వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళలో సంచలనం: అసెంబ్లీ పోల్స్‌లో మళ్లీ లెఫ్ట్ గెలుపు -44ఏళ్ల రికార్డు -పినరయికి ఫిదా -బీజేపీ ఢమాల్

|
Google Oneindia TeluguNews

దేశంలోనే అత్యధిక విద్యావంతులు, అక్షరాస్యత అధికంగా ఉన్న కేరళలో రాజకీయాలు కూడా మిగతా రాష్ట్రాలకు భిన్నంగా ఉంటాయి. అక్కడ ప్రతి ఐదేళ్లకు ఒకసారి జనం భిన్నమైన తీర్పును ఇస్తూనే ఉన్నారు. అధికారంలో ఉన్న పార్టీ కచ్చితంగా ఓడిపోయి.. ప్రతిపక్షం అధికారంలోకి రావడం దశాబ్దాలుగా జరుగుతున్నదే. అయితే ఈ సారి మాత్రం సంచలనం నమోదు కాబోతోందని సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యంగా..

unnatural sex:బాలికపై మహిళ రేప్ -టీనేజర్ ఆత్మహత్య కేసులో టాటూ ఆర్టిస్ట్ అభిరామి అరెస్టుunnatural sex:బాలికపై మహిళ రేప్ -టీనేజర్ ఆత్మహత్య కేసులో టాటూ ఆర్టిస్ట్ అభిరామి అరెస్టు

 ఏబీపీ-సీఓటర్ ఒపీనియన్ పోల్

ఏబీపీ-సీఓటర్ ఒపీనియన్ పోల్

గతేడాది కరోనా విలయంలోనూ బీహార్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించిన ఎన్నికల సంఘం.. భాతర్ లో ప్రజాస్వామ్య ప్రక్రియకు అడ్డేదీ ఉండబోదని మరోసారి రుజువుచేసింది. ఇప్పటికే కరోనా ప్రభావం తగ్గడం, మాస్ వ్యాక్సినేషన్ కొనసాగుతోన్న దరిమిలా ఈఏడాది(2021)లో జరుగునున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై వేడి పెరిగింది. ఈ ఏడాది మార్చి-మేలో కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా.. ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉందనే దానిపై ప్రముఖ సర్వే సంస్థ సీ-ఓటర్.. జాతీయ మీడియా చానెల్ ఏబీపీ టీవీతో కలిసి ABP-CVoter 2021 Opinion Poll పేరుతో ఫలితాలను సోమవారం విడుదల చేసింది. ఆ లెక్కల ప్రకారం..

 మళ్లీ లెఫ్ట్ కూటమిదే అధికారం..

మళ్లీ లెఫ్ట్ కూటమిదే అధికారం..

ఏబీపీ-సీఓటర్ ఒపీనియన్ పోల్ ఫలితాల ప్రకారం కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కూడా లెఫ్ట్ కూటమి(ఎల్‌డీఎఫ్) విజయం సాధించబోతున్నది. మొత్తం 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీకి ఈ ఏడాది జరగబోయే ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీల ఆధ్వర్యంలోని ఎల్‌డీఎఫ్‌కు 41.6 శాతం ఓట్లతో 81 నుంచి 89 సీట్లు దక్కుతాయని, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి 36.6 శాతం ఓట్లతో 49 నుంచి 57 సీట్లకు పరిమితం అవుతుందని ఏబీపీ-సీఓటర్ సర్వేలో తేలింది. ఇక బీజేపీకి సున్నా నుంచి 2 సీట్లు, ఇతరకులకు సున్నా నుంచి 2సీట్లు దక్కే అవకాశం ఉందని ఒపీనియన్ పోల్ ఫలితాల్లో వెల్లడైంది. 2016 ఎన్నికల్లో లెఫ్ట్ కూటమికి 91 సీట్లు, యూడీఎఫ్ కు 47, ఇతరకులకు 2సీట్లు దక్కాయి. నిజానికి..

కేరళలో 44 ఏళ్ల రికార్డు బద్దలు..

కేరళలో 44 ఏళ్ల రికార్డు బద్దలు..

