• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ముద్దుపెట్టుకున్నంత పని: ఎయిర్‌హోస్టెస్, అందంగాలేని యువతులే ఇలా: అభిజిత్ తీవ్రవ్యాఖ్య

|

ముంబై: దేశంలో 'మి టు' ఉద్యమం విస్తరిస్తోంది. చాలామంది యువతులు, మహిళలు తమకు జరిగిన లైంగిక వేధింపులు, లైంగిక దాడులపై బయటకు వస్తున్నారు. ప్రముఖ నటి తనుశ్రీ దత్తా ప్రారంభించిన ఈ ఉద్యమం కేవలం సినిమా రంగానికే కాకుండా మీడియా, రాజకీయ రంగాలకు కూడా అంటుకుంది.

ఇదిలా ఉండగా, మాజీ ఫ్లైట్ అటెండెంట్ ఒకరు ప్రముఖ బాలీవుడ్ సింగర్ అభిజిత్ భట్టాచార్య పైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేఓశారు. ఇరవై ఏళ్ల క్రితం, 1998లో కోల్‌కతాలోని ఓ పబ్‌లో అభిజిత్ తనను వేధించాడని ఆమె ఆరోపించారు. ఈ మేరకు ఆమె తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో సుదీర్ఘ లేఖ రాశారు.

మీడియాలోను 'మి టూ' ప్రకంపనలు: ఉద్యోగినిలకు వేధింపు, పెద్ద తలకాయల రాజీనామా

20 ఏళ్ల క్రితం కలిసి డ్యాన్స్ అసభ్య ప్రవర్తన

20 ఏళ్ల క్రితం కలిసి డ్యాన్స్ అసభ్య ప్రవర్తన

బోధిసత్వ యామ్‌యోహో పేరుతో ఉన్న అకౌంట్ ఇది. ఇరవై ఏళ్ల క్రితం తనను అభిజిత్ వేధించాడని ఆమె ఆరోపించారు. తాను కలిసి డ్యాన్స్ చేసేందుకు నిరాకరించడంతో అభిజిత్ తన చేయి పట్టుకొని, అతని దగ్గరగా లాక్కున్నాడని ఆరోపించింది. ఈ సంఘటన 1998లో వేసవి కాలంలో జరిగిందని చెప్పారు. తాను అతనితో కలిసి డ్యాన్స్ చేయకపోవడంపై అతను తన చెవిలో గట్టిగా అసభ్యంగా అరిచాడని చెప్పింది. అసలు ఏమనుకుంటున్నావు, నీకు బుద్ధి చెబుతానని హెచ్చరించాడని చెప్పింది.

 దగ్గరకు లాక్కొని ముద్దుపెట్టినంత పని చేశాడు

దగ్గరకు లాక్కొని ముద్దుపెట్టినంత పని చేశాడు

అతను తనను దగ్గరకు లాక్కోని దాదాపు ముద్దుపెట్టుకున్నంత పని చేశాడని ఆమె ఆరోపించింది. తాను అతనితో మాట్లాడటం అదే తొలిసారి అని చెప్పారు. నీతో డ్యాన్స్ చేస్తానని అతను చెబితే, తాను ఏం మాట్లాడకుండా వెనక్కి తిరిగి వెళ్లిపోతున్నానని, కానీ అతను మాత్రం తనను అద్దంలో చూస్తు డ్యాన్స్ చేశాడని చెప్పింది. ఆ తర్వాత తన చేయి పట్టుకొని లాగి, ముద్దుపెట్టుకున్నంత పని చేశాడని, ఆ తర్వాత అతనిని తోసేసి తాను వెళ్లిపోయానని చెప్పింది.

 అసలు నాకు పబ్‌లకు వెళ్లే అలవాటే లేదు

అసలు నాకు పబ్‌లకు వెళ్లే అలవాటే లేదు

దీనిపై అభిజిత్ స్పందించారు. తనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను కొట్టిపారేశారు. అసలు నేను ఎప్పుడు కూడా డిస్కోథెక్‌కు వెళ్లలేదని, పబ్‌కు వెళ్లలేదని చెప్పారు. తాను జీవితంలో అలాంటి చోట్లకు వెళ్లలేదని, అలాంటప్పుడు తనపై తీవ్రమైన ఆరోపణలు చేసిందన్నారు. అసలు ఎవరు కూడా తనను పేజ్ 3 లేదా సినిమాలకు సంబంధించిన పార్టీలలో కూడా చూసి ఉండరని చెప్పారు.

లావుగా ఉన్న, అందంగా లేని మహిళలే ఆరోపణలు చేస్తున్నారు

లావుగా ఉన్న, అందంగా లేని మహిళలే ఆరోపణలు చేస్తున్నారు

తాను చేయని దానిపై ఆరోపణలు చేస్తున్నారని, ఇందుకు ఎవరిపై ఫిర్యాదు చేయాలో అర్థం కావటం లేదని అభిజిత్ అన్నారు. నాపై ఆరోపణలు చేసిన వ్యక్తి గురించి ఎక్కువగా మాట్లాడి, ఎందుకు ప్రచారం కల్పించాలని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డర్టీ, అగ్లీ పీపుల్ బయటకు వస్తున్నారన్నారు. అందరి దృష్టిని తమపై వేసుకునేందుకు వారు బయటకు వస్తున్నారని చెప్పారు. చాలా లావుగా ఉన్న, అందవిహీనమైన యువతులు బయటకు వచ్చి ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Now another Bollywood personality, singer Abhijeet Bhattacharya, has been accused of sexual misconduct. Abhijeet, who has collaborated with actor Shah Rukh Khan for songs in his films, like, Yes Boss, Josh, Baadshah, Chalte Chalte, among many others, was accused by a former flight attendant of sexually harassing her at a pub in Kolkata in 1998.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more