వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎయిర్‌పోర్స్‌లో అభినందన్ రీ ఎంట్రీ.. ఘనస్వాగతం పలికిన సహోద్యోగులు

|
Google Oneindia TeluguNews

జమ్మూ : వింగ్ కమాండర్ అభినందన్ విధుల్లో చేరారు. గాయాల నుంచి పూర్తిగా కోలుకుని ఎయిర్‌ఫోర్స్ నిర్వహించిన పరీక్షల్లో ఫిట్‌గా తేలడంతో అభినందన్ తిరిగి డ్యూటీలో జాయిన్ అయ్యారు. ఈ మేరకు జమ్మూ ఎయిర్ బేస్‌‍లో ఆయన రిపోర్ట్ చేశారు.

జమ్మూ ఎయిర్ బేస్‌కు చేరుకున్న వింగ్ కమాండర్ అభినందన్‌కు సహోద్యోగులు ఘన స్వాగతం పలికారు. ఆయనను చూడగానే అందరూ చుట్టుముట్టి ప్రశంసల జల్లు కురిపించారు. అభినందన్‌తో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీలు పడ్డారు. దాదాపు రెండు నెలల అనంతరం సహచరులను చూసిన అభినందన్ భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం సహోద్యోగులతో కలిసి ఎయిర్‌బేస్‌లో భారత్ మాతాకీ జై అంటూ నినాదాలతో హోరెత్తించారు ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Abhinandan Varthaman meets colleagues in J&K

పాకిస్థాన్‌కు చెందిన ఎఫ్ 16 విమానాన్ని కూల్చి పాక్ భూభాగంలో శత్రు సైన్యానికి చిక్కినా భారత రహస్యాలను బయటపెట్టని వింగ్ కమాండర్ అభినందన్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. దాడిలో తీవ్ర గాయాలపాలైన ఆయనకు ప్రత్యేకంగా ట్రీట్‌మెంట్ ఇచ్చారు. అనంతరం ఎయిర్‌ఫోర్స్ నిర్వహించిన ఫిట్‌నెస్ టెస్ట్‌లో సక్సెస్ కావడంతో అధికారులు అభినందన్‌కు మళ్లీ పోస్టింగ్ ఇచ్చారు.

English summary
Indian Air Force pilot Wing Commander Abhinandan Varthaman on Saturday met and interacted with his colleagues in Jammu and Kashmir. A video of his short interaction with his colleagues in J&K has since gone viral on social media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X