విద్యావంతులు ఎక్కువగా ఉన్న కేరళలో ప్రతి ఐదేళ్లకు ఒకసారి అధికార మార్పిడి తథ్యంగా ఉంటూ వస్తోంది. 1957నాటి తొలి అసెంబ్లీ ఎన్నికలు మొదలుకొని చివరిగా 2016దాకా కేవలం ఒకే ఒక్కసారి తప్ప అన్ని ఎన్నికల్లోనూ అధికార పార్టీ ఓడిపోతూనే ఉంది. చివరిగా 1977లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ వరుసగా రెండు సార్లు గెలుపొందిన రికార్డు ఉంది. మళ్లీ 44 ఏళ్ల తర్వాత 2021 ఎన్నికల్లో లెఫ్ట్ కూటమి ఆ రికార్డును బద్దలు కొట్టబోతున్నట్లు ఏబీపీ-సీఓటర్ 2021 ఒపీనియన్ పోల్ ఫలితాల్లో వెల్లడైంది. దీనికి కారణం..

 పినరయికి మలయాళీలు ఫిదా..

పినరయికి మలయాళీలు ఫిదా..

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కూడా లెఫ్ట్ కూటమి విజయం సాధించబోతుండటానికి ముఖ్యమంత్రి పినరయి విజయన్ పనితీరే ప్రధాన కారణమని ఏబీపీ-సీఓటర్ ఒపీనియన్ పోల్ ఫలితాల్లో వెల్లడైంది. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సర్వేలో పాల్గొన్నవాళ్లలో ఏకంగా 48 శాతం మంది సీఎం విజయన్ పనితీరు అద్భుతంగా ఉందని చెప్పడం గమనార్హం. పినరయి పని అద్భుతమని 48 శాతం మంది అంటే, చాలా బాగుందని 35 శాతం మంది, సంతృప్తికరంగా ఉందని 16శాతం మంది చెప్పారు. 0.1శాతం మంది మాత్రం ఏమీ చెప్పలేమని అన్నారుగానీ, విజయన్ పై వ్యతిరేకత మాత్రం ఎక్కడా కానరాలేదు. ఇక..

కేరళలో బీజేపీ లైట్.. మోదీ ఒకే..

కేరళలో బీజేపీ లైట్.. మోదీ ఒకే..

దక్షిణాదిలో కర్ణాటకను ఎప్పుడో హస్తగతం చేసుకున్న బీజేపీ.. ఇటీవల తెలంగాణలో మెరుగైన ఫలితాలు సాధించింది. కాగా, కేరళలో పాగా కోసం కమలనాథులు చాలా కాలంగా తీవ్ర కృషి చేస్తున్నా ఆశించిన ఫలితాలు రావడంలేదు. శబరిమల మొదలుకొని ఆలయాలపై రాజకీయాలు, లెఫ్ట్, రైట్ వింగ్ కార్యకర్తల మధ్య హత్యాకాండలు.. ఇలా కేరళలో బీజేపీ ఉనికి ప్రతిసారి వార్తల్లో నిలుస్తూనే వస్తున్నది. కాగా 2021 ఎన్నికల్లో బీజేపీ సున్నా నుంచి 2 సీట్లు మాత్రమే గెలుచుకోవచ్చని ఏబీపీ-సీఓటర్ సర్వేలో తేలింది. 2016 ఎన్నికల్లో బీజేపీకి ఒకే ఒక్క సీటు దక్కడం తెలిసిందే. కాగా, తాజా సర్వేలో కేంద్రంపై, ప్రధాని నరేంద్ర మోదీ తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన మలయాళీల శాతం బాగా పెరిగడం గమనార్హం. ప్రధానిగా మోదీ పనితీరు అద్భుతంగా ఉందని 33 శాతం మంది, బాగుందని 28 శాతం, సంతృప్తికరమని 39 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇక కేంద్ర సర్కారు పనితీరు చాలా బాగుందని 30 శాతం మంది, బాగుందని 28 శాతం, పర్వాలేదని 42శాతం మంది మలయాళీలు అభిప్రాయపడ్డట్టు ఏబీపీ-సీఓటర్ తెలిపింది.

కర్ణాటకను మహారాష్ట్రలో కలిపేస్తారా? -ఇంచు కూడా ఇవ్వం: ఠాక్రేపై యడ్డీ ఫైర్ -ముదిరిన సరిహద్దు వివాదంకర్ణాటకను మహారాష్ట్రలో కలిపేస్తారా? -ఇంచు కూడా ఇవ్వం: ఠాక్రేపై యడ్డీ ఫైర్ -ముదిరిన సరిహద్దు వివాదం

English summary
according to ABP-CVoter 2021 Opinion Poll, LDF likely To Take Lead in upcoming Kerala assembly election. kerala Chief Minister likely to regain power, the important factor leading him to victory is his work during coronavirus pandemic.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X