వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సర్వత్రా ఉత్కంఠ: అరుషి హత్య కేసులో కోర్టు తీర్పు నేడే..

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అరుషి తల్వార్ హత్య కేసులో అలహాబాద్ హైకోర్టు గురువారం కీలకమైన తీర్పు ఇవ్వనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

Recommended Video

Aarushi Talwar Case : ఆరుషి హత్య కేసు : అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు | Oneindia Telugu

అలహాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అరుషి తల్వార్ హత్య కేసులో అలహాబాద్ హైకోర్టు గురువారం కీలకమైన తీర్పు ఇవ్వనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

నోయిడాలోని జలవాయి విహార్‌లో 2008 మే 16న అరుషి తల్వార్(14) హత్యకు గురైంది. అరుషిని ఆమె తల్లిదండ్రులైన నూపుర్ తల్వార్, రాజేష్ తల్వార్‌లు ఇంటి పనిమనిషి హేమరాజ్‌తో కలిసి హత్య చేసినట్టు ఉత్తరప్రదేశ్ కోర్టు 2013లో తీర్పుచెబుతూ నూపుర్, రాజేష్‌ తల్వార్‌లకు జీవిత ఖైదు విధించింది.

మొదట పనిమనిషిపై అనుమానం...

మొదట పనిమనిషిపై అనుమానం...

అరుషి హత్యకేసు అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తొలుత పనిమనిషి హేమరాజే ఈ హత్యకు పాల్పడినట్టు అనుమానించారు. అయితే అరుషి హత్యకు గురైన ఫ్లాట్‌లోని టెర్రస్‌పై రెండ్రోజుల తర్వాత హేమరాజ్ విగతజీవుడై పడిఉండటంతో కేసు మరో మలుపు తిరిగింది.

తల్లిదండ్రులే నిందితులయ్యారు...

తల్లిదండ్రులే నిందితులయ్యారు...

దీంతో అందరి అనుమానం తల్వార్ దంపతులపైకి మళ్లింది. ఆ దిశగా దర్యాప్తు జరిపిన పోలీసులు అరుషి, హేమరాజ్ హత్యలకు రాజేష్, నూపర్‌లే కారణమనే నిర్ధారణకు వచ్చారు. అయితే దర్యాప్తును తప్పుదారి పట్టిచేందుకు పోలీసులే ఇలాంటి నేరాభియోగాలు మోపారంటూ తల్వార్ దంపతులు, వారి సన్నిహత మిత్రులు చెబుతూ వచ్చారు.

సరైన సాక్ష్యాలు లేవంటూ...

సరైన సాక్ష్యాలు లేవంటూ...

దీంతో ఈ కేసు ఉత్తరప్రదేశ్ పోలీసుల నుంచి సీబీఐ చేతికి వెళ్లింది. 2009లో సీబీఐ ఈ కేసును మరో టీమ్‌కు అప్పగించగా చివరకు కేసును మూసేయాల్సిందిగా ఆ టీమ్ సిఫారసు చేసింది. పరిస్థితుల ఆధారంగా రాజేష్‌ తల్వార్ ను అనుమానితుడిగా పేర్కొన్న సీబీఐ టీమ్ సరైన సాక్ష్యాలు లేనందున నేరాభియోగాలు మోపేందుకు నిరాకరించింది.

 ఆరుషి తల్లిదండ్రులకు జీవిత ఖైదు...

ఆరుషి తల్లిదండ్రులకు జీవిత ఖైదు...

అయితే సీబీఐ ప్రత్యేక కోర్టు మాత్రం ఈ కేసు మూసివేతకు ఒప్పుకోలేదు. అందుబాటులో ఉన్న సాక్ష్యాల ఆధారంగానే అరుషి తల్లిదండ్రులను ప్రాసిక్యూట్ చేయాలని ఆదేశించింది. దీంతో 2013లో అరుషి తల్లిదండ్రులకు జీవిత ఖైదు విధించారు.

జైలుపాలైన దంపతులు...

జైలుపాలైన దంపతులు...

2008 మే 23న అరుషి తండ్రి రాజేష్‌ తల్వార్ ను మొదటిసారి యూపీ పోలీసులు అరెస్టు చేసి దస్నా జైలుకు పంపారు. అయితే 2008 జూలై 11న అతడ్ని విడిచిపెట్టారు. అనంతరం 2012లో రాజేష్ భార్య నూపుర్‌ తల్వార్ ఘజియాబాద్ కోర్టు ముందు లొంగిపోవడంతో ఆమెను కూడా దస్నా జైలుకు పంపారు.

అరుషి తల్లిదండ్రుల అప్పీలు...

అరుషి తల్లిదండ్రుల అప్పీలు...

అరుషి తల్లిదండ్రులు ఈ తీర్పుపై చేసుకున్న అప్పీల్‌పై జస్టిస్ బీకే నారాయణ, జస్టిస్ ఏకే మిశ్రాలతో కూడిన అలహాబాద్ హైకోర్టు బెంచ్ గత సెప్టెంబర్‌లో విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. అరుషిని హత్య చేసింది ఆమె తల్లిదండ్రులేనా? అన్న దానిపై ఈ తీర్పు వెలువడనుంది.

English summary
The Allahabad High Court is likely to pronounce its judgment on Thursday in the murder case of 14-year-old Aarushi Talwar, four years ago, Aarushi’s murder were convicted for the killing. Aarushi’s parents, Rajesh and Nupur Talwar, were sentenced to life after a court in Uttar Pradesh convicted them for the gruesome killings of their daughter and their domestic help Hemraj in 2013. A high court bench comprising Justice B.K. Narayana and Justice A.K. Mishra reserved its verdict in September in the appeal filed by Aarushi’s parents, who were sentenced to life in jail by a Central Bureau of Investigation (CBI) court in Ghaziabad. “On November 26, 2013, the CBI announced life imprisonment to the Talwar couple. Tomorrow, the appeal filed by them will be heard and I believe they will get justice,” Sunil Maurya, writer of book ‘Ek thi Aarushi’ told ANI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X