వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళనాడు: శశికళ దెబ్బకు జయ పార్టీ బేజారు - అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ప్రభంజనం -సీఎంగా స్టాలిన్

|
Google Oneindia TeluguNews

దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే తమిళనాడులో రాజకీయాలు పూర్తి భిన్నంగా ఉంటాయి. జాతీయ అంశాల ప్రభావం పెద్దగా లేకుండా, పూర్తిగా ప్రాంతీయ.. అది కూడా ద్రవిడ సంస్కృతికి ప్రాధాన్యమిచ్చే అంశాల చుట్టూ అక్కడి రాజకీయాలు తిరుగుతుంటాయి. అలాంటిది.. ప్రస్తుతం అధికారంలో ఉన్న అన్నాడీఎంకే.. కేంద్రంలోని బీజేపీకి ఆల్మోస్ట్ సాగిలపడిపోవడాన్ని తమిళులు జీర్ణించుకోలేకపోతున్నారని, ఇంకొద్ది నెలల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగలబోతోందని సర్వేల్లో వెల్లడైంది..

కేరళలో సంచలనం: అసెంబ్లీ పోల్స్‌లో మళ్లీ లెఫ్ట్ గెలుపు -44ఏళ్ల రికార్డు -పినరయికి ఫిదా -బీజేపీ ఢమాల్కేరళలో సంచలనం: అసెంబ్లీ పోల్స్‌లో మళ్లీ లెఫ్ట్ గెలుపు -44ఏళ్ల రికార్డు -పినరయికి ఫిదా -బీజేపీ ఢమాల్

ఏబీపీ-సీఓటర్ ఒపీనియన్ పోల్

ఏబీపీ-సీఓటర్ ఒపీనియన్ పోల్

కరోనా విలయం నుంచి కుదుటపడుతోన్న దేశంలో ఈ ఏడాది మినీ ఎన్నికల సంగ్రామం జరుగనుంది. ఒకటీ రెండూ కాదు, ఏకంగా ఐదు రాష్ట్రాలు.. అందులోనూ నాలుగు పెద్ద రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఏడాది మార్చి-మేలో కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉందనే దానిపై ప్రముఖ సర్వే సంస్థ సీ-ఓటర్.. జాతీయ మీడియా చానెల్ ఏబీపీ టీవీతో కలిసి ABP-CVoter 2021 Opinion Poll పేరుతో సర్వే నిర్వహించింది. సోమవారం విడుదలైన ఒపీనియన్ పోల్ ఫలితాల ప్రకారం..

అన్నాడీఎంకే ఢమాల్.. డీఎంకే ధమాకా

అన్నాడీఎంకే ఢమాల్.. డీఎంకే ధమాకా

ఏబీపీ-సీఓటర్ ఒపీనియన్ పోల్ ఫలితాల ప్రకారం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి ద్రవిడ మున్నేట్ర కజగం(డీఎంకే) పార్టీ సంచలన విజయాన్ని సాధించబోతున్నది. మొత్తం 234 స్థానాలున్న కేరళ అసెంబ్లీకి ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో డీఎంకే, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కూటమిగా ఉన్న యూపీఏకు గరిష్టంగా 162 సీట్లు దక్కుతాయని, అన్నా డీఎంకే, బీజేపీ కూటమిగా ఉన్న ఎన్డీఏకు ఎక్కువలో ఎక్కువ 98 సీట్లు దక్కొచ్చని వెల్లడైంది. 2016 ఎన్నికల్లో అన్నాడీఎంకే(అప్పుడు ఎన్డీఏలో లేదు) 136 సీట్లు, డీఎంకే(యూపీకే కూటమిగానే) 97 సీట్లలో గెలుపొందిన సంగతి తెలిసిందే. జయలలిత నేతృత్వంలో వరుసగా రెండు సార్లు గెలుపొందిన అన్నా డీఎంకే 2021 ఎన్నికల్లో చతికలపడబోవడానికి కారణాలు..

జయ పార్టీకి శశికళ దెబ్బ..

జయ పార్టీకి శశికళ దెబ్బ..

