వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ వయస్సు వారిలోనే ఎక్కువ మరణాలు, దేశంలో భారీగా తగ్గిన యాక్టివ్ కేసులు: కేంద్రం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ కోలుకుంటున్నవారి సంఖ్య కూడా అంతకుమించి ఉంటోందని ఆరోగ్యశాఖ వెల్లడించింది. భారత్‌లో కరోనా నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య 62 లక్షలు దాటిందని, ప్రపంచంలోనే ఇది అత్యధికమని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ మంగళవారం వెల్లడించారు.

ఏపీలో కరోనా తగ్గుముఖం: పెరుగుతున్న రికవరీ, తగ్గుతున్న యాక్టివ్ కేసులు, జిల్లాల వారీగా..ఏపీలో కరోనా తగ్గుముఖం: పెరుగుతున్న రికవరీ, తగ్గుతున్న యాక్టివ్ కేసులు, జిల్లాల వారీగా..

క్రమంగా తగ్గుతున్న యాక్టివ్ కేసులు

క్రమంగా తగ్గుతున్న యాక్టివ్ కేసులు

వరుసగా ఐదో రోజు కూడా యాక్టివ్ కేసుల సంఖ్య 9 లక్షల కంటే తక్కువగానే ఉందని, యాక్టివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని తెలిపారు. ప్రస్తుతం దేశంలో 8,38,729 యాక్టివ్ కేసులున్నాయని రాజేష్ భూషణ్ తెలిపారు. ఇక క్యుమిలేటివ్ పాజిటివిటీ రేటు 8.07 శాతం ఉండగా, వీక్లీ పాజిటివిటీ రేటు 6.24 శాతం, రోజువారీ పాజిటివిటీ రేటు 5.16శాతంగా ఉందని వివరించారు.

60ఏళ్లకు పైబడినవారిలోనే ఎక్కువ మరణాలు

60ఏళ్లకు పైబడినవారిలోనే ఎక్కువ మరణాలు

ఇక దేశంలో మరణాల సంఖ్య కూడా తక్కువగా ఉందని తెలిపారు. కరోనా బారినపడి మరణిస్తున్నవారిలో అత్యధికంగా 60 ఏళ్లకు పైబడినవారే ఉన్నారని రాజేష్ భూషణ్ తెలిపారు. మొత్తం మరణాల్లో వీరిది 53 శాతంగా ఉన్నట్లు తెలిపారు.
60ఏళ్ల లోపు మరణాలు 47 శాతంగా ఉందని వెల్లడించారు.

వయస్సుల వారీగా మరణాలు

వయస్సుల వారీగా మరణాలు

వయస్సులవారీగా గమనించినట్లయితే.. 45-60ఏళ్ల మధ్య వయస్కుల్లో 35 శాతం, 26-46ఏళ్ల మధ్య వయస్కుల్లో 10 శాతం, 18-25 ఏళ్ల మధ్య వయస్కుల్లో 1 శాతం, 17 ఏళ్లలోపు వయస్సు ఉన్నవారిలో 1 శాతంగా మరణాలు నమోదైనట్లు తెలిపారు. కరోనాతో మృతి చెందినవారిలో పురుషులు 70 శాతం కాగా, మహిళలు 30 శాతంగా ఉన్నట్లు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,09,856 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

కొత్త కేసుల తగ్గుదల.. ఆ మూడు రాష్ట్రాల్లోనే అత్యధికం

కొత్త కేసుల తగ్గుదల.. ఆ మూడు రాష్ట్రాల్లోనే అత్యధికం

గత ఐదు వారాలుగా రోజువారీగా నమోదవుతున్న కొత్త కరోనా కేసుల్లో తగ్గుదల కనబడుతోందని రాజేష్ భూషణ్ తెలిపారు. సెప్టెంబర్ రెండో వారంలో 92,380 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అక్టోబర్ రెండో వారంలో 70,114 కొత్త కేసులు వచ్చాయని వెల్లడించారు. రోజువారీ పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గుదల కనబడుతోందని తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో 86.78 శాతం మంది కోలుకున్నారని, ప్రస్తుతం ఉన్న యాక్టివ్ కేసుల్లో 79 శాతం కేవలం 10 రాష్ట్రాల్లోనే ఉన్నాయని వెల్లడించారు. దేశ వ్యాప్తంగా ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో పోలిస్తే మహారాష్ట్ర, కర్ణాటక, కేరళలోనే యాక్టివ్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని తెలిపారు. కాగా, దేశంలో ఇప్పటి వరకు 71 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదు కాగా, 62లక్షల మందికిపైగా కోలుకున్నారు. 8,38,341 యాక్టివ్ కేసులున్నాయి. లక్ష మందికిపైగా మరణించారు.

English summary
About 47 per cent of Covid-19 deaths have been recorded among those aged below 60 years, the Health Ministry said on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X