వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ ఓట్లకు ఆప్ గండి : ప్రధాని సమర్ధతకు పరీక్ష - గుజరాత్ సర్వే సంచలనం..!!

|
Google Oneindia TeluguNews

ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్దమవుతోంది. ప్రధాని మోదీ జన్మించిన గడ్డ - రాజకీయంగా ఎదుగదలకు కారణమైన గుజరాత్ లో బీజేపీ పరిస్థితి ఏంటి. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే అది కొత్త రికార్డు అవుతుంది. ఇప్పుడు గుజరాత్ లో ఆప్ కూడా ప్రధాన పోటీ దారుగా మారింది. పంజాబ్ లో అధికారంలోకి వచ్చిన తరువాత మరింత ఆత్మ విశ్వాసంతో కేజ్రీవాల్ అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే గుజరాత్ లో జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు.

గుజరాత్ లో గెలిచేదెవరు

గుజరాత్ లో గెలిచేదెవరు

ఇదే సమయంలో ప్రధాని మోదీ ఎలాగైనా గుజరాత్ తమ చేతిలో నుంచి జారకుండా ముందస్తుగానే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. గుజరాత్ తో పాటుగా హిమాచల్ ప్రదేశ్ లోనూ ఎన్నికలు జరగనునున్నాయి. ఇప్పుడు ఈ ఎన్నికలకు సంబంధించి ఏబీపీ న్యూస్ - సీ ఓటర్ ఒపీనియన్ పోల్ ఫలితాలను వెల్లడించింది. 182 అసెంబ్లీ స్థానాలు ఉన్న గుజరాత్ లో ఈ సారి ఆప్ కీలకంగా మారుతోంది. ఆప్ సీట్ల కంటే చీల్చే ఓట్ల పైనే పలు రకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ సర్వేలోనూ ఆసక్తి కర అంశాలను వెల్లడించారు. అయితే, ఆప్ గెలుచుకొనే సీట్ల సంఖ్య పైన మాత్రం కీలక అంశాలను బయట పెట్టారు. పంజాబ్ లో సులువుగా గెలిచిన ఆప్..ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో సీట్లు గెలవటం అంత సులభం కాదని స్పష్టం చేసింది.

ఆప్ పైన ఆసక్తి.. సర్వేలో తేలిందేంటి

ఆప్ పైన ఆసక్తి.. సర్వేలో తేలిందేంటి


ఆప్ సింగిల్ డిజిట్ లోనే సీట్లను సాధిస్తుందని..అవి కూడా అయిదు లోపే ఉంటాయని సర్వే సంస్థ అంచనా వేసింది. కానీ, బీజేపీ - కాంగ్రెస్ ఓట్ల శాతానికి మాత్రం గండి కొడుతుందని తేల్చి చెప్పింది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ 46.8 శాతం ఓట్లు, కాంగ్రెస్ 32.3 శాతం ఓట్లు సాధించే అవకాశాలు ఉన్నాయని తేల్చింది. కాగా, బీజేపీకి 135 నుంచి 143 సీట్లు వస్తాయని ఏబీపీ న్యూస్ - సీ ఓటర్ సర్వే వెల్లడించింది. కాంగ్రెస్ కు 36 నుంచి 44 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. ఇతరులు 36.5 శాతం ఓట్లతో 0-3 సీట్లు దక్కించుకుంటారని పేర్కొంది. ప్రస్తుత సీఎం భూపేంద్ర పటేల్ మరోసారి ఆ పదవిలో కొనసాగాలని ఎక్కువ మంది కోరుకుంటున్నట్లుగా సర్వేలో తేలింది. 2017 లో బీజేపీ 99 స్థానాలతో అధికారం దక్కించుకుంది. ఈ సారి ఆ స్థానాలు పెరిగి..తిరిగి అధికారంలోకి వస్తుందని సర్వే స్పష్టం చేస్తోంది.

మోదీ హవా కొనసాగుతుందంటూ

మోదీ హవా కొనసాగుతుందంటూ


గుజరాత్ సీఎం గా దేశ ప్రజలను ఆకర్షించిన ప్రధాని ఇప్పుడు ఎనిమిదేళ్లకు పైగా ప్రధాని పదవిలో కొనసాగుతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి విజయం సాధించేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు అమలు చేస్తున్నారు. పార్టీ బలహీనంగా ఉన్న 200 స్థానాలను గుర్తించి..ప్రత్యేక చర్యలు మొదలు పెట్టారు. ఇక, ఇప్పుడు సొంత రాష్ట్రంలో భారీ విజయం ద్వారా మరోసారి తన సత్తా చాటాలని ప్రధాని లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ నెలలోనే గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు గుజరాత్ ఎన్నికల పైన వెల్లడైన ఈ సర్వే సంచలనంగా మారింది.

English summary
Aam Aadmi Party’s entry into the poll fray is likely to benefit BJP as the incumbent government is projected to win landslide victory in Gujarat as per ABP C Voter Opinion poll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X