వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ 4 ఏళ్ళ పాలన: మధ్యప్రదేశ్‌లో బిజెపి కంటే ముందంజలో కాంగ్రెస్, 15 శాతం ఓట్ల తేడా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నాలుగేళ్ళ మోడీ పరిపాలన తర్వాత మధ్యప్రదేశ్ రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బిజెపి కంటే మెరుగైన ఓట్ల శాతాన్ని సాధించనుంది. ఏబీపీ అనే జాతీయ న్యూస్ చానల్ మూడ్ ఆఫ్ ది నేషనల్ పేరుతో దేశ వ్యాప్తంగా నాలుగేళ్ళ మోడీ పాలనపై సర్వే నిర్వహించింది. ఆ ఫలితాలను వెల్లడించింది. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఏబీపీ న్యూస్ సీఎస్‌డిఎస్ సర్వే నిర్వహించింది. ఆ సర్వేఫలితాలను ఆ ఛానెల్ విడుదల చేసింది.

2014 ఎన్నికల తర్వాత మోడీ అధికారంలోకి వచ్చారు. మోడీ అధిాకరంలోకి వచ్చి నాలుగేళ్ళు పూర్తైన తర్వాత ఏబీపీ ఛానెల్ సర్వే నిర్వహించింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి కంటే కాంగ్రెస్ మెరుగైన ఓట్లను సాధించనున్నట్టు ఈ సర్వే ఫలితాలను వెల్లడించింది.

 ABP News-CSDS survey: Congress way ahead of BJP in Madhya Pradesh

త్వరలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో బిజెపి కంటే కాంగ్రెస్ కు ఎక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వే ఫలితాలు వెల్లడించాయి. కాంగ్రెస్ పార్టీకి 49 ఓట్లు వస్తే. బిజెపికి కేవలం 34 శాతం మాత్రమే ఓట్లు వస్తాయని ఈ సర్వే తేల్చింది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 230 అసెంబ్లీ సీట్లున్నాయి.త్వరలో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఇటీవలనే కమల్‌నాద్ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. అయితే కమల్ నాద్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత పార్టీలోని అన్ని వర్గాలు కలిసి పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహించాయి.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ యువ ఎంపీ జ్యోతిరాదిత్యకు కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలను అప్పగించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 14 ఏళ్ళుగా బిజెపి ఇచ్చిన హమీలు అమలు చేయకుండా ఉన్న అంశాలను రానున్న ఎన్నికల్లో ప్రధానంగా ప్రస్తావించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

గత ఎన్నికల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి 165 సీట్లను గెలుచుకొంది. కాంగ్రెస్ పార్టీ 58, బిఎస్పీ 4 సీట్లను కైవసం చేసుకొంది. 2019 జనవరిలో మధ్యప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

English summary
The Congress is performing rather well in Madhya Pradesh where it is ahead of the BJP by a comfortable margin of 15 per cent vote share, a survey conducted by ABP News and CSDS has found.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X