వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

vision 2020: కొత్త ఆవిష్కరణలు, 18 గంటలు పని, అబ్దుల్ కలామ్‌కు సలామ్‌: శిష్యుడు పొన్‌రాజ్

|
Google Oneindia TeluguNews

ఏపీజే అబ్దుల్ కలాం.. మాజీ భారత రాష్ట్రపతి, ప్రజల అధ్యక్షుడు అనే పేరు కూడా గడించారు. శాస్త్రవేత్త అయిన కలాం.. ఎప్పుడూ కొత్త ఆవిష్కరణల కోసం ప్రయత్నిస్తుండేవారు. తనను తాను ఆవిష్కరించుకోవడంతపోటు.. యువతకు ఉపదేశాలు ఇచ్చేవారు. కలలు కను కానీ వాటిని సాకారం చేసుకో అనే కలాం నినాదం యువతను కదిలించింది.

అబ్దుల్ కలాం విజన్ 2020: విద్యా రంగంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకున్నామా?అబ్దుల్ కలాం విజన్ 2020: విద్యా రంగంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకున్నామా?

ఉత్సాహంగా..

ఉత్సాహంగా..

69 ఏళ్ల వయస్సులోనే అబ్దుల్ కలాం యువకుడిలానే పనిచేశారు. దేశాభివృద్ధి కోసం ఏం చేయాలనే ఆలోచించారు. 2000 ఏడాదిలో కలాం కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్‌గా చేరారు. ఆ తర్వాత రెండేళ్లకే రాష్ట్రపతి పదవీ చేపట్టిన సంగతి తెలిసిందే. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో కొత్త ఆవిష్కరణల కోసం కలాం ప్రయత్నించారు. యువత పెద్ద పెద్ద కలలు కనాలని పిలుపునిచ్చారు.

ఆర్థిక ప్రగతి కోసం..

ఆర్థిక ప్రగతి కోసం..

శాస్త్ర సాంకేతిక రంగంలోనే కాదు ఆర్ధిక ప్రగతి కోసం కూడా కలాం కృషిచేశారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగి ఉంది. వివిధ మతలా వారు ఉన్న కలిసి మెలిసి సామరస్యంతో ఉంటున్నారు. దానిని మరింత ముందుకు తీసుకెళ్లారు. ఇస్రోలో పనిచేసిన సమయంలో శాస్త్రవేత్తగా అబ్దుల్ కలాం విశేష ఖ్యాతిని గడించారు. వయస్సుతో సంబంధం లేకుండా సమస్యలను దరిచేరనీయకుండా తన ప్రస్థానాన్ని కొనసాగించారు. కలాం సూచించిన సిద్ధాంతాలు, సూక్తులను నేటి యువత పాటించి, దేశ పునర్ నిర్మాణానికి పునరంకితమవుతున్నారు.

విజనరీ..

విజనరీ..

అబ్దుల్ కలాం, దూరదృష్టి తెలుసు.. కలాంతో కలిసి పనిచేసిన శాస్త్రవేత్త వీ పొన్‌రాజ్ అనుభవాలను పంచుకున్నారు. అబ్దుల్ కలాం టాస్క్ మాస్టర్ అని, ఆయనతో 16 నుంచి 18 గంటలు పనిచేసేవారమని గుర్తుచేసుకున్నారు. ఆ రోజు కూడా ప్రతీ ఒక్క శాస్త్రవేత్త అబ్దుల్ కలాం పేరు స్మరిస్తున్నారని చెప్పారు. తాను 28 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు 1995లో అబ్దుల్ కలాం బృందంలో చేరినట్టు వెల్లడించారు. దాదాపు 20 ఏళ్లు కలిసి పనిచేసే అవకాశం దక్కిందని గర్వంగా తెలిపారు.

ఇవీ ప్రాజెక్టులు..

ఇవీ ప్రాజెక్టులు..

విజన్ 2020, ఎనర్జీ ఇండిపెండెన్స్ విజన్ 2030, ప్రొవిజన్ ఆఫ్ అర్బన్ అమెంటీస్ టు రూరల్ ఏరియస్ మిషన్ (పుర) ప్రాజెక్టుల్లో కలిసి అబ్దుుల్ కలాంతో కలిసి పనిచేశానని పొన్‌రాజ్ పేర్కొన్నారు. అబ్దుల్ కలాం నాలుగో వర్ధంతి సందర్భంగా ఆ నాటి జ్ఙాపకాలను గుర్తుచేసుకున్నారు. కలాం తమ గురువు అని పేర్కొన్నారు. 1995లో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీలో కలిసి పనిచేస్తూ.. రాష్ట్రపతి అయ్యాక కూడా తమ అనుబంధం కొనసాగిందని గుర్తుచేశారు. తర్వాత డీఆర్డీవో చీఫ్‌గా కలాం పనిచేశారని పేర్కొన్నారు. తాను జూనియర్ శాస్త్రవేత్తగా అసిస్టెంట్‌గా పనిచేశానని చెప్పారు.

రాష్ట్రపతి భవన్‌లోనూ..

రాష్ట్రపతి భవన్‌లోనూ..


విజన్ 2020 ప్రాజెక్టు తర్వాత.. కలాం రాష్ట్రపతి అయ్యారని చెప్పారు. తర్వాత కూడా ప్రెసిడెంట్ సెక్రటేరియట్‌లో ఇంటర్ ఫేష్ డైరెక్టర్ టెక్నాలజీలో చేరాలని కోరడంతో వెళ్లానని చెప్పారు. అక్కడే ‘పుర' మిషన్, ఎనర్జీ ఇండిపెండెన్స్ ప్రాజెక్ట్, పాన్ ఆఫ్రికన్ ఇ-నెట్‌వర్క్ ప్రాజెక్ట్‌లో కూడా కలిసి పనిచేసినట్టు గుర్తుచేశారు. ఇదీ 125 మిలియన్ డాలర్ల ప్రాజెక్టు అని పేర్కొన్నారు. ప్రాజెక్టు కింద 30 వేల ఆఫ్రికా విద్యార్థులు డిగ్రీ వరకు చదువుకున్నారని పేర్కొన్నారు. 50 వేల మంది ఆఫ్రికన్లు టెలీమెడిసన్ సర్వీసెస్‌లో కూడా చేరారని చెప్పారు. కలాం వద్ద చివరి పీహెచ్‌డీ చేసింది తానేనని.. సిద్ధాంతం చివరి దశకు చేరింది.. త్వరలోనే సబ్‌మిట్ చేస్తానని చెప్పారు.

చాలా స్ట్రిక్ట్..

చాలా స్ట్రిక్ట్..

పని విషయంలో అబ్దుల్ కలాం చాలా స్ట్రిక్ట్ అని పొన్‌రాజ్ చెప్పారు. తమ సమస్యల గురించి ప్రశ్నిస్తే అలవోకగా సమాధానం చెప్పేవారని తెలిపారు. సిద్ధాంతంలో భాగంగా విద్యార్థులకు కష్టంగా భావించిన చిన్న విషయాన్ని అబ్దుల్ కలాం చాలా తేలికగా చెప్పేవారని తెలిపారు. దీంతో తాము మరింత పరిణితి చెందేందుకు అవకాశం లభించిందని చెప్పారు. తొలుత కలాం వద్ద పనిచేసే సమయంలో ఇబ్బంది పడ్డానని.. తర్వాత సెటిల్ అయ్యానని చెప్పారు.

English summary
abdul kalam is a hard taskmaster scintist v ponraj said. On an average day, we work at least 16 to 18 hours remember those a days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X