• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అబ్దుల్ కలాం పెద్ద జీహాది -పాక్‌కు అణు ఫార్ములా -ఉన్నత పదవుల్లోని ముస్లింలంతా అంతే: ఘజియాబాద్ పూజారి

|

మతోన్మాదం వెర్రితలలు వేస్తోన్న ప్రస్తుత తరుణంలో మరో నెరేషన్ తెరపైకి వచ్చింది. భరతమాత ముద్దుబిడ్డగా, కోట్లాది మందికి స్ఫూర్తిదాయకుడిగా, 'మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా'గా మన్ననలు పొందిన భారతరత్న బిరుదాంకితుడు మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాంకు మతవిద్వేషాన్ని అంటగడుతూ ప్రఖ్యాత ఆలయ పూజారి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

ఐపీఎస్ ప్రవీణ్‌‌ను 'ఎవడు' అంటే తప్పేంటి? -ఎంపీల ముందు అధికారుల స్థాయి చాలా చిన్నది: రఘురామఐపీఎస్ ప్రవీణ్‌‌ను 'ఎవడు' అంటే తప్పేంటి? -ఎంపీల ముందు అధికారుల స్థాయి చాలా చిన్నది: రఘురామ

నీళ్లు తాగిన బాలుణ్ని కొట్టిన గుడిలో..

నీళ్లు తాగిన బాలుణ్ని కొట్టిన గుడిలో..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ లోని దాస్నాదేవి ఆలయం ఇటీవల వార్తల్లో ప్రముఖంగా నిలిచింది. ఆ ఆలయంలో మంచి నీళ్లు తాగినందుకు ఓ ముస్లిం బాలుడి(12)పై విచక్షణా రహితంగా దాడి జరగడం, సదరు వీడియో వైరలైన తర్వాత నిందితులైన ఇద్దరు యువకుల్ని పోలీసులు అరెస్టు చేయడం తెలిసిందే. వివాదం సర్దుమణిగిందనుకునేలోపే, అదే దాస్నాదేవి ఆలయ ప్రధాన పూజారి ‘యతి నర్సింగానంద సరస్వతి' వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంపై నిరాధార ఆరోపణలతోపాటు దేశంలో ముస్లింలందరినీ పూజారి తూలనాడారు.

 అబ్దుల్ కలాం జీహాదీనే

అబ్దుల్ కలాం జీహాదీనే

ఇస్లాం వ్యాప్తి కోసం ఎంతకైనా తెగించే టెర్రరిస్టులను ఉద్దేశించి విరివిగా వాడే ‘జీహాది' పదాన్ని అబ్దుల్ కలాంకు అన్వయిస్తూ ఘజియాబాద్ ఆలయ పూజారి నర్సింగానంద అనుచిత వ్యాఖ్యలు చేశారు. ‘‘అబ్దుల్ కలాం ముమ్మాటికీ జీహాదీనే. డీఆర్డీవో చీఫ్ గా ఉన్నప్పుడే అణుబాంబు ఫార్ములాను పాకిస్తాన్ కు అందజేశాడు. రాష్ట్రపతి పదవి చేపట్టిన తర్వాత తన ఆఫీసులో కేవలం ముస్లింల కోసమే ఓ పేషీని తెరిచి, వారి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించేవాడు'' అని వ్యాఖ్యానించాడు. అంతేకాదు,

ప్రధాని మోదీ సంచలనం: పాకిస్తాన్‌తో స్నేహం కోరుతూ ఇమ్రాన్ ఖాన్‌కు లేఖ -దేశ విభజనకు బీజం పడినరోజేప్రధాని మోదీ సంచలనం: పాకిస్తాన్‌తో స్నేహం కోరుతూ ఇమ్రాన్ ఖాన్‌కు లేఖ -దేశ విభజనకు బీజం పడినరోజే

  Top News Of The Day | Oneindia telugu
  ముస్లింలంతా దేశ వ్యతిరేకులే

  ముస్లింలంతా దేశ వ్యతిరేకులే


  అబ్దుల్ కలాం అణుబాంబు ఫార్ములాను పాకిస్తాన్ కు ఇవ్వడం, రాష్ట్రపతి భవన్ లో ముస్లింలకు పేషీ నిర్వహించారనడానికి ఎలాంటి ఆధారాలు లేకున్నా ఘజియాబాద్ ఆలయ పూజారి నర్సింగానంద మాజీ రాష్ట్రపతిపై విద్వేషం వెళ్లగక్కారు. అందటితో ఆగకుండా, ‘‘కలాం ఒక్కడే కాదు, ఇండియాలో అత్యున్నత పదవులు పొందిన ముస్లింలు అందరూ దేశ వ్యతిరేకులే'' అని సెలవిచ్చారా పూజారి. 2002లో నాటి బీజేపీ పెద్దలు వాజపేయి, అద్వానీలు పట్టుపట్టిమరీ అబ్దుల్ కలాంను బీజేపీ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేట్ చేయడం, కాంగ్రెస్ సైతం మద్దతు పలకడం తెలిసిందే. జీవితాంతం హిందూ మతవిశ్వాసాల పట్ల గౌరవమర్యాదలు ప్రదర్శించిన కలాంపై ఘజియాబాద్ పూజరి వ్యాఖ్యలు వివాదం రేపుతున్నాయి.

  English summary
  The priest of a Ghaziabad temple, where a Muslim boy was thrashed for drinking water on its premises, targeted former president APJ Abdul Kalam on Tuesday over his religion, calling him a “jihadi”. “Any Muslim in the top echelons of the country cannot be pro-India and Kalam was a jihadi,” Dasna Devi Temple’s Yati Narsinghanad Saraswati told reporters in Aligarh.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X