వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏబీపీ న్యూస్ ఎగ్జిట్ పోల్ : కాంగ్రెస్‌ అడ్డాలో కూడా పాగా వేస్తున్న బీజేపీ

|
Google Oneindia TeluguNews

ఉత్తరాదిలో యూపీ మినహా బీజేపీ ప్రభంజనం కొనసాగుతుందని ఏబీపీ న్యూస్ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో బీజేపీ విజయఢంకా మోగిస్తుందని స్పష్టం చేస్తున్నాయి. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ను కాదని బీజేపీ అభ్యర్థుల్ని లోక్‌సభకు పంపాలని ఓటర్లు నిర్ణయించినట్లు తెలుస్తోంది. మధ్య ప్రదేశ్‌లో మొత్తం 29 స్థానాలుండగా.. బీజేపీ గత ఎన్నికలతో పోలిస్తే 3 సీట్లు కోల్పోయి 24 సీట్లకు పరిమితం కానుందని తెలుస్తోంది. కాంగ్రెస్ ఐదు స్థానాల్లో గెలుపొందుతుందని, ఇతరులెవరూ ఖాతా తెరవరని ఏబీపీ న్యూస్ స్పష్టం చేస్తోంది.

ఏబీపీ న్యూస్ ఎగ్జిట్ పోల్ : యూపీలో క్లీన్ స్వీప్ చేయనున్న మహాకూటమిఏబీపీ న్యూస్ ఎగ్జిట్ పోల్ : యూపీలో క్లీన్ స్వీప్ చేయనున్న మహాకూటమి

రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయబావుటా ఎగిరేసిన కాంగ్రెస్ లోక్‌సభ ఎన్నికల్లో చతికిలపడినట్లు సర్వే వివరాలు చెబుతున్నాయి. రాజస్థాన్‌లో మొత్తం 25 స్థానాలుండగా.. బీజేపీ గత సార్వత్రిక ఎన్నికల కన్నా ఆరు సీట్లు కోల్పోయి 19స్థానాలు ఖాతాలో వేసుకుంటుందని తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 11 స్థానాలుండగా.. వాటిలో ఆరింటిని బీజేపీ తన అకౌంట్లో వేసుకోనున్నట్లు ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ 5స్థానాలను గెలుచుకోనున్నట్లు తెలుస్తోంది.

ABP Exit Poll 2019 predicts BJP will win majority seats in congress ruling states

ఉత్తరాఖండ్‌లో ఐదు లోక్‌సభ స్థానాల్లో బీజేపీ 4 సీట్లు నిలబెట్టుకుంటుండగా.. కాంగ్రెస్ ఒక్క స్థానానికి పరిమితమవుతుందని సర్వే లెక్కలు చెబుతున్నాయి. ఇక బీహార్‌లో 40స్థానాలకు జరిగిన ఎన్నికలో ఎన్డీయే తిరుగులేని విజయం సాధిస్తుందని సర్వే స్పష్టం చేస్తోంది. బీహార్‌లో బీజేపీ - జేడీయూ కూటమి 34 స్థానాల్లో విజయం సాధిస్తుందని, కాంగ్రెస్ 6 సీట్లను గెలుచుకుంటుందని ఏబీపీ న్యూస్ చెబుతోంది. జార్ఖండ్‌లోని 14 సీట్లలో బీజేపీ 8, కాంగ్రెస్ కూటమి 6స్థానాల్లో గెలుపొందుతుందని సర్వే స్పష్టం చేస్తోంది.

English summary
BJP set to win 24 out of 29 Lok Sabha seats in Madhya Pradesh. Congress may snap up 5 seats. In Rajasthan BJP likely to win 19 seats and congress may get the remaining 6 seats. Neck-and-battle predicted in Chhattisgarh's 11 Lok Sabha seats in abp exit polls
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X