వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోమాంసం తరలిస్తున్నాడని సుత్తెతో చితకబాది, చిత్రహింసలు పెట్టి, చోద్యం చూసిన పోలీసులు, చివరికి !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/ చండీఘర్/ గుర్ గ్రామ్: గోమాంసాన్ని తరలిస్తున్నాడనే అనుమానంతో దేశరాజధాని సమీపంలో ఒ ట్రక్కు డ్రైవర్ పై కొందరు అల్లరిమూకలు విరుచుకుపడ్డారు. దేశరాజధాని సమీపంలోనే దారుణ సంఘటనతో దేశ ప్రజలు ఉలిక్కిపడ్డారు. ట్రక్కు డ్రైవర్ లక్మన్ అనే వ్యక్తిపై దాడి చెయ్యడంతో పాటు అతనిపై సుత్తెతో దాడి చేసి చిత్రహింసలకు గురి చేశారు. ఈ దారుణ సంఘటన వీడియో బయటకు వచ్చి ప్రస్తుతం వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

I'M NOT HIM: టెక్కీ స్కెచ్, 30 సార్లు సినిమా చూసి 20 మందికి రసగుల్లా పెట్టాడు, జీవితాన్నే!I'M NOT HIM: టెక్కీ స్కెచ్, 30 సార్లు సినిమా చూసి 20 మందికి రసగుల్లా పెట్టాడు, జీవితాన్నే!

 మాంసంతో బయలుదేరిన ట్రక్కు

మాంసంతో బయలుదేరిన ట్రక్కు

బక్రీద్ పండుగ సందర్బంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మాంసం తరలిస్తున్నారు. బాద్ షాపూర్ నుంచి గేదె మాంసంతో ఓ ట్రక్కు బయలుదేరింది. లక్మన్ ఖాన్ అనే డ్రైవర్ మాంసం ఉన్న ట్రక్కును నడుపుకుంటూ బయలుదేరాడు. అక్రమంగా గోమాంసం తరలిస్తున్నారని గుర్ గ్రామ్ కు చెందిన గోరక్షక బృందాలకు సమాచారం అందింది.

 ట్రక్కులను వెంటాడి పట్టుకుని !

ట్రక్కులను వెంటాడి పట్టుకుని !

మాంసం తరలిస్తున్న ట్రక్కును వెంటాడని గోరక్షక బృందాలు ఆ వాహనం నిలిపి డ్రైవర్ లక్మన్ ఖాన్ కు కిందకులాగేశారు. తరువాత గోమాంసం తరలిస్తావా ? నీకు ఎంత ధైర్యంరా అంటూ లక్మన్ ఖాన్ ను చితకబాదేశారు. లక్మన్ ఖాన్ ను కిందపడేసి కాళ్లతో తన్నుతూ కొద్దిదూరం లాక్కెళ్లారు. తరువాత బలమైన సుత్తె తీసుకుని లక్మన్ ఖాన్ తల మీద దాడి చెయ్యడంతో అతనికి తీవ్రగాయాలైనాయి.

నీ అంతు చూస్తాం రా

నీ అంతు చూస్తాం రా

ట్రక్కు డ్రైవర్ లక్మన్ ఖాన్ పై దాడి చేసిన అల్లరిమూకలు అతని సొంత గ్రామం అయిన బాద్ షాపూర్ పిలుచుకుని వెళ్లడానికి విఫలయత్నం చేశారు. ట్రక్కు డ్రైవర్ లక్మన్ ఖాన్ పై దాడి చేసే సమయంలో గోమాంసరక్షక బృందాల సభ్యులను అడ్డుకోవడానికి స్థానికులు సాహసం చెయ్యలేకపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేశారు.

 పోలీసులు ఏం చేశారో చూడండి

పోలీసులు ఏం చేశారో చూడండి

స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గోసంరక్ష బృందాల సభ్యులకు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. తరువాత ట్రక్కులో ఉన్నది గోమాంసామా ? కాదా ? అని తెలుసుకోవడానికి ఆ మాంసాన్ని ల్యాబ్ కు పంపించడానికి ప్రయత్నించారు. తీవ్రగాయాలైన ట్రక్కు డ్రైవర్ లక్మన్ ఖాన్ సు తీరికగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారని ఆరోపణలు ఉన్నాయి. అయితే గత 50 ఏళ్లుగా తాను మాంసం వ్యాపారం చేస్తున్నానని, ట్రక్కులో ఉన్నది గోమాంసం కాదని, గేదె మాంసం అని ట్రక్కు డ్రైవర్ లక్మన్ ఖాన్ లబోదిబో అంటున్నాడు.

Recommended Video

China Reports New COVID-19 Cases Again!
 వీడియో ఉన్నా పోలీసుల వింతవాదన

వీడియో ఉన్నా పోలీసుల వింతవాదన

సుత్తెతో దాడి చెయ్యడంతో ట్రక్కు డ్రైవర్ లక్మన్ ఖాన్ తల పగిలి అతనికి తీవ్రగాయాలు కావడంతో అతని పరిస్థితి విషమంగా ఉందని ఓ జాతీయ మీడియా వెళ్లడించింది. ట్రక్కు డ్రైవర్ పై దాడి చేస్తున్న వారి ముఖాలు స్పష్టంగా కనపడుతున్నా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని పోలీసులు కేసు నమోదు చేశారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ట్రక్కు డ్రైవర్ లక్మన్ పై దాడి చేసిన వారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, ఒకరిని అరెస్టు చేశామని పోలీసు శాఖ పీఆర్ ఓ సుభాష్ బోకన్ మీడియా వెల్లడించారు.

English summary
One person has been arrested after a person was beaten up, who was transporting meat in his vehicle in Gurugram. Around two dozen people allegedly beat a man up brutally for allegedly "carrying beef" in Gurugram's Badshahpur area, on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X