వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శత్రువు చేతికి చిక్కినా.. వెల్‌కం అభినందన్: పవన్ కళ్యాణ్, గంభీర్, సైనా నెహ్వాల్ సహా ప్రముఖులు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ స్వదేశానికి చేరుకున్నారు. వాఘా సరిహద్దు వద్ద అభినందన్‌ను పాక్‌.. భారత్‌కు అప్పగించింది. లాహోర్‌ నుంచి రోడ్డు మార్గంలో ఆయనను పాక్‌ అధికారులు తీసుకువచ్చారు. వాఘా సరిహద్దు వద్ద ఇరు దేశాలకు చెందిన అధికారులు పరస్పరం పత్రాలు మార్చుకున్న అనంతరం కమాండర్‌ను భారత అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా సరిహద్దు వద్ద అభినందన్‌కు భారత వాయుసేన ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. ఆయన తిరిగి రావడంపై ప్రముఖులు స్పందించారు.

Abhinandan Varthaman is back: Pawan Kalyan and Gambhir responds

నీ మొక్కవోని ధైర్యం అబ్బురపరిచింది

అభినందన్ తిరిగి రావడం జనసేనాని ఆనందం వ్యక్తం చేశారు. ఆయన పుణ్యభూమికి తిరిగి రావడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పారు. అతను సార్ధక నామధేయుడు అని, శత్రువు చేతికి చిక్కినా అతని మొక్కవోని ధైర్యం అందరినీ అబ్బురపరిచిందని చెప్పారు. నీ సాహసం, తెగువ, ఈనాటి యువతకు ఆదర్శమని, జాతి యావత్తు నీ రాక కోసం ఎదురు చూసిన ఈ తరుణంలో తన తరఫున, జనసైనికుల తరఫున శుభాభినందనలు అన్నారు.

మీరు మాకున్నందుకు మేమెంతో గర్వపడుతున్నామని, మీ ధైర్య సాహసాల ముందు మోకరిల్లుతున్నామని, స్వాగతం అభినందన్.. మిమ్మల్ని ప్రేమిస్తున్నామని, మిమ్మల్ని చూసి గర్వం పడుతున్నామని వీరేంద్ర సెహ్వాగ్ పేర్కొన్నారు.

మన హీరోకు స్వాగతం అని సైనా నెహ్వాల్, వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ సమస్త భారత దేశం మీ ధైర్య సాహసాలకు, దేశభక్తికి వందనం చేస్తోందని సురేష్ రైనా, సంక్లిష్ట పరిస్థితుల్లో మీరు చూపిన ధైర్య సాహసాల పట్ల గర్వపడుతున్నామని, మీరు తిరిగొచ్చినందుకు సంతోషిస్తున్నామని మహ్మద్ కైఫ్, తాను ఈ భూమ్మీద జీవిస్తున్న కాలంలో మీ కన్నా పెద్ద హీరోను చూడలేదని రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నారు.

Abhinandan Varthaman is back: Pawan Kalyan and Gambhir responds

ఆయన తిరిగొచ్చే ముందు నేనెంతో ఆందోళనపడ్డానని, భరతమాత తన బిడ్డను మళ్లీ పొందినందుకు సంతోషిస్తున్నాని గౌతమ్ గంభీర్ అన్నారు. అభినందన్‌ తిరిగి వచ్చినందుకు సంతోషంగా ఉందని, ఆయన కుటుంబం ఏమనుకుంటుందో నేను ఊహించగలనని, ప్రతి నిమిషం జీవితకాలంగా అనిపిస్తుందని, గుండె కొన్నిసార్లు కొట్టుకోవడం మాని వేస్తుందని ప్రీతిజింతా అన్నారు.

English summary
Indian Air Force pilot AbhinandanVarthaman returns as hundreds of Indians cheer at the Wagah border crossing. He was captured by Pakistani forces when his plane went down across the Line of Control after an aerial dogfight on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X