వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆరుషి తల్వార్ హత్య కేసు: ఐదేళ్లు ఏం జరిగింది?

By Pratap
|
Google Oneindia TeluguNews

నోయిడా: ఆరుషి, హేమరాజ్ జంట హత్యలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. నోయిడాలో 2008లో జరిగిన ఈ హత్యలపై కేసు గత ఐదేళ్ల కాలంగా నడుస్తూ వచ్చింది. 2008లో 14 ఆరుషి, ఇంటి పనిమనిషి జలవాయు విహార్‌లో దారుణంగా హత్యకు గురయ్యారు. ఆ కేసు విచారణ ఇలా కొనసాగింది.

2008 మే 16: దంత వైద్యులు రాజేష్, నూపుర్ తల్వార్ దంపతుల కూతురు ఆరుషి తల్వార్ కూతురు నోయిడాలోని నివాసంలోని పడకగదిలో గొంతు కోసి చంపడంతో శవమై కనిపించింది. నేపాల్‌కు చెందిన ఇంటి పనిమనిషి హేమరాజ్ హత్య చేసి ఉండవచ్చునని అనుమానించారు.

Nov 25: Who killed Aarushi and Hemraj? The entire country has been waiting for the answer. However, the question has been remained unanswered even after five long years of the gruesome double murder in Noida. Find out what happened since 2008 when 14-year-old Aarushi and their domestic help Hemraj were found killed inside Jalvayu Vihar. Read more at: https://www.oneindia.com/india/aarushi-talwar-hemraj-double-murder-timeline-what-happened-since-2008-1347315.html

మే 17: తల్వార్ నివాసంలోని టెర్రాస్‌పై హేమరాజ్ శవం కనిపించింది.

మే 18: సర్జికల్ పెర్సిషన్‌తో హత్యలు చేశారని పోలీసులు చెప్పారు. ఇంటివారే ఈ హత్యలు చేసి ఉంటారని ఆనుమానించారు.

మే 23: జంట హత్యల కేసులో ఆరుషి తండ్రి రాజేష్ తల్వార్ అరెస్టయ్యాడు.

మే 31: కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) హత్య కేసు విచారణను తన చేతుల్లోకి తీసుకుంది.

జూన్ 13: రాజేష్ తల్వార్ కాంపౌండర్ కృష్ణను సిబిఐ అరెస్టు చేసింది. పది రోజుల తర్వాత తల్వార్ దంపతుల సేవకుడు రాజ్ కుమార్‌ను, తల్వార్ దంపతుల పక్కింటి పనిమనిషి విజయ్ మండల్‌ను సిబిఐ అదుపులోకి తీసుకుంది.

జులై 12: సిబిఐ సాక్ష్యాలను సమర్పించడంలో విఫలం కావడంతో ఘజియాబాద్ కోర్టు రాజేష్‌కు బెయిల్ మంజూరు చేసింది.

2010 జనవరి 5: తల్వార్ దంపతులకు నార్కో పరీక్షలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ సిబిఐ కోర్టును ఆశ్రయించింది.

ఫిబ్రవరి 9: ఘజియాబాద్ స్పెషల్ కోర్టు సిబిఐ దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టును తిరస్కరించింది. రాజేష్, నూపుర్ తల్వార్‌లను విచారంచాలని ఆదేశాలు జారీ చేసింది. వారిపై సాక్ష్యాలు రూపుమాపడానికి ప్రయత్నాలు చేశారనే ఆరోపణపై కూడా కేసు నమోదైంది. కోర్టుకు హాజరు కానందుకు ఆ దంపతులకు ఘజియాబాద్ కోర్టు బెయిలబుల్ అరెస్టు వారంట్లు జారీ చేసింది.

2012 మార్చి 14: రాజేష్ తల్వార్ బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సిబిఐ తన వాదనలు కోర్టుకు వినిపించింది.

ఏప్రిల్ 30: నూపుర్ తల్వార్ అరెస్టు జరిగింది.

మే 3: సెషన్స్ కోర్టు నూపుర్ తల్వార్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.

మే 25: హత్య, సాక్ష్యాల విధ్వంసం, కుట్రలకు సంబంధించిన అభియోగాలను తల్వార్ దంపతులపై మోపారు.

సెప్టెంబర్ 25: సుప్రీంకోర్టు ఆదేశాలతో నూపుర్ తల్వార్ బెయిల్‌పై విడుదలైంది.

2013 ఏప్రిల్: ఆరుషి, హేమరాజ్‌లను తల్వార్ దంపతులు హత్య చేశారని సిబిఐ కోర్టుకు తెలిపింది. ఆరుషి, హేమరాజ్ అభ్యంతరకరమైన పరిస్థితిలో, కాంప్రమైంజిగ్ పోజిషన్‌లో కనిపించారని కూడా సిబిఐ తెలిపింది.

మే 3: సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ అరుణ్ కుమార్‌తో పాటు 14 మందిని సాక్షులుగా పిలుస్తూ సమన్లు జారీ చేయాలని డెఫెన్స్ తరఫు న్యాయవాది ప్రత్యేక కోర్టును కోరారు. సిబిఐ దాన్ని వ్యతిరేకించింది.

మే 6: కేసులో 14 మందికి సమన్లు జారీ చేయాలని కోరుతూ తల్వార్ దంపతులు పెట్టుకున్న పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. రాజేష్, నూపుర్ తల్వార్ వాంగ్మూలాలు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

అక్టోబర్ 18: సిబిఐ కోర్టు వాదనలను ముగించింది.

English summary
Nov 25: Who killed Aarushi and Hemraj? The entire country has been waiting for the answer. However, the question has been remained unanswered even after five long years of the gruesome double murder in Noida. Find out what happened since 2008 when 14-year-old Aarushi and their domestic help Hemraj were found killed inside Jalvayu Vihar.
 
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X