వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరుషి-హేమరాజ్ హత్య కేసులో కొద్దిసేపట్లో కోర్టు తీర్పు

By Srinivas
|
Google Oneindia TeluguNews

లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి - హేమరాజ్ జంట హత్యల కేసులో ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ఈ రోజు (సోమవారం) తీర్పును వెలువరించనుంది. రెండుగంటలకు వెలువడాల్సిన తీర్పులో జాప్యం జరుగుతోంది. ఆరుషి తల్లిదండ్రులు రాజేశ్ తల్వార్, నుపుర్ తల్వార్‌లు కోర్టుకు హాజరయ్యారు. కేసు తీర్పు నేపథ్యంలో ఘజియాబాద్ కోర్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది.

కోర్టు వద్ద భారీ బందోబస్తు

ఆరుషి - హేమరాజ్ జంట హత్యల కేసులో కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో న్యాయస్థానం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా కేసు సంచలనం రేపింది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.

 Aarushi Case

2008 మే 16న ఆరుషి - హేమరాజ్‌ల హత్య జరిగింది. ఈ ఘటనపై సిబిఐ కోర్టులో పదిహేను నెలలుగా విచారణ కొనసాగుతోంది. ఆరుషి తల్లిదండ్రులు రాజేశ్ తల్వార్, నుపుర్ తల్వార్‌లో వారిని హత్య చేశారని సిబిఐ అభియోగాలు నమోదు చేసింది. దర్యాఫ్తు సమయంలో కేసు అనేక మలుపులు తిరిగింది.

English summary
One cannot accuse the Talwars yet, not at least when there have been grave mistakes on the part of the CBI and the police too. True, that some of the evidences found at the site of the crime directly point towards the parents, who were the only one's present in the house, apart from Aarushi and Hemraj.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X