వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరుషి కేసు: నూపూర్ తల్వార్‌కు జైల్లో అనారోగ్యం

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తన కూతురు ఆరుషి తల్వార్, పని మనిషి హేమరాజ్ హత్య కేసులో భర్త రాజేష్ తల్వార్‌తో పాటు దోషిగా తేలిన నూపుర్ తల్వార్ జైలులో అనారోగ్యంతో బాధపడుతోంది. ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్‌లో గల జైలులో ఆమెను వైద్యులు పరీక్షిస్తున్నారు.

మంగళవారం తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఆమె కోర్టుకు వరకు వెళ్లగలదా, లేదా అనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. సోమవారం తీర్పు వెలువడిన వెంటనే భార్యాభర్తలు రాజేష్, నూపుర్ తల్వార్ తీవ్ర ఉద్వేగానికి, ఆగ్రహానికి గురయ్యారు. తాము పైకోర్టుకు వెళ్తామని చెప్పారు.

Nupur Talwar unwell in jail

నూపుర్ తల్వార్ ఏడ్చేసింది కూడా. ఆరుషి, హేమరాజ్ 2008లో హత్యకు గురైన విషయం తెలిసిందే. తల్లిదండ్రులు హత్య చేశారని చెప్పడానికి ఫోరెన్సిక్ లేదా మెటీరియల్ సాక్ష్యం ఏదీ లేనప్పటికీ సర్క్యుమస్టన్షియల్ ఎవిడెన్స్ ఆధారంగా వారిని కోర్టు తేల్చింది.

ఘజియాబాద్‌లోని జైలులో భార్యాభర్తలను వేర్వేరు సెల్స్‌లో ఉంచారు. జైలులో వారు రోదిస్తూనే ఉన్నారు. వారు నిరంతరం ఏడుస్తూ ఆహారం తీసుకోవడానికి కూడా నిరాకరిస్తున్నారని అంటున్నారు. గత రాత్రి బలవంతంగా తినిపించినట్లు చెబుతున్నారు.

English summary
Nupur Talwar, who has been found guilty along with husband Rajesh of killing their daughter and domestic help, is unwell. Doctors attending to her at a prison in Ghaziabad near Delhi say they will decide in a few hours whether she can travel to a court nearby to receive her sentence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X