. ప్రజలు మాత్రం విశ్వసించలేదు. మళ్లీ చీపురు పార్టీకే పట్టం కట్టబోతున్నారు. ఎగ్జిట్ పోల్స్‌లో ఆప్‌కే పట్టం కట్టబోతున్నారనే వార్తలతో ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 11వ తేదీన మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టనున్నారు.

English summary
Delhi Assembly Election Exit Poll 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X