కేరళ తరహాలోనే తమిళనాడులోనూ ప్రతి ఎన్నికల్లో అధికారం మారుతూ వస్తుండగా, ఆ రికార్డును బ్రేక్ చేస్తూ 2016లో జయలలిత రెండోసారి కూడా సీఎం అయ్యారు. కానీ ఎన్నికల తర్వాత కొద్ది నెలలకే ఆమె తీవ్ర అనారోగ్యానికి గురై, సుదీర్ఘకాలంపాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అదే ఏడాది డిసెంబర్ లో కన్నుమూశారు. జయ మరణం తర్వాత శశికళ వర్గం పార్టీ పగ్గాలు చేపట్టాలనుకున్నా, పన్నీర్ సెల్వం, పళనిస్వామిలు ఏకమై శశికళకు షాకిచ్చి అధికారాన్ని పంచుకున్నారు. వారికి కేంద్రంలోని బీజేపీ సంపూర్ణ సహకారిగా నిలిచింది. అయితే.. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో శశికళ పార్టీ(దినకరన్ స్థాపించిన) అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం(ఏఎంఎంకే) దెబ్బకు అన్నాడీఎంకే భారీగా నష్టపోనున్నట్లు ఏబీపీ-సీఓటర్ ఒపీనియన్ పోల్ ఫలితాల్లో వెల్లడైంది. అన్నా డీఎంకే ఓట్ల నుంచి ఏకంగా 7.8 శాతం ఓట్లను శశికళ పార్టీ చీల్చడం ఖాయమని తెలుస్తోంది.

15 శాతం ఓట్లు.. 64 సీట్లు గాయబ్..

15 శాతం ఓట్లు.. 64 సీట్లు గాయబ్..

జయలలిత మరణం, శశికళ జైలుపాలైన తర్వాత అన్నా డీఎంకేకు కేంద్రంలోని బీజేపీ ఆల్మోస్ట్ గాడ్ ఫాదర్ లా వ్యవహరించింది. తమిళనాట ఉనికి చాటుకోవాలనుకుంటోన్న బీజేపీ జయమరణం యాక్టివిటీలను పెంచింది. అయితే హిందూత్వ వ్యతిరేక ద్రవిడ భావజాలం అధికంగా ఉండే తమిళనాడులో అన్నాడీఎంకే-బీజేపీ పొత్తు బెడిసికొట్టే అవకాశమున్నట్లు ఏబీపీ-సీఓటర్ సర్వేలో వెల్లడైంది. గత ఎన్నికల్లో బీజేపీతోడు లేకుండా 43.7శాతం ఓట్లు రాబట్టుకున్న అన్నా డీఎంకే.. ఈసారి బీజేపీ తోడుగా 15 శాతం తక్కువగా, అంటే, 28.7శాతం ఓట్లను మాత్రమే సాధించగలదని సర్వే తెలిపింది. గత ఎన్నికల్లో 39.4 శాతం ఓట్లు సాధించిన డీఎంకే ఈసారి 41.1 శాతం ఓట్లతో అధికారంలోకి వస్తుందని ఒపీనియన్ పోల్ లో వెల్లడైంది. అన్నాడీఏకే 136 స్థానాల నుంచి ఏకంగా 64 సీట్లు కోల్పోతుందని, గరిష్టంగా 98 సీట్లు సాధించొచ్చని ఏబీపీ-సీఓటర్ తెలిపింది. కాగా,

కమల్ తుస్.. స్టాలినే సీఎం

కమల్ తుస్.. స్టాలినే సీఎం

ఏబీపీ-సీఓటర్ ఒపీనియన్ పోల్ ఫలితాల ప్రకారం.. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో మక్కల్ నీది మయ్యూం(ఎంఎన్ఎం) పార్టీ చీఫ్ కమల్ హాసన్ ప్రభావం పనిచేయబోదని వెల్లడైంది. స్థానిక ద్రవిడ పార్టీలు ఎప్పటిలాగే తమ ప్రభావాన్నిచాటుకోనున్నాయి. అయితే, క్లీన్ మెజార్టీతో డీఎంకే విజయం సాధించడం దాదాపు ఖాయమని, ప్రస్తుతం ఆ పార్టీకి చీఫ్ గా కొనసాగుతోన్న ఎంకే స్టాలిన్ తమిళనాడుకు తర్వాతి చీఫ్ మినిస్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఏబీపీ-సీఓటర్ తెలిపింది. అసలైన ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలియాలంటే మరో ఐదు నెలలు ఆగాల్సిందే.

unnatural sex:బాలికపై మహిళ రేప్ -టీనేజర్ ఆత్మహత్య కేసులో టాటూ ఆర్టిస్ట్ అభిరామి అరెస్టుunnatural sex:బాలికపై మహిళ రేప్ -టీనేజర్ ఆత్మహత్య కేసులో టాటూ ఆర్టిస్ట్ అభిరామి అరెస్టు

English summary
With the assembly elections in Tamil Nadu just months away, the anti-incumbency cycle of past two Vidhan Sabhas is culminating into an advantage for the Dravida Munnetra Kazhagam (DMK) as per the Opinion Poll conducted by ABP News in collaboration with C-Voter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X