వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరుషి హత్య కేసు: తల్లిదండ్రులు నిర్దోషులే, అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అరుషి తల్వార్ హత్య కేసులో అలహాబాద్ హైకోర్టు గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటికే జైలు శిక్ష అనుభవిస్తున్న అరుషి తల్లిదండ్రులను నిర్దోషులుగా పేర్కొంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

Recommended Video

Aarushi Talwar Case : ఆరుషి హత్య కేసు : అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు | Oneindia Telugu

అలహాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆరుషి తల్వార్ హత్య కేసులో అలహాబాద్ హైకోర్టు గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటికే ఘజియాబాద్ జైలు శిక్ష అనుభవిస్తున్న ఆరుషి తల్లిదండ్రులను నిర్దోషులుగా పేర్కొంది.

సర్వత్రా ఉత్కంఠ: అరుషి హత్య కేసులో కోర్టు తీర్పు నేడే..సర్వత్రా ఉత్కంఠ: అరుషి హత్య కేసులో కోర్టు తీర్పు నేడే..

నోయిడాలోని జలవాయి విహార్‌లో 2008 మే 16న ఆరుషి తల్వార్(14) హత్యకు గురైంది. ఆరుషిని ఆమె తల్లిదండ్రులైన నూపుర్ తల్వార్, రాజేష్ తల్వార్‌లు ఇంటి పనిమనిషి హేమరాజ్‌తో కలిసి హత్య చేసినట్టు ఉత్తరప్రదేశ్ కోర్టు 2013లో తీర్పుచెబుతూ నూపుర్, రాజేష్‌ తల్వార్‌లకు జీవిత ఖైదు విధించింది.

Aarushi’s parents did not murder her says Allahabad High Court

అయితే ఈ తీర్పుపై ఆరుషి తల్లిదండ్రులు చేసుకున్న అప్పీల్‌పై జస్టిస్ బీకే నారాయణ, జస్టిస్ ఏకే మిశ్రాలతో కూడిన హైకోర్టు బెంచ్ గత సెప్టెంబర్‌లో విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది.

తాజాగా గురువారం సాయంత్రం అలహాబాద్ హైకోర్టు బెంచ్ తన తీర్పును ప్రకటించింది. ఆరుషిని తల్లిదండ్రులే చంపారనేందుకు తగిన ఆధారాలు లేవని తీర్పులో పేర్కొంటూ రాజేష్‌ తల్వార్‌, నూపుర్ తల్వార్ లను నిర్దోషులుగా ప్రకటించింది.

English summary
The High Court pronounced its verdict on an appeal filed by the Aarushi's parents Dr Rajesh and Nupur Talwar. They had challenged a CBI court order which had convicted them for the murder of their daughter Aarushi and domestic help Hemraj in 2008.Aarushi Talwar was killed at her house on the night of May 15-16, 2008 in Noida. The police found her with her throat slit and injuries on her head. The CBI court had in 2013 held the Talwars guilty of killing Aarushi after noting that the provisions of the Evidence Act had transferred the onus on the parents to explain how the teenager was murdered. Security around the court hall was tight in view of this verdict. The court hall was a packed one as the judge pronounced the verdict.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X