వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అబ్దుల్ కలాం విజన్ 2020: విద్యా రంగంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకున్నామా?

|
Google Oneindia TeluguNews

2000 సంవత్సరం ఎంతో ఆకర్షణీయ సంవత్సరం. కొత్త సహస్రాబ్ది ప్రారంభంలో చాలా ఉత్సాహం ఉండింది, మనలో చాలా మంది టెక్నాలజీ నేతృత్వంలోని భవిష్యత్తును, ధైర్యమైన కొత్త ప్రపంచాన్ని ఊహించారు. మిలీనియం బగ్ కేవలం Y2K సమస్య కంటే ఎక్కువ..ఇది 20వ శతాబ్దం వాణిజ్యం, ఆర్ధిక వృద్ధిలో అపారమైన పురోగతితో పరిష్కరించలేకపోతున్న నిరంతర సమస్యలను పరిష్కరించే ఉత్సాహాన్ని సూచించింది. ఆ సమయంలోనే రాష్ట్రపతి కానున్న ఏపీజే అబ్దుల్ కలాం ప్రోత్సాహంతో ప్రణాళిక సంఘం భారత్ విజన్ 2020 ఓమ్ని డాక్యుమెంట్‌తో ముందుకు వచ్చింది.

20ఏళ్ల తర్వాత దేశం ఎలా ఉండాలనేది ఈ విజన్ 2020 నిర్దేశించింది. అయితే, ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. ఇప్పుడు ఆ లక్ష్యాలను చేరుకున్నామా? లేదా? అనేది సరిచూసుకోవాల్సిన సమయం కూడా వచ్చింది. ఎలాంటి సవాళ్లు లేకుండా వృద్ధిరేటును, అభివృద్ధిని సాధించామా? భారతదేశం ఏ రంగంలో లక్ష్యాలను చేరుకుంది. నిర్దేశించుకున్న లక్ష్యాలను ఎందుకు చేరుకోలేకపోయామనేది పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు విద్యారంగంలో పెట్టుకున్న లక్ష్యాలను చేరుకోవడంలో మనం విఫలమయ్యమా? ఎంత వరకు సఫలమయ్యాం అనేది పరిశీలిద్దాం..

అబ్దుల్ కలాం విజన్ 2020: ఆయుష్మాన్ భారత్‌తో ఆరోగ్య భారత్‌గా మారిందా..?అబ్దుల్ కలాం విజన్ 2020: ఆయుష్మాన్ భారత్‌తో ఆరోగ్య భారత్‌గా మారిందా..?

విద్యా రంగంపై ఖర్చు పెరిగింది కానీ..

విద్యా రంగంపై ఖర్చు పెరిగింది కానీ..

విద్యా రంగంలో మిశ్రమ ఫలితాలను సాధించామనే చెప్పాలి. విద్యనభ్యసించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అదే సమయంలో విద్యను ప్రోత్సహించేందుకు మధ్యాహ్న భోజన పథకం, సర్వశిక్షా అభియాన్, గ్రామీణ ప్రాంతాల్లో భవనాల నిర్మాణాలపై ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేసింది. స్కూల్ నుంచి ఉన్నత చదువులపై ఆల్ ఇండియా సర్వే 2018-19 విస్తృతమైన సమాచారాన్ని సేకరించింది.
ప్రాథమిక విద్య అనంతరం కాలేజీల్లో చేరే విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు తేలింది.

ఇంకా ఉన్నత విద్యకు దూరంగానే ఎస్టీలు..

ఇంకా ఉన్నత విద్యకు దూరంగానే ఎస్టీలు..

సమాజంలో బలహీన వర్గాలకు విషయంలోకి వస్తే ఒక ఖచ్చితమైన వైరుధ్యాన్ని గమనించవచ్చు. ఉదాహరణకు షెడ్యల్డ్ ట్రైబ్స్(ఎస్టీలు) జనాభాలో 8శాతం ఉండగా, వారిలో 5.5శాతం విద్యార్థులు మాత్రమే కాలేజీ విద్య వరకు వెళ్తున్నారు. జనాభాలో ఎస్టీలు 8.5శాతం ఉండగా.. కేవలం 2.3శాతం మాత్రమే ఎస్టీకి చెందిన టీచర్లు ఉన్నారు. చట్టబద్ధంగా వీరికి రిజర్వేషన్లు ఉన్నప్పటికీ వారి ప్రాతినిథ్యం పెరగలేకపోతోంది.

2020 లక్ష్యం చేరుకోలేదు..

2020 లక్ష్యం చేరుకోలేదు..


ఉన్నత విద్యపై ఇచ్చిన నివేదిక ప్రకారం.. 1998లో 229 యూనివర్సిటీలు ఉండగా.. ఆ సంఖ్య 2011-12 నాటికి 642కు పెరిగింది. ప్రస్తుతం ఉన్న యూనివర్సిటీల సంఖ్య 993.
దేశంలోని యువతకు విద్యనందించేందుకు 2020 వరకు 1500 యూనివర్సిటీలు నెలకొల్పాల్సి ఉందని నేషనల్ నాలెడ్జ్ కమిషన్ అంచనా వేసింది. అయితే, ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే మరో 500 యూనివర్సిటీలు నెలకొల్పాల్సి ఉంది.

ప్రభుత్వం జోక్యం అంతంత మాత్రమే.. విద్యలో నాణ్యత?

ప్రభుత్వం జోక్యం అంతంత మాత్రమే.. విద్యలో నాణ్యత?

ఇక ఉన్నత విద్యలో నాణ్యత లోపం ఎక్కువగా ఉంది. ఉన్నత విద్యనందిస్తున్న సంస్థలపై ప్రభుత్వం జోక్యం చేసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని తెలుస్తోంది. ఆ విద్యా సంస్థలకు ప్రభుత్వం సరైన మార్గనిర్దేశనం చేయడం లేదని చెప్పాలి. 18-24ఏళ్ల వయస్సున్న యువకుల్లో కేవలం 25శాతం మంది మాత్రమే కాలేజీ, యూనివర్సిటీ విద్యనభ్యసిస్తున్నారు. ప్రతీ సంవత్సరం 10 మిలియన్ల మంది విద్యార్థులు డిగ్రీలు పొందుతున్నారు. ఇది అండర్ గ్రాడ్యూయేట్ చదివిన విద్యార్థుల్లో 65శాతమే కావడం గమనార్హం. డిగ్రీలో పొందిన విద్యార్థులకు సరైన నైపుణ్యత, జ్ఞానం, ఉపాధికి అవసరమయ్యే నైపుణ్యాలు అందకపోతుండటం ఆందోళనకరం.

వీరికే కొంత పరిశోధనా నైపుణ్యత

వీరికే కొంత పరిశోధనా నైపుణ్యత

ప్రతీ సంవత్సరం ఎంఫిల్/పీహెచ్‌డీ డిగ్రీలు కలిగిన విద్యార్థులు 2లక్షల కంటే తక్కువగానే వర్సిటీల నుంచి బయటకు వస్తున్నారు. వారికి మాత్రమే కొంత పరిశోధన నైపుణాలు ఉంటున్నాయి. మన యూనివర్సిటీల్లో టీచింగ్ లెవల్స్ అంతగా ఉండటం లేదు, రీసెర్చ్ నాణ్యత కూడా అంతంత మాత్రంగానే ఉంటోంది.

English summary
The year 2000 was fascinating. There was much excitement around the beginning of a new millennium, with many of us envisioning a technology-led future and a brave new world.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X