వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏబీపీ-సీ ఓటర్ సర్వే : తమిళనాడులో డీఎంకె,పుదుచ్చేరిలో బీజేపీలదే అధికారం...

|
Google Oneindia TeluguNews

ఈ ఏడాది ఏప్రిల్ 6న జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తాజాగా ఏబీపీ-సీ ఓటర్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. ఆ సర్వే ప్రకారం...తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకె,కాంగ్రెస్‌లతో కూడిన యూపీఏ కూటమి 154-162 సీట్లు గెలుచుకోబోతున్నట్లు అంచనా వెలువడ్డాయి. మొత్తంగా 41శాతం ఓటింగ్ యూపీఏకి దక్కే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది.

అన్నాడీఎంకె,బీజేపీ,ఇతరులతో కూడిన ఎన్డీయే కూటమి కేవలం 28.61శాతం ఓట్లతో 58-66 సీట్లకు పరిమితమయ్యే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది. కమల్ హాసన్ నాయకత్వంలోని మక్కల్ నీది మయ్యమ్ పార్టీకి 2-6 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తేలింది.

abp news c voter opinion poll dmk will makes government in tamilnadu and bjp in puducherry

2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే అన్నాడీఎంకె,బీజేపీలతో కూడిన ఎన్డీయే కూటమికి మొత్తం 234 సీట్లలో 43.7శాతం ఓటింగుతో 136 సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే. అదే సమయంలో డీఎంకెకు 39.4శాతం ఓట్లతో 98 సీట్లు వచ్చాయి.

ఇక కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఈసారి బీజేపీ అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశం ఉన్నట్లు ఏబీపీ-సీ ఓటర్ సర్వేలో వెల్లడైంది. ఆ పార్టీ,దాని మిత్రపక్షాలకు కలిపి 17-21 సీట్లు,కాంగ్రెస్ దాని మిత్రపక్షాలకు కలిపి 8-12 సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు తేలింది.

కాగా,తమిళనాడులో ఏప్రిల్ 6న రాష్ట్రవ్యాప్తంగా ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.పుదుచ్చేరిలోనూ ఏప్రిల్ 6వ తేదీనే ఎన్నికలు జరగనున్నాయి. అసోం,బెంగాల్,కేరళ రాష్ట్రాలతో పాటు తమిళనాడు,పుదుచ్చేరి ఎన్నికల ఫలితాలు కూడా మే 2న వెల్లడికానున్నాయి.

ఈసారి ఎన్నికల్లో అన్నాడీఎంకె-బీజేపీ,డీఎంకె-కాంగ్రెస్ పొత్తుతో బరిలో దిగనున్నాయి. ఈ మేరకు సీట్ల పంపకాలపై ఇప్పటికే చర్చలు మొదలుపెట్టాయి. మరోవైపు మక్కల్ నీది మయ్యమ్ అధినేత,నటుడు కమల్ హాసన్ థర్డ్ ఫ్రంట్‌పై ఫోకస్ చేశారు. జాతీయ మీడియా కథనం ప్రకారం కాంగ్రెస్ పార్టీ 50 సీట్ల కోసం డీఎంకెను డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే డీఎంకె మాత్రం 2016 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 41 స్థానాల్లో పోటీ చేసి కేవలం 8 స్థానాల్లో మాత్రమే గెలుపొందిన విషయాన్ని గుర్తుచేస్తోంది. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య సీట్ల పంపకాలు ఇంకా కొలిక్కి రాలేదు. మరోవైపు బీజేపీకి అన్నాడీఎంకె 15 సీట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ మాత్రం తమకు ఎక్కువ సీట్లు కేటాయించాల్సిందేనని పట్టుబడుతున్నట్లు సమాచారం. మరో రెండు,మూడు రోజుల్లో ఈ సీట్ల పంపకాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

English summary
ABP News conducted the Opinion poll of the 5 poll bound states West Bengal, Assam, Tamil Nadu, Kerala, And Puducherry after the Election Commission announced the dates for polls. ABP News asked the people about the factors which would dominate while they vote for the next government and analysed the data along with CVoter for each state to find out the mood of the people.